ఐఎల్‌ఎఫ్‌ఎస్ మాజీ సీఎండీ రమేష్ బావా (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ( ఐఎల్‌ఎఫ్‌ఎస్) సంక్షోభం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఎల్ ఎఫ్ఎస్ మాజీ ఎండీ, సీఈవో రమేష్ బావాను తీవ్రమైన నేరాల దర్యాప్తు కార్యాలయం (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, ఎస్ఎఫ్ఐఓ) అరెస్టు చేసింది. గ్రూప్ ఎంటిటీలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా అధికారులు ఈ చర్య తీసుకున్నారు.
భారీగా పన్ను ఎగవేత కేసులో ఆరోపణులు ఎదుర్కొంటున్న రమేష్ బావా తనను అరెస్టు చేయకుండా, క్రిమినల్ ప్రొసిడింగ్స్ ఆపివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించిన కొద్ది రోజుల అనంతరం ఈ అరెస్ట్ జరిగింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తు సంస్థ అయిన ఎస్ఎఫ్ఐఓ కంపెనీల చట్టం 447 సెక్షన్ ప్రకారం రమేష్ బావాను అదుపులో తీసుకుంది. కాగా రూ.94,215 కోట్ల రుణ ఐఎల్‌ఎఫ్‌ఎస్ గ్రూపు సంస్థల రుణ భారంమొత్తం రూ. 94వేల కోట్లు. ఈ కేసులో ఏప్రిల్ 1న సంస్థ మాజీ చైర్మన్ హరి శంకర్‌ను ఎస్ఎఫ్ఐఓ అరెస్టు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment