
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో టెక్ దిగ్గజం గూగుల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. యాప్ స్టోర్ బిల్లింగ్ విధానం సమంజసంగా లేదని, డెవలపర్లకు పరిమితులు విధించేదిగా ఉందని జరిమానా విధిస్తూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇచి్చన ఉత్తర్వులను ఎన్‌సీఎల్‌ఏటీ సమర్ధించింది. అయితే, పెనాల్టీ పరిమాణాన్ని రూ. 936.44 కోట్ల నుంచి రూ. 216 కోట్లకు తగ్గించింది.
గుగుల్ తన గుత్తాధిపత్యాన్ని దురి్వనియోగం చేసిందంటూ 104 పేజీల ఆర్డరులో వ్యాఖ్యానించింది. కానీ, వివిధ అంశాల ప్రాతిపదికన యాప్‌లపై 15 నుంచి 30 శాతం వరకు సరీ్వస్ ఫీజులను వసూలు చేయడంలో టెక్ దిగ్గజం ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని ఎన్‌సీఎల్‌ఏటీ పేర్కొంది. గూగుల్ ఇప్పటికే పెనాలీ్టలో 10 శాతం మొత్తాన్ని డిపాజిట్ చేసిందన, మిగతా మొత్తాన్ని 30 రోజుల్లోగా డిపాజిట్ చేయాలని ఆదేశించింది.