reveals names
-
విమానం నుంచి పడిపోయిన ఘటన: అన్నదమ్ముల విషాద గాథ
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ఇటీవల విమానం పైనుంచి ఇద్దరు కిందపడిన విషయం తెలిసిందే. ప్రపంచాన్ని మొత్తం ఆ ఘటన నివ్వెరపరిచింది. తాజాగా ఆ ఇద్దరి వ్యక్తుల వివరాలు తెలిశాయి. తాలిబన్ల పాలనలో తాము నరకం అనుభవిస్తామనే ఆందోళనతో ఆ ఇద్దరు హడావుడిగా విమానం ఎక్కారని సమాచారం. ఆ విమానం నుంచి మొత్తం ముగ్గురు కిందపడగా ఆ వీడియోలో మాత్రం ఇద్దరే కనిపించారు. తాజాగా వారిలో ఇద్దరి వివరాలు తెలిశాయి. చదవండి: నరకయాతన.. విమానం నుంచి కిందపడిన ఇద్దరు అఫ్గన్లు కిందపడిన ముగ్గురిలో ఇద్దరు రెజా (17), కబీర్ (16). వీరు సొంత అన్నదమ్ములు. వీరి కుటుంబంలో 8 మంది ఉంటారు. అయితే తాలిబన్లు తమ దేశాన్ని వశం చేసుకున్నారనే వార్త తెలుసుకున్న ఈ అన్నదమ్ములు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో కెనడా, అమెరికాలో అఫ్గన్ దేశస్తులకు ఆశ్రయిస్తున్నట్లు స్థానికులు మాట్లాడుకుంటుంటే వీరిద్దరూ విన్నారంట. దీంతో వెంటనే కుటుంబసభ్యులకు చెప్పాపెట్టకుండా ఇంట్లోని గుర్తింపు కార్డులు పట్టుకుని కాబూల్‌లోని విమానాశ్రయానికి పరుగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ కదులుతున్న అమెరికా యుద్ధ విమానం ఎలాగైనా ఎక్కాలని భావించి అతికష్టంగా విమానం రెక్కపై ఎక్కి కూర్చున్నారు. ఎగిరిన తర్వాత విమానం పైనుంచి రెజా, కబీర్ ఇద్దరూ కిందపడిపోయారు. ఆ పడిపోతున్న వీడియో ప్రపంచాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. అయితే రెజా మృతదేహం విమానాశ్రయం సమీపంలోని ఓ భవనంపై పడి ఉంది. పైనుంచి కిందపడడంతో రెజా కాళ్లు, చేతులు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. విగతజీవిగా పడి ఉన్న రెజాను కుటుంబసభ్యులు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. మరో యువకుడు కబీర్ జాడ ఇంతవరకు తెలియరాలేదు. అతడి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో ప్రజలు, అఫ్గాన్ సైన్యం తాలిబన్లపై నిరసనగళం వినిపిస్తన్నారు. నిరాయుధులైన ప్రజలను సాయుధ తాలిబన్లు చావబాదుతున్నారు. అఫ్గాన్ పరిణామాలపై ప్రపంచ దేశాలు ఏం చేయాలో సమాలోచనలు చేస్తున్నాయి. చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ -
ఎస్బీఐ కొరడా :15 రోజులు గడువు
సాక్షి,ముంబై : ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బడా ఎగవేతదారులపై సీరియస్ చర్యలకు దిగింది. తాజాగా 10మంది "ఉద్దేశపూర్వక ఎగవేతదారులు" పై కొరడా ఝళిపించింది. పదే పదే హెచ్చరికలు జారీ చేసినా బకాయిలు చెల్లించకపోవడంతో పది మందితో కూడిన ఎగవేతదారుల జాబితాను శుక్రవారం వెల్లడించింది. తక్షణమే బకాయిలు చెల్లించాలని లేదంటే..చర్యలు తప్పవని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ముంబైకి చెందిన ఫార్మ, జెమ్స్ అండ్ జ్యుయల్లరీ, పవర్ సంస్థలతోపాటు, ఈ సంస్థలకు చెందిన టాప్ అధికారులు ఉన్నారు. స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్మెంట్ బ్రాంచ్ 1 ఈ మేరకు పబ్లిక్ నోటీసు జారీ చేసింది. దాదాపు 1,500 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించాల్సి వుందని పేర్కొంది. రాబోయే 15 రోజుల్లో వడ్డీ, ఇతర ఛార్జీలతో సహా బకాయిలను చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్బీఐ హెచ్చరించింది. -
ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో పేర్లు వెల్లడి
-
ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో పేర్లు వెల్లడి
న్యూఢిల్లీ: అంతర్జాతీ క్రికెట్‌ను కుదిపేసిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసును విచారించిన ముద్గల్ కమిటీ నివేదికలో ఉన్న కొన్ని పేర్లను సుప్రీం కోర్టు వెల్లడించింది. ముద్గల్ కమిటీ వెల్లడించిన పేర్లలో ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్, ఆయన అల్లుడు గురునాథ్ మేయప్పన్, క్రికెటర్లు స్టువర్ట్ బిన్నీ , ఓవైషా, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా, ఐపీఎల్ అధికారి సుందర్ రామన్ ఉన్నారు. కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంపై విచారణ చేయడానికి ముద్గల్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్ సీజన్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ జరిగినట్టు ఆరోపణలు రావడం కలకలం రేకెత్తించింది. ఈ కేసులో పలువురు ప్రముఖులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో క్రికెటర్లు, ఐపీఎల్ అధికారులు ఉన్నారు. ఈ కేసును విచారించేందుకు ముద్గల్ కమిటీని నియమించారు. ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ముద్గల్ కమిటీ తమ నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది.