Willful defaulter
-
ఎన్సీఎల్ఏటీకి ఐఎల్అండ్ఎఫ్ఎస్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఐఎల్అండ్ఎఫ్ఎస్ తాజాగా జాతీయ కంపెనీ చట్ట అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ని ఆశ్రయించింది. గ్రూప్ కంపెనీలను ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారు(విల్ఫుల్ డిఫాల్టర్)గా ప్రకటించేందుకు ప్రభుత్వ రంగానికి చెందిన 11 రుణదాత సంస్థలు చర్యలు ప్రారంభించడంతో రక్షణ కలి్పంచమంటూ అపీలేట్కు అత్యవసర దరఖాస్తు చేసుకుంది. రుణదాతలను నిలువరించమని అభ్యరి్థస్తూ ఐఎల్అండ్ఎఫ్ఎస్ కొత్త బోర్డు ఎన్సీఎల్ఏటీకి ఫిర్యాదు చేసింది. బ్యాంకులు ఎన్సీఎల్ఏటీ గత ఆదేశాలను పాటించకపోవడం వల్ల నష్టపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆర్బీఐ నిబంధనల ముసుగులో గ్రూప్ కంపెనీల డైరెక్టర్లను బ్యాంకులు వేధిస్తున్నాయని తెలిపింది. విల్ఫుల్ డిఫాల్టర్ గుర్తింపు కమిటీముందు వ్యక్తిగత హాజరుకు డిమాండు చేస్తూ బ్యాంకులు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు బెదిరించడంతోపాటు .. ప్రస్తుత డైరెక్టర్లు గ్రూప్ కంపెనీలను విల్ఫుల్ డిఫాల్టర్లుగా ప్రకటించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించింది. -
ఎస్బీఐ కొరడా :15 రోజులు గడువు
సాక్షి,ముంబై : ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బడా ఎగవేతదారులపై సీరియస్ చర్యలకు దిగింది. తాజాగా 10మంది "ఉద్దేశపూర్వక ఎగవేతదారులు" పై కొరడా ఝళిపించింది. పదే పదే హెచ్చరికలు జారీ చేసినా బకాయిలు చెల్లించకపోవడంతో పది మందితో కూడిన ఎగవేతదారుల జాబితాను శుక్రవారం వెల్లడించింది. తక్షణమే బకాయిలు చెల్లించాలని లేదంటే..చర్యలు తప్పవని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ముంబైకి చెందిన ఫార్మ, జెమ్స్ అండ్ జ్యుయల్లరీ, పవర్ సంస్థలతోపాటు, ఈ సంస్థలకు చెందిన టాప్ అధికారులు ఉన్నారు. స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్మెంట్ బ్రాంచ్ 1 ఈ మేరకు పబ్లిక్ నోటీసు జారీ చేసింది. దాదాపు 1,500 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించాల్సి వుందని పేర్కొంది. రాబోయే 15 రోజుల్లో వడ్డీ, ఇతర ఛార్జీలతో సహా బకాయిలను చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్బీఐ హెచ్చరించింది. -
ఎగవేతదారులకు పీఎస్యూ బ్యాంకుల షాక్
న్యూఢిల్లీః కొండల్లా పేరుకుపోయిన రుణ బకాయిల వసూళ్లకు పీఎస్యూ బ్యాంకుల్లో కదలిక వచ్చింది. రూ 70,000 కోట్ల రుణాలు చెల్లించాల్సిన 5954 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై ప్రభుత్వ రంగ బ్యాంకులు లోన్ రికవరీ యాక్షన్ చేపట్టాయి.ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలోని 21 బ్యాంకులు 5954 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై సర్ఫేసి చట్టం కింద చర్యలు తీసుకున్నాయి.రూ 20943 కోట్ల రుణాల వసూలు కోసం 1,444 మంది డిఫాల్టర్లపై దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ చర్యలు చేపట్టగా, మిగిలిన 20 బ్యాంకులు రూ 48,496 కోట్ల రుణ బకాయిల వసూలు నిమిత్తం 4510 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చర్యలు తీసుకున్నాయి. పీఎస్యూ బ్యాంకులకు మొత్తం రూ 92,376 కోట్లు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల బకాయిలున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్య పది శాతం పెరగడం ఆందోళనకరమని తెలిపాయి. 2016-17లో ఎస్బీఐ సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ 81,683 కోట్ల రుణాలను రద్దు చేశాయి. -
ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు కఠినతరం
ముంబై: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరోసారి సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా డీలిస్టింగ్కు తాజా నిబంధనలు ప్రకటించడంతోపాటు దాదాపు రెండు దశాబ్దాల కాలంనాటి ఇన్సైడర్ నియంత్రణలను సంస్కరించే బాటలో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ అంశంలో స్పష్టతనిస్తూ ఇన్సైడర్లకు అర్థాన్ని విసృ్తతం చేసింది. అంతేకాకుండా వీటివల్ల చట్టబద్ధ బిజినెస్ లావాదేవీలకు ఇబ్బందులు తలెత్తకుండా మార్గదర్శకాలను జారీ చేసింది. ఏదైనా ఒక కంపెనీకి చెందిన ఒప్పందాలు, విశ్వాసపాత్రులు, కీలక ఉద్యోగ సంబంధాలు వంటి అంశాలకు సంబంధించిన బయటకు వెల్లడించని సమాచారాన్ని తెలుసుకోగలిగిన వ్యక్తులను ఇన్సైడర్లుగా సెబీ వ్యక్తీకరించింది. సంబంధిత కంపెనీ షేరు ధర ప్రభావితమయ్యే ఇలాంటి సమాచారాన్ని అందుకోగలిగిన వ్యక్తులను ఇన్సైడర్లుగా పేర్కొంది. అయితే వీరికి దగ్గరి బంధువులు, తదితర సంబంధీకులు ఇన్సైడర్ సమాచారాన్ని పొందలేదన్న విషయంలో తమ నిజాయితీని నిరూపించుకోవాలని సెబీ తెలిపింది. లేనిపక్షంలో వీరు కూడా ఇన్సైడర్లకిందకు వస్తారని తెలిపింది. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు(విల్ఫుల్ డిఫాల్టర్లు) క్యాపిటల్ మార్కెట్లను వినియోగించుకోకుండా ఆంక్షలు విధించింది. బుధవారం సమావేశమైన బోర్డు సమావేశంలో తాజా నిబంధనలను ఆమోదించింది. కనీసం 25% ఓకే అంటేనే: మొత్తం విధానాలు ప్రతిబంధకంగా నిలవకుండా సెబీ కొన్ని నిబంధనల్లో సవరణలు చేపట్టింది. ఎక్స్ఛేంజీల నుంచి కంపెనీలు డీలిస్టింగ్ కావడానికి పట్టే సమయాన్ని సగానికి కుదించింది. ఇందుకు ప్రస్తుతం 137 రోజుల సమయం పడుతుండగా, ఇకపై 76 రోజులకు పరిమితంకానుంది. రివర్స్ బుక్ బిల్డింగ్ విధానంలో కనీసం 25% వాటాదారులు పాల్గొంటే డీలిస్టింగ్ విజయవంతంకానుంది. ఇన్సైడర్ నిబంధనలకు సంబంధించి అంతర్జాతీయ చట్టాలతో అనుసంధానం చేయనుంది. విల్ఫుల్ డిఫాల్టర్స్గా ముద్రపడిన కంపెనీలు, ప్రమోటర్లు, డెరైక్టర్లు క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధులను సమీకరించకుండా నిబంధనల్లో మార్పు చేసింది. రెండు పథకాలకే చాన్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీల కనీస నెట్వర్త్ను రూ. 10 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు పెంచింది. ఇందుకు మూడేళ్ల కాలాన్ని గడువుగా సెబీ ప్రకటించింది. కనీసం రూ. 50 కోట్ల నెట్వర్త్ను అందుకోని ఫండ్ హౌస్లు ఏడాదికి గరిష్టంగా 2 పథకాలనే ప్రవేశపెట్టేందుకు వీలుంటుంది.