![National Company Law Tribunal approves sale of IL&FS education bussiness - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/3/SCHOOLNET.jpg.webp?itok=QCe6Cqeu)
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లోని విద్యా రంగ సంస్థ విక్రయానికి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతినిచ్చింది. స్కూల్‌నెట్ ఇండియా (గతంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్)లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కున్న 73.69% వాటాలను ఫలాఫల్ టెక్నాలజీకి విక్రయించేందుకు ఆమోదం తెలిపింది. ఫలాఫల్ మాతృసంస్థ లెక్సింగ్టన్ ఈక్విటీ హోల్డింగ్స్ (ఎల్‌ఈహెచ్‌ఎల్)కు ఇప్పటికే స్కూల్‌నెట్‌లో 26.13 శాతం వాటా ఉంది. స్కూల్‌నెట్‌కు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్ (ఐసీడీఐ), స్కిల్ ట్రెయినింగ్ అసెస్‌మెంట్ మేనేజ్‌మెంట్ పార్ట్‌నర్స్ (ఎస్‌టీఏఎంపీ) అనే రెండు అనుబంధ సంస్థలు ఉన్నాయి. అలాగే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐఎస్‌డీసీ)లో కూడా 80% వాటాలు ఉన్నాయి. తాజా ఫలాఫల్ టెక్నాలజీ దాఖలు చేసిన బిడ్ ప్రకారం స్కూల్‌నెట్‌లో సుమారు 73 శాతం వాటాలను రూ. 7.39 కోట్లకు కొనుగోలు చేయడంతో పాటు ఆ సంస్థ రుణాలను కూడా తీర్చేందుకు సంస్థ అంగీకరించింది. దీంతో డీల్‌కు మార్గం సుగమమైంది. ఈ లావాదేవీ పూర్తయితే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ మొత్తం రుణభారం సుమారు రూ. 600 కోట్లు తగ్గుతుందని సంబంధిత వర్గాలు తెలపాయి.
Comments
Please login to add a commentAdd a comment