
సాక్షి,ముంబై : ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బడా ఎగవేతదారులపై సీరియస్ చర్యలకు దిగింది. తాజాగా 10మంది "ఉద్దేశపూర్వక ఎగవేతదారులు" పై కొరడా ఝళిపించింది. పదే పదే హెచ్చరికలు జారీ చేసినా బకాయిలు చెల్లించకపోవడంతో పది మందితో కూడిన ఎగవేతదారుల జాబితాను శుక్రవారం వెల్లడించింది. తక్షణమే బకాయిలు చెల్లించాలని లేదంటే..చర్యలు తప్పవని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ప్రధానంగా ముంబైకి చెందిన ఫార్మ, జెమ్స్ అండ్ జ్యుయల్లరీ, పవర్ సంస్థలతోపాటు, ఈ సంస్థలకు చెందిన టాప్ అధికారులు ఉన్నారు. స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్‌మెంట్ బ్రాంచ్ 1 ఈ మేరకు పబ్లిక్ నోటీసు జారీ చేసింది. దాదాపు 1,500 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించాల్సి వుందని పేర్కొంది. రాబోయే 15 రోజుల్లో వడ్డీ, ఇతర ఛార్జీలతో సహా బకాయిలను చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌బీఐ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment