ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో పేర్లు వెల్లడి | supreme court reveals names in mudgal committe report | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో పేర్లు వెల్లడి

Published Fri, Nov 14 2014 3:09 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో పేర్లు వెల్లడి - Sakshi

ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో పేర్లు వెల్లడి

న్యూఢిల్లీ: అంతర్జాతీ క్రికెట్ను కుదిపేసిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసును విచారించిన ముద్గల్ కమిటీ నివేదికలో ఉన్న కొన్ని పేర్లను సుప్రీం కోర్టు వెల్లడించింది.

ముద్గల్ కమిటీ వెల్లడించిన పేర్లలో ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్, ఆయన అల్లుడు గురునాథ్ మేయప్పన్, క్రికెటర్లు స్టువర్ట్ బిన్నీ , ఓవైషా, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా, ఐపీఎల్ అధికారి సుందర్ రామన్ ఉన్నారు. కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంపై విచారణ చేయడానికి ముద్గల్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.

గతేడాది ఐపీఎల్ సీజన్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ జరిగినట్టు ఆరోపణలు రావడం కలకలం రేకెత్తించింది. ఈ కేసులో పలువురు ప్రముఖులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో క్రికెటర్లు, ఐపీఎల్ అధికారులు ఉన్నారు. ఈ కేసును విచారించేందుకు ముద్గల్ కమిటీని నియమించారు. ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ముద్గల్ కమిటీ తమ నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement