మొబైల్ వెబ్ బ్రౌజర్‌లు, ఆన్‌లైన్ వీడియో హోస్టింగ్‌లలో క్రోమ్, యూట్యూబ్ వంటి యాప్‌ల స్థానాన్ని కాపాడుకోవడానికి ఆన్‌లైన్ సెర్చ్, ఆండ్రాయిడ్ కోసం యాప్ స్టోర్ వంటి మార్కెట్‌లలో గూగుల్ తన ఆధిపత్య స్థానాన్ని ఉపయోగించుకుందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) గూగుల్‌కు రూ.1,338 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అనుచిత వ్యాపార విధానాలు అమలు చేయడాన్ని మానుకోవాలని ఆదేశించింది. నిర్దిష్ట వ్యవధిలోగా తన తీరును మార్చుకోవాలని సూచించింది. అయితే భారత్ నిర్ణయంపై గూగుల్ స్పందించింది.
భారత్ నిర్ణయం.. దేశంలోని వినియోగదారులు, వ్యాపారాలకు పెద్ద ఎదురుదెబ్బ అని గూగుల్ తెలిపింది. ఆండ్రాయిడ్ అనేది వినియోగదారులకు ఏం కావాలో.. దాన్ని ఎంపిక చేసేందుకువ వీలుగా సృష్టించింది ఈ ఆండ్రాయిడ్. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారందరికి మద్దతుగా నిలుస్తుందని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు.
సీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అటు కొనుగోలుదారులకు ఇటు వ్యాపారస్థులకు ఇది పెద్ద ఎదురు దెబ్బ. సెక్యూరిటీ పరంగా ఆండ్రాయిడ్ ఫీచర్‌ను వినియోగిస్తున్న వారందరూ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మొబైల్ ధరలు పెరుగుతాయని వెల్లడించారు.
చదవండి👉 గూగుల్‌కు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment