ipl spot fixing
-
టాప్ ప్లేయర్‌కు బుకీలతో లింక్స్!
న్యూఢిల్లీ : ఐపీఎల్- 2013 సీజన్లో చోటుచేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది కూడా. అదే విధంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు వేటు పడింది. అయితే స్పాట్ ఫిక్సింగ్ విచారణలో భాగమైన సీనియర్ పోలీస్ ఆఫీసర్ బీబీ మిశ్రా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రపంచ కప్- 2011 విజేతగా నిలిచిన భారత జట్టులో భాగమైన ఓ సీనియర్ ఆటగాడికి పలువురు బుకీలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ 2013 స్పాట్ ఫిక్సింగ్ విచారణలో భాగంగా ఓ బుకీతో మాట్లాడిన సమయంలో తనకు ఈ విషయం తెలిసిందన్నారు. అయితే ఆ ఆటగాడి పేరు బయటపెట్టేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. నాకంత సమయం లేదు అందుకే... ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో భాగంగా తొమ్మిది మంది ఆటగాళ్లను విచారించానన్న మిశ్రా... ఇందులో భాగంగా పలువురు బుకీలతో మాట్లాడానన్నారు. ‘2008- 09 నుంచే సదరు సీనియర్ ఆటగాడు బుకీలతో కాంటాక్ట్‌లో ఉన్నాడు. భారత్‌లో జరిగిన వివిధ అంతర్జాతీయ మ్యాచులకు సంబంధించి అతడు బుకీలతో మాట్లాడాడు. ఇందుకు సాక్ష్యంగా ఆ ఆటగాడు తనతో జరిపిన వాయిస్ రికార్డును నాకు ఇస్తానని ఆ బుకీ చెప్పాడు. కానీ చివరి నిమిషంలో అతడు వెనక్కి తగ్గాడు. అయితే కేవలం తొమ్మిది మంది ఆటగాళ్లు, శ్రీనివాసన్, గురునాథ్ మయప్పన్(చెన్నై సూపర్ కింగ్స్), రాజ్‌కుంద్రా (రాజస్తాన్ రాయల్స్), సుందర్ రామన్(ఐపీఎల్ మాజీ సీఓఓ)లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడమే నా ముఖ్య విధి. అందుకే ఆ సీనియర్ ఆటగాడి గురించి తెలుసుకునేందుకు తగినంత సమయం కేటాయించలేకపోయానంటూ’ మిశ్రా వ్యాఖ్యానించారు. -
ఈ సీజన్ ఐపీఎల్‌ను అడ్డుకోండి!
సాక్షి, చెన్నై : మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను నిలిపివేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రజావ్యాజ్యం కింద పిటిషన్ దాఖలు చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లు జరగకుండా నివారణ చర్యలు చేపట్టే వరకు ఐపీఎల్ నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఎనిమిది ఐపీఎల్ జట్లను పిల్లో ప్రతివాదులుగా చేర్చారు. పిల్ దాఖలు చేసిన ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ గతంలో చెన్నై దర్యాప్తు అధికారిగా పనిచేస్తున్న సమయంలో ఐపీఎల్ బుకీల నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఐపీఎస్ అధికారి నాలుగు ఏళ్లపాటు సస్పెండ్ అయ్యారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అతనిపై నమోదు చేసిన చార్జీషీట్లు కోట్టెయడంతో గత మార్చిలో తిరిగి ఉద్యోగంలో చేరారు. ఐపీఎల్‌ను పూర్తిగా నిషేదించాలని తాను కోరుకోవడంల లేదని, కొత్త సీజన్ మొదలయ్యే ముందే బెట్టింగ్ నిరోధించే ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నదే తన వినతి అని సంపత్ ఆ పిల్లో స్పష్టంచేశారు. తాను దాఖలు చేసిన పిల్‌ను బుధవారం విచారించే అవకాశం ఉందని ఆయన మీడియాకు తెలిపారు. ఇక ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఏప్రిల్ 7 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్ ఫిక్సింగ్; మరో ఇద్దరు క్రికెటర్లపై వేటు
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో మరో ఇద్దరు క్రికెటర్లపై వేటు పడింది. అజిత్ చండీలాపై జీవితకాలం, హీకెన్ షాపై ఐదేళ్ల చొప్పున బీసీసీఐ నిషేధం విధించింది. బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల బృందం సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. 2013 ఐపీఎల్ సీజన్లో అప్పటి రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్లతో పాటు చండీలాను ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశాంత్, చవాన్లపై ఇప్పటికే బీసీసీఐ జీవితకాల నిషేధం విధించగా, తాజాగా చండీలా, ముంబై క్రికెటర్ హీకేన్ షాలపై చర్యలు తీసుకుంది. -
'బీసీసీఐ మీటింగ్‌లకు ఆయన హాజరుకావచ్చా?'
ముంబయి : బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఐసీసీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ విషయమై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) శనివారం నాడు సుప్రీంకోర్టును సంప్రదించాల్సి వచ్చింది. బీసీసీఐ అధికారిక సమావేశాలకు శ్రీని హాజరు కావచ్చా.. లేదా అనే విషయంపై స్పష్టత కోసం బోర్డు సభ్యులు సుప్రీంకోర్టు సలహాను కోరారు. నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఆయనకు చెందిన ఇండియా సిమెంట్స్ వాటాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం నేపథ్యంలో నిషేధానికి రెండు జట్లపై ఐపీఎల్ చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించడానికి గత నెలలో సమావేశం ఏర్పాటు చేయగా.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తరఫున శ్రీని హాజరుకావడంతో సమావేశం రద్దయింది. ఎందుకంటే చెన్నై ఫ్రాంచైజీకి శ్రీని కంపెనీ ఇండియా సిమెంట్స్ వాటాలను ఎలా అమ్మిందన్న దానిపై స్పష్టతలేని కారణంగా కొంత సందిగ్ధత నెలకొందన్నది వాస్తవం. ఫిక్సింగ్ ఆరోపణలు రుజువైనందున జస్టిస్ లోథా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్లపాటు నిషేధం విదించిన విషయం విదితమే. -
చెన్నై సూపర్ కింగ్స్‌కు చుక్కెదురు
చెన్నై: నిషేధానికి గురైన ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. చెన్నై జట్టుకు ఐపీఎల్ లీగ్ నుంచి రెండేళ్ల నిషేధంపై స్టే ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు నియమించిన జస్టీస్ లోథా కమిటీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 23కు ఈ కేసును వాయిదా వేశారు. చీఫ్ జస్టిస్ సంజయ్ విషన్ కౌల్, జస్టిస్ టీఎస్ శివంగ్నానమ్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ కేసును వాయిదా వేస్తూ తీర్పు వెల్లడించారు. బీసీసీఐ నిర్ణయం వెలువడిన తర్వాత ఈ జట్ల నిషేధంపై తీర్పు వెల్లడించడానికి వీలుంటుంది. ఆగస్టు 28న బీసీసీఐ అధికారులు ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన జట్లపై ఓ నిర్ణయాన్ని తీసుకునేందుకు సమావేశం కానున్నారు. సమావేశం ముగిసిన తర్వాత బీసీసీఐ వెల్లడించే నిర్ణయాన్ని బట్టి ఆ జట్లపై తుది నిర్ణయాన్ని తీసుకుని లీగ్ సభ్యులకు సూచనలిస్తారు. అవసరమైతే రెండు కొత్త జట్ల కోసం టెండర్ వేసే అవకాశాలు లేకపోలేదు. ఐపీఎల్-6 సీజన్లో ఆ జట్ల యజమానులు గురునాథ్ మేయప్పన్, రాజ్ కుంద్రాలు ఫిక్సింగ్ చేశారన్న ఆరోపణలతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను రెండేళ్ల పాటు ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు ఆడకూడదని నిషేధించిన విషయం విదితమే. -
ఐపీఎల్ నుంచి చెన్నై, రాజస్థాన్ అవుట్
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై వేటు పడింది. రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ . సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పు ఖరారు చేసింది. ఈరోజు నుంచే అమల్లోకి వస్తుందని వస్తుందని ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాపై జీవితకాల నిషేధం విధించింది. వీరిద్దరూ క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనకుండా నిషేధం పెట్టింది. మేయప్పన్, కుంద్రా బెట్టింగ్ వ్యవహారాలతో బీసీసీఐ, ఐపీఎల్ తో పాటు క్రికెట్ కు చెడ్డ పేరు వచ్చిందని లోధా కమిటీ పేర్కొంది. -
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై తీర్పు రేపు
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో మంగళవారం తీర్పు వెలువడనుంది. సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పును ఖరారు చేయనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెన్నై, రాజస్థాన్ భవితవ్యం తేలనుంది. 2013 ఐపీఎల్ సీజన్‌ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో మేయప్పన్, రాజ్‌కుంద్రాపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్ కేసును విచారించడానికి జనవరిలో సుప్రీం కోర్టు.. మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర లోధా సారథ్యంలో కమిటీని నియమించింది. రాజ్‌కుంద్రా, మేయప్పన్లు బెట్టింగ్‌కు పాల్పడ్డారని తేలినట్టు సమాచారం. చెన్నై, రాజస్థాన్ జట్లను నిషేధించవచ్చని లేదా ఈ రెండు జట్లకు భారీ జరిమానా విధించవచ్చని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
చవాన్‌కు రూ. 32 లక్షలు చెల్లించిన ఎంసీఏ
ముంబై: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌తో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న అంకిత్ చవాన్‌కు ముంబై క్రికెట్ అసోసియేషన్ 2012-13 రంజీ సీజన్‌కు సంబంధించిన బకాయిలను చెల్లిం చింది. మ్యాచ్ ఫీజులు, బోనస్‌తో కలిపి మొత్తం రూ. 32 లక్షలను ఇచ్చామని ఎంసీఏ ఉపాధ్యక్షుడు రవి సావంత్ తెలిపారు. ‘బకాయిల చెల్లింపు అంశంపై బీసీసీఐ అనుమతి కోసం గతేడాది నవంబర్‌లో లేఖ రాశాం. కానీ మార్చి వరకూ బోర్డు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో చేసేదేమీలేక బకాయిలు విడుదల చేశాం. చవాన్‌పై నిషేధం ఉంది కాబట్టి బోర్డు నుంచి అనుమతి కోరాల్సి వచ్చింది’ అని సావంత్ పేర్కొన్నారు. -
ఇకపై.. ఏదో ఒక్క పదవిలోనే..!
-
ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌పై సుప్రీం తీర్పు
-
'వారిద్దరూ బెట్టింగ్ కు పాల్పడ్డారు'
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మేయప్పన్, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా బెట్టింగ్ కు పాల్పడ్డారని అత్యున్నత ధర్మానసం నిర్ధారించింది. శ్రీనివాసన్ పై ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో శ్రీనివాసన్ కు క్లీన్ చీట్ వచ్చినట్టైంది. తీర్పు పాఠాన్ని130 పేజీల్లో పొందుపరిచింది. ఈ కేసులో గత ఏడాది డిసెంబర్ 17న తుది వాదనలు విన్న ద్విసభ్య బెంచ్ తీర్పును రిజర్వ్ చేసి ఈరోజు వెలువరించింది. 18 నెలల క్రితం ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌కు సంబంధించి ఆరోపణలు వెలువడ్డాయి. కొందరు ఆటగాళ్లతో పాటు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు సంబంధించిన వ్యక్తులతో ఫిక్సింగ్‌తో సంబంధం ఉందని ఆరోపణలు రావడంతో వారి ప్రమేయంపై దర్యాప్తు జరిగింది. అనంతరం ఫిక్సింగ్పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ముద్గల్ కమిటీని నియమించడంతో పాటు కొన్ని మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కేసును పూర్తి స్థాయిలో విచారించిన ముద్గల్ కమిటీ ఫిక్సింగ్‌లో బీసీసీఐలోని కొంతమంది పెద్దలు, ఆటగాళ్ల ప్రమేయం ఉందని తేల్చింది. -
'ఫిక్సింగ్‌కు చోటిస్తే.. క్రికెట్‌ను చంపేసినట్టే'
-
'ఫిక్సింగ్‌కు చోటిస్తే.. క్రికెట్‌ను చంపేసినట్టే'
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిక్సింగ్ చోటు కల్పిస్తే, క్రికెట్‌ను చంపేసినట్టేనని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసును దర్యాప్తు చేసిన జస్టిస్ ముద్గల్ కమిటీ తమ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక ఆధారంగా విచారణ చేయనున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. క్రికెట్‌ను నిజమైన క్రీడా స్ఫూర్తితో ఆడాలని, జెంటిల్మెన్ గేమ్‌గా ఉండాలని వ్యాఖ్యానించింది. -
ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో పేర్లు వెల్లడి
-
ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో పేర్లు వెల్లడి
న్యూఢిల్లీ: అంతర్జాతీ క్రికెట్‌ను కుదిపేసిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసును విచారించిన ముద్గల్ కమిటీ నివేదికలో ఉన్న కొన్ని పేర్లను సుప్రీం కోర్టు వెల్లడించింది. ముద్గల్ కమిటీ వెల్లడించిన పేర్లలో ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్, ఆయన అల్లుడు గురునాథ్ మేయప్పన్, క్రికెటర్లు స్టువర్ట్ బిన్నీ , ఓవైషా, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా, ఐపీఎల్ అధికారి సుందర్ రామన్ ఉన్నారు. కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంపై విచారణ చేయడానికి ముద్గల్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్ సీజన్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ జరిగినట్టు ఆరోపణలు రావడం కలకలం రేకెత్తించింది. ఈ కేసులో పలువురు ప్రముఖులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో క్రికెటర్లు, ఐపీఎల్ అధికారులు ఉన్నారు. ఈ కేసును విచారించేందుకు ముద్గల్ కమిటీని నియమించారు. ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ముద్గల్ కమిటీ తమ నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది. -
ముద్గల్ కమిటీకి మరో రెండు నెలలు
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బె ట్టింగ్‌పై విచారణ సాగిస్తున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తుది నివేదిక కోసం సుప్రీం కోర్టు మరో రెండు నెలల సమయం పొడిగించింది. గత మే16న శ్రీనివాసన్, 12 మంది క్రికెటర్లపై విచారణ సాగించేందుకు కోర్టు ముద్గల్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించి ఆగస్టు చివర్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గత నెల 29న కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది. అయితే భారత క్రికెటర్లలో కొందరి స్టేట్మెంట్స్ రికార్డు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తుది నివేదికకు మరికొంత సమయం కావాలని కోరింది. దీంతో కోర్టు రెండు నెలల సమయాన్ని పొడిగిస్తూ విచారణను వేగవంతం చేయాలని ఆదేశించింది. శ్రీనివాసన్ అభ్యర్థనకు తిరస్కారం బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు అనుమతించాలన్న ఎన్.శ్రీనివాసన్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ముద్గల్ కమిటీ నుంచి క్లీన్చిట్ వచ్చే వరకు ఆ పదవిని చేపట్టే వీల్లేదని జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఎఫ్ఎమ్ ఇబ్రహీం కలీఫుల్లాతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ముద్గల్ నివేదికలో శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా ఉంటే బయటపెట్టాలని, అలా లేనిపక్షంలో బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించాలని లాయర్ కపిల్ సిబాల్ వాదించారు. అయితే రిపోర్టులో శ్రీనికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యానాలు లేకపోయినా విచారణ పూర్తి కాలేదు కాబట్టి అనుమతించలేమని బెంచ్ తేల్చి చెప్పింది. -
మీరే విచారించండి
ముద్గల్ కమిటీ నివేదికపై బీసీసీఐకి సుప్రీం కోర్టు ఆదేశం ఐపీఎల్ సీఓఓగా సుందర్‌రామన్ కొనసాగింపు అధ్యక్షుడిగా కొనసాగుతానన్న శ్రీనివాసన్ విజ్ఞప్తి తిరస్కరణ న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించిన ముద్గల్ కమిటీ నివేదికపై విచారణ జరపాలని బీసీసీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. తద్వారా బోర్డు సంస్థాగత స్వయంప్రతిపత్తిని కాపాడుకోవాలని సూచించింది. అయితే ముద్గల్ కమిటీ ఆరోపణలు చేసిన వారిని కోర్టు విడిచిపెట్టబోదని స్పష్టం చేసింది. ఫిక్సింగ్ కేసును ‘సిట్’ లేదా ‘సీబీఐ’కి అప్పగించలేమని కేసును విచారించిన జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ వెల్లడించింది. ‘బోర్డుకు ఉన్న స్వయం ప్రతిపత్తిని కాపాడాలి. ఓ కమిటీని ఏర్పాటు చేసి ఈ కేసును పరిశీలించాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోకుండా మేం ఉండలేం. దేశంలో క్రికెట్‌పై దృష్టిపెట్టాలి తప్ప వ్యక్తులపై కాదు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో వచ్చిన ప్రతి ఆరోపణను శ్రీనివాసన్ దృష్టికి తీసుకెళ్లారని ముద్గల్ కమిటీ నివేదించింది. కానీ ఆయన ఎలాంటి సీరియస్ చర్యలు తీసుకోలేదు’ అని సుప్రీం కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. సుందర్ రామన్‌కు ఊరట మరోవైపు ఐపీఎల్-7 నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు... చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా సుందర్ రామన్‌ను కొనసాగించొచ్చని ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ ఇచ్చిన రాతపూర్వక నివేదికను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ముద్గల్ కమిటీ ముందు భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని, శ్రీనివాసన్ ఇచ్చిన స్టేట్మెంట్ల టేపులను పరిశీలించేందుకు అవకాశం ఇవ్వాలన్న బీసీసీఐ అభ్యర్థనకు కోర్టు సమ్మతించింది. తనను బీసీసీఐ అధ్యక్ష పదవిలో కొనసాగించొద్దన్న తీర్పును పునఃసమీక్షించాలన్న శ్రీనివాసన్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ముద్గల్ కమిటీ ఇచ్చిన రహస్య నివేదికలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 13వ వ్యక్తిగా శ్రీనివాసన్ పేరుందని చెప్పిన కోర్టు... ఆయనపై 12 రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిపింది. బోర్డు నియమావళిని పరిశీలిస్తాం ఈ కేసుకు సంబంధించి నిర్మాణాత్మక చర్యలతో ఈనెల 22న మరోసారి కోర్టుకు హాజరుకావాలని ఆదేశించిన బెంచ్... ఐపీఎల్ నిబంధనలపై లోతుగా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడికి ఐపీఎల్ జట్టు ఉండటం, ఐసీసీ సమావేశాల్లో బోర్డు ప్రతినిధిగా శ్రీనివాసన్ పాల్గొనే అంశాలపై బోర్డు నియమావళిని పరిశీలిస్తామని పట్నాయక్ తెలిపారు. చెన్నై పోలీసు అధికారి జి.సంపత్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయనున్నారు. అలాగే డెక్కన్ చార్జర్స్ జట్టు కూడా తమపై విధించిన నిషేధం గురించి అదే రోజున సుప్రీం ముందు వాదనలు వినిపించే అవకాశం ఉంది. అత్యవసర సమావేశం పెట్టండి శివలాల్‌కు ఆర్సీఏ లేఖ సుప్రీం కోర్టులో స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) కోరింది. ఈ మేరకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్‌కు ఆర్సీఏ కార్యదర్శి కేకే శర్మ లేఖ రాశారు. సుప్రీం కోర్టులో బోర్డు తరఫున హాజరయ్యే న్యాయవాదికి సలహాలు, సూచనలు ఎవరు ఇస్తున్నారో తమకు అర్థం కావడంలేదన్నారు. కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల బోర్డు, ఆటగాళ్ల ప్రతిష్ట దెబ్బతింటుంది కాబట్టి ఈనెల 20న అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. ఆర్‌సీఏతో పాటు ఐదారు అసోసియేషన్లు కూడా ఇదే తరహాలో బోర్డుకు లేఖలు సంధించాయి. -
వివాదాల ప్రభావం ఉంటుంది
చెన్నై కోచ్ ఫ్లెమింగ్ వ్యాఖ్య దుబాయ్: ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదం చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుపై ప్రభావం చూపే అవకాశముందని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అంగీకరించారు. ‘ఇటీవల కాలంలో మా జట్టు చుట్టూ చాలా అంశాల గురించి చర్చ జరిగింది. నిజాయితీగా చెప్పాలంటే ఈ వివాదాల ప్రభావం జట్టుపై ఉండే అవకాశం ఉంది. అయితే ఒక్కసారి టోర్నీ ప్రారంభమైతే అన్నింటినీ పక్కకినెట్టి మ్యాచ్‌లపై దృష్టి సారించొచ్చు’ అని ఫ్లెమింగ్ అన్నారు. -
ధోని వాంగ్మూలం పరిశీలిస్తాం
సుప్రీంకోర్టుకు బీసీసీఐ విన్నపం న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం వ్యవహారంలో చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్, టీమిండియా సారథి ధోనికి ఎటువంటి సంబంధం లేదని బీసీసీఐ మరోసారి పేర్కొంది. ఈ మేరకు ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ ముద్గల్ కమిటీ ఎదుట ధోని ఇచ్చినట్లుగా చెబుతున్న వాంగ్మూలాన్ని పరిశీలించేందుకు అనుమతించాల్సిందిగా సుప్రీంకోర్టును బీసీసీఐ కోరింది. ధోనితోపాటు ఎన్.శ్రీనివాసన్, ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్ల వాంగ్మూలాలనూ పరిశీలించేందుకు అనుమతి కోరింది. కుంభకోణంలో చెన్నై ఫ్రాంచైజీ యజమాని ఎన్.శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ పాత్రపై ధోని అబద్ధం చెప్పాడని, అందుకు కారణమేంటో తేల్చాలని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ ప్రతినిధి ఆదిత్య వర్మ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, బీసీసీఐ అభ్యర్థనను శుక్రవారం విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
బీసీసీఐకి ఇద్దరు అధ్యక్షులు
న్యూఢిల్లీ: ఒక్క రోజులోనే రకరకాల మలుపులు తిరిగిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు వ్యవహారంలో చివరకు అందరికీ సంతోషకరమైన ఆదేశాలే వచ్చాయి. కేసును విచారిస్తున్న ద్విసభ్య సుప్రీం కోర్టు బెంచ్ ఏకే పట్నాయక్, ఇబ్రహీం ఖలీఫుల్లా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎవరేం చేయాలంటే... గవాస్కర్: ఐపీఎల్‌కు సంబంధించినంత వరకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మిగిలిన బోర్డు వ్యవహారాలతో సంబంధం లేదు. బీసీసీఐ కామెంటేటర్‌గా ఉన్న కాంట్రాక్టును వదిలేసుకోవాలి. ఇందుకుగాను పరిహారం పొందొచ్చు. అంటే బోర్డు చరిత్రలో తొలిసారి ‘పెయిడ్ అధ్యక్షుడు’గా గవాస్కర్ వ్యవహరించబోతున్నారు. అయితే ఐపీఎల్‌ను నడపడానికి గవర్నింగ్ కౌన్సిల్ ఉంది. లీగ్ సీఈఓ సుందర్ రామన్‌ను కొనసాగించాలా లేదా అనే విషయంలో గవాస్కర్ నిర్ణయం తీసుకోవచ్చు. తను కావాలంటే కొత్తగా ఎవరినైనా లీగ్ నిర్వహణ కోసం నియమించుకోవచ్చు. శివలాల్ యాదవ్: ఐపీఎల్ మినహా మిగిలిన బోర్డు వ్యవహారాలన్నింటికి సంబంధించి శివలాల్ యాదవ్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కేసు విచారణ ముగిసే వరకు లేదా తర్వాతి ఏజీఎమ్ వరకు బోర్డు పూర్తి పరిపాలనా బాధ్యత శివలాల్దే.శ్రీనివాసన్: ఈ కేసు విచారణ ముగిసే వరకు అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారు. జూన్‌లో ఐసీసీ ఛైర్మన్ పదవి చేపడతారు. విచారణ ముగిశాక తిరిగి బోర్డు అధ్యక్ష బాధ్యతలు తీసుకోవచ్చు. ఐపీఎల్: లీగ్‌కు ఎలాంటి సమస్యా లేదు. ఎప్పటిలాగే ఎనిమిది జట్లు ఆడతాయి. రాజస్థాన్, చెన్నై జట్లు కూడా పాల్గొంటాయి. ‘క్రికెట్ అభిమానుల కోసం ఈ రెండు జట్లను అనుమతిస్తున్నాం’ అని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. కాబట్టి ఎప్పటిలాగే ఏప్రిల్ 16న యూఏఈలో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. ఇతర ముఖ్య అంశాలు ఇండియా సిమెంట్స్ కంపెనీకి చెందిన ఉద్యోగులెవరూ బోర్డు కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. అయితే ఆటగాళ్లు, కామెంటేటర్లకు ఇది వర్తించదు. అంటే ఇండియా సిమెంట్స్ ఉపాధ్యక్షుడు ధోనికి సంబంధించి ఎలాంటి అడ్డంకులూ లేవు. తను ఎప్పటిలాగే క్రికెట్ ఆడుకోవచ్చు. అన్ని వాదనలు పూర్తయి తుది తీర్పు వెలువడే వరకు ఈ ఆదేశాలన్నీ అమల్లో ఉంటాయి. ఏప్రిల్ 16న తదుపరి విచారణ జరుగుతుంది. సమర్థవంతంగా నిర్వర్తిస్తా... విశాఖపట్నం, న్యూస్‌లైన్: సుప్రీంకోర్టు తనపై నమ్మకంతో అప్పజెప్పిన బీసీసీఐ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. తన ఆటలాగే విధుల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. శుక్రవారం ఇక్కడ ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో గవాస్కర్ పాల్గొన్నారు. ‘బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేసేందుకు నేను తగిన వాడినని సుప్రీంకోర్టు భావించడం నా అదృష్టం. దీనినో గౌరవంగా భావిస్తున్నా. నా క్రికెట్ కెరీర్‌లాగే ఇక్కడ కూడా మెరుగైన ప్రదర్శన ఇస్తాను’ అని సన్నీ చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భగవాన్ సత్యసాయి బాబా అంటే తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమని, ఆయన ఆశీస్సుల వల్లే బీసీసీఐ అధ్యక్ష పదవి తనను వరించిందన్నారు. చాలా సంతోషం... సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్షుడిగా తాను ఎంపిక కావడం పట్ల మాజీ క్రికెటర్, సీనియర్ ఉపాధ్యక్షులు నందలాల్ శివలాల్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. తాను ఈ పరిణామాలు ఊహించలేదని, అయితే అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ‘ఐపీఎల్‌ను మినహాయించి అధ్యక్షుడిగా ఇతర బీసీసీఐ బాధ్యతలు నాకు అప్పజెప్పటం ఆనందంగా ఉంది. బోర్డుతో పాటు హెచ్‌సీఏలో కూడా క్రికెట్ వ్యవహారాల నిర్వహణలో నాకున్న అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతుందని భావిస్తున్నా’ అని శివలాల్ చెప్పారు. వీలైనంత త్వరగా బాధ్యతలు చేపడతానని యాదవ్ చెప్పారు. ‘పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను ఎలా ముందుకు సాగాలో నిర్ణయించుకుంటాను. నా వైపు నుంచి బోర్డును బాగా నడిపేందుకు ప్రయత్నిస్తాను’ అని శివలాల్ పేర్కొన్నారు. -
బీసీసీఐ అధ్యక్షుడిగా గవాస్కర్!
సుప్రీం కోర్టు సలహా శ్రీనివాసన్‌ను తప్పించాల్సిందే చెన్నై, రాజస్థాన్ జట్లను సస్పెండ్ చేయాలి బోర్డు ఒప్పుకుంటే మధ్యంతర ఉత్తర్వులు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో గురువారం సుప్రీం కోర్టు కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. శ్రీనివాసన్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి గవాస్కర్ లేదా అలాంటి క్రికెట్ అనుభవం ఉన్న వ్యక్తులకు కట్టబెట్టాలని సూచింది. దీంతో ఓవరాల్‌గా శ్రీనికి పదవి గండం తప్పేలా లేదు. మాజీ ఆటగాళ్లు కూడా కోర్టు ప్రతిపాదనలకే మొగ్గు చూపుతుండటంతో కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ‘దోషులుగా నిర్ధారణ అయ్యేవరకు ఎవరైనా అమాయకులే. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. సుప్రీం కోర్టు చేసిన సూచనలను పాటించాలి. బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. దీనికోసం బోర్డుతో వ్యాఖ్యాతగా ఉన్న కాంట్రాక్టును కూడా వదులుకుంటా. క్రికెట్లో ఓపెనర్ శారీరకంగా, మానసికంగా అన్ని సవాళ్లను ఎదుర్కోవాలి. ఓపెనర్‌గా ఆడిన నేను ఏ సవాల్‌కైనా సిద్ధమే. రెండు జట్లను దూరంగా ఉంచినంత మాత్రాన అవినీతి రహిత క్రికెట్ సాధ్యమవుతందని నేను అనుకోను. ఐపీఎల్లో చెన్నై, రాజస్థాన్ జట్లు లేకపోతే అభిమానులు నిరాశ చెందుతారు. 1999-2000లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం బయటపడినప్పుడు టెస్టు క్రికెట్ ఆడొద్దని ఎవరూ చెప్పలేదు. కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి వాటిని నిరోధించవచ్చు.’ - గవాస్కర్ మాజీ ఆటగాళ్లు, బోర్డు సభ్యులు సుప్రీంకోర్టు చేసిన ప్రతిపాదనలను సమర్థించారు. కోర్టు వెలువరించే తుది ఆదేశాలను తప్పక పాటించాల్సిందేనని వారు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై వారి స్పందన... చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కొనుగోలు చేయడానికి శ్రీనివాసన్‌కు అనుమతినివ్వడం బీసీసీఐ చేసిన మొదటి తప్పు. అప్పట్లో అతను జట్టును కొనుగోలు చేయకుండా అడ్డుకుంటే బాగుండేది. - రవిసావంత్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు బీసీసీఐకి ఇది దురదృష్టకరమైన రోజు. పరిస్థితి చేయిదాటి పోయింది. క్రికెట్ భవిష్యత్ దృష్ట్యా సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ శిరసావహించాల్సిందే. - నిరంజన్ షా, బీసీసీఐ మాజీ కార్యదర్శి ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ఈ స్థితిలో ఏ అంశంపైనా నేను ఎక్కువగా స్పందించలేను. - శ్రీకాంత్, మాజీ చీఫ్ సెలక్టర్ బీసీసీఐ ప్రతిపాదనలేమిటో నేను చూడలేదు. కోర్టు నిర్ణయం వెలువరించేంతవరకు అంతా ఎదురుచూడాలి. దీనిపై నేను ఎలాంటి వ్యాఖ్య చేయను. - ద్రవిడ్, మాజీ కెప్టెన్ గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. అయితే అవి ఆటను దెబ్బతీయలేవు. ఇతర రంగాల లాగే క్రికెట్లోనూ తప్పులు జరిగి ఉండొచ్చు. - అనిల్ కుంబ్లే, మాజీ కెప్టెన్ న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ పదవికి ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసును విచారిస్తున్న సుప్రీం కోర్టు గురువారం మరికొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. బోర్డులో సమూల మార్పులు చేయాలని ఆదేశించడంతో పాటు శ్రీనివాసన్‌ను పదవి నుంచి తప్పించాలని సూచించింది. కేసు పరిష్కారమయ్యే వరకు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ లేదా ఆ స్థాయి వ్యక్తుల్లో ఎవరినైనా బోర్డు అధ్యక్షుడిగా నియమించాలని సలహా ఇచ్చింది. మరోవైపు బెట్టింగ్ కేసు తేలే వరకు ఐపీఎల్-7 నుంచి చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై సస్పెన్షన్ విధించాలని తెలిపింది. గురువారం రెండు గంటలకుపైగా ఈ కేసును విచారించిన జస్టిస్ ఏకే పట్నాయక్ బెంచ్ ఈ ప్రతిపాదనలను చేసింది. వీటిపై బోర్డు తమ స్పందనను శుక్రవారం (నేడు) తెలియజేస్తే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. అయితే ఇప్పటి వరకు కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోయినా... ఈ పరిణామాలపై శ్రీనివాసన్ ఎలా స్పందిస్తారని క్రికెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. వాళ్లను కట్టడి చేయండి... బీసీసీఐ తరఫున సీఏ సుందరమ్ వాదనలను వినిపించగా, బీహార్ క్రికెట్ అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ప్రతి వాదనలు చేశారు. స్పాట్ ఫిక్సింగ్పై ముద్గల్ కమిటీ చేసిన ప్రతిపాదనలను అమలు చేస్తామని చెప్పిన సుందరమ్ మంగళవారం సుప్రీం కోర్టు చేసిన ప్రతిపాదనలపై బోర్డు స్పందనను ఓ సీల్డ్ కవర్లో బెంచ్ ముందుంచారు. అయితే న్యాయమూర్తులు దాన్ని చదివి పక్కనబెట్టి వాదలను వినిపించాలని కోరారు. బీసీసీఐ వ్యవస్థలో చాలా మంది శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్ అధికారులే ఉన్నారని సాల్వే చేసిన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇక ముందు ఇండియా సిమెంట్స్ అధికారులెవ్వరూ బోర్డు కార్యకలాపాల్లో పాలుపంచుకోరాదని ఆదేశించింది. ధోని ఇండియా సిమెంట్స్ ఉపాధ్యక్షుడా! భారత కెప్టెన్ ధోని ప్రవర్తనపై కూడా సాల్వే చాలా ప్రశ్నలు లేవనెత్తారు. మహీ అవినీతి ప్రవర్తనతో వ్యవహరిస్తున్నాడని కాస్త ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫిక్సింగ్‌లో గురునాథ్ హస్తం ఉందని ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై కెప్టెన్ ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. శ్రీనివాసన్, ధోని, ఇండియా సిమెంట్స్ అధికారుల ప్రమేయం లేకుండా గురునాథ్ ఒక్క పని కూడా చేయలేడని కమిటీ తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. దోనిని ఇండియా సిమెంట్స్ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్‌ను సాల్వే కోర్టు ముందుంచారు. దీంతో న్యాయమూర్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. చివరగా చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలను రద్దు చేయాలని సాల్వే వాదించారు. వాదనల మధ్యలో... స్వతంత్ర వ్యవస్థ అయిన బీసీసీఐలో సమూల మార్పులు చేయాలని ఆదేశించే అధికారం ఈ కోర్టుకు ఉందా అని న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నకు తాను లిఖితపూర్వకంగా సమాధానమిస్తానని చెప్పారు. -
ఫిక్సింగ్పై విచారణ 25కు వాయిదా
-
ఫిక్సింగ్పై విచారణ 25కు వాయిదా
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై సుప్రీం కోర్టు తమ విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. ఈ రిపోర్ట్‌పై బీసీసీఐ తమ స్పందనను గురువారమే దాఖలు చేయడంతో వాటిని పూర్తిగా పరిశీలించాల్సి ఉందని జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది. గత సీజన్లో చోటు చేసుకున్న ఫిక్సింగ్ ఉదంతంపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ జస్టిస్ ముద్గల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎన్.నాగేశ్వర్ రావు, అస్సాం క్రికెట్ అసోసియేషన్ సభ్యులు నిలయ్ దత్తాలతో కూడిన కమిటీని గతంలోనే సుప్రీం కోర్టు నియమించింది. -
స్నేహపూర్వక బెట్టింగ్ చేశా!
విచారణలో మెయ్యప్పన్ న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణల్లో ఇరుక్కున్న గురునాథ్ మెయ్యప్పన్ పోలీసుల విచారణలో తన తప్పును అంగీకరించినట్టు సమాచారం. బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్‌తో కలిసి స్నేహపూర్వక బెట్టింగ్ చేశానని తెలిపినట్టు ఓ హిందీ చానల్లో కథనం ప్రసారమైంది. పోలీసుల విచారణ నివేదికను కౌన్సిల్ గౌతమ్ భరద్వాజ్, విదుష్పత్ సింఘానియా కోర్టుకు అందించారు. విందూకు బుకీలతో నేరుగా సంబంధాలున్నాయని, అతని ద్వారా మెయ్యప్పన్ పందేలు కాసేవాడని పేర్కొన్నారు. -
ఆటగాళ్ల పేర్లను వెల్లడించవద్దు
సుప్రీంకోర్టును కోరిన బీసీసీఐ న్యూఢిల్లీ: ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్తో సంబంధమున్నట్టుగా జస్టిస్ ముద్గల్ కమిటీ పేర్కొన్న నివేదికలోని ఆటగాళ్ల పేర్లను బహిర్గతపర్చవద్దని బీసీసీఐ... సుప్రీం కోర్టును అభ్యర్థించింది. ఈ ఉదంతంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ తమ విచారణ నివేదికను సీల్డ్ కవర్లో ఉంచి గతంలోనే కోర్టుకు సమర్పించింది. ఫిక్సింగ్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లకు ప్రమేయముందని, వీరిలో ఒకరు ప్రస్తుత జట్టులోనూ ఉన్నాడని ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ నివేదికను ఆధారం చేసుకుని మీడియాలో అనేక ఊహా త్మక, నిరాధార కథనాలు వ్యాప్తిలోకి వచ్చాయని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ఏ తప్పూ చేయని క్రికెటర్లకు నష్టం కలిగించేలా ఉన్నాయని కోర్టుకు తెలిపింది. అందుకే నివేదికలోని ఆటగాళ్ల పేర్లు బయటికి రాకుండా అడ్డుకోవాలని కోర్టును అభ్యర్థించింది. ప్యానెల్ సూచనలకు అంగీకారం బెట్టింగ్, ఫిక్సింగ్‌లకు తావు లేకుండా క్రికెట్‌ను స్వచ్ఛంగా ఉంచేందుకు జస్టిస్ ముద్గల్ చేసిన ప్రతిపాదనలను బీసీసీఐ అంగీకరించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల అనంతరం జరిగే పార్టీలను నిషేధించడంతో పాటు క్రికెటర్ల ఏజెంట్ల పేర్లను రిజిష్టర్ చేసుకునే విధంగా చూస్తామని తెలిపింది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందిన కంపెనీల్లో ఆటగాళ్లు ఉద్యోగులుగా ఉండరాదనే ముద్గల్ కమిటీ సూచనను బీసీసీఐ తోసిపుచ్చింది. ముద్గల్ కమిటీ నివేదికపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. -
శ్రీనివాసన్‌కు తొలగిన అడ్డంకులు
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌తో సమస్యల సునామీలో చిక్కుకున్న బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ బయటపడ్డారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఆయనకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై విచారణ జరిపేందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ముకుల్ ముగ్దల్ నేతృత్వంలో దర్యాప్తు సంఘాన్ని నియమించింది. నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని శ్రీనివాసన్‌ను కోర్టు ఆదేశించింది. ఈ కమిటీ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ యజమానులపై వచ్చిన ఆరోపణలపై కమిటీ విచారణ జరుపుతుందని న్యాయస్థానం వెల్లడించింది. బీసీసీఐ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో శ్రీనివాసన్ బోర్డు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. తన మద్దతుదారులకు బోర్డు పదవులు కట్టబెట్టి బీసీసీఐలో తనకు ఎదురులేదని శ్రీనివాసన్ మరోసారి నిరూపించుకున్నారు. -
‘రాయల్’ గా ఆరంభం
గత ఐపీఎల్లో సొంతగడ్డపై అన్ని మ్యాచ్‌లూ గెలిచిన సంప్రదాయాన్ని రాజస్థాన్ రాయల్స్ చాంపియన్స్లీగ్లోనూ కొనసాగించింది. తమ తొలి మ్యాచ్‌లో ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై అలవోకగా గెలిచింది. జైపూర్: ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం తర్వాత... రాజస్థాన్ రాయల్స్ ఆట కంటే మిగిలిన విషయాల్లోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. చాంపియన్స్ లీగ్‌కు ముందు ఆ జట్టు షాక్ నుంచి తేరుకుందా లేదా అనే అంశంపై భారీగా చర్చ జరిగింది. కానీ మైదానంలోకి దిగాక అవన్నీ పక్కకి నెట్టిన రాయల్స్ చాంపియన్స్లీగ్ను ఘనంగా ప్రారంభించింది. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో శనివారం జరిగిన గ్రూప్ ఎ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై అలవోకగా నెగ్గింది. టాస్ గెలిచిన ద్రవిడ్ బౌలింగ్ ఎంచుకోగా... ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. రాజస్థాన్ పేసర్ విక్రమ్‌జీత్ మాలిక్ చక్కగా బౌలింగ్ చేసి స్మిత్ (9), కార్తీక్ (2)ల వికెట్లు తీయడంతో ముంబై తడబడింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (17 బంతుల్లో 15; 3 ఫోర్లు) మంచి టచ్‌లోనే కనిపించినా.... ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. రాయుడు (3) కూడా రనౌట్‌గా వెనుదిరగడంతో ముంబై జట్టు 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ (37 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పొలార్డ్ (36 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. తొలుత రోహిత్, ఆ తర్వాత పొలార్డ్ వేగంగా ఆడి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఈ ఇద్దరూ అవుటయ్యాక... చివరి ఓవర్లో కౌల్టర్ నైల్ (5 బంతుల్లో 12 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) ఉపయోగకరమైన పరుగులు సాధిం చాడు. రాయల్స్ బౌలర్లలో విక్రమ్‌జీత్ మాలిక్ మూడు వికెట్లు తీసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 19.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలోనే కెప్టెన్ ద్రవిడ్ (1) వికెట్‌ను కోల్పోయినా... రహానే (31 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్సర్), సంజు శామ్సన్ (47 బంతుల్లో 54; 8 ఫోర్లు) కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 59 బంతుల్లోనే 74 పరుగులు జోడించారు. గత ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన శామ్సన్ ఈసారి కూడా నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడి అర్ధసెంచరీ సాధించాడు. శామ్సన్ అవుటయ్యాక వాట్సన్ (22 బంతుల్లో 27 నాటౌట్; 2 సిక్సర్లు), స్టువర్ట్ బిన్నీ (14 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) చకచకా పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) మాలిక్ 9; సచిన్ (సి) శామ్సన్ (బి) బిన్నీ 15; దినేశ్ కార్తీక్ (బి) మాలిక్ 2; రోహిత్ శర్మ (సి) శామ్సన్ (బి) వాట్సన్ 44; రాయుడు రనౌట్ 3; పొలార్డ్ (సి) శామ్సన్ (బి) మాలిక్ 42; హర్భజన్ రనౌట్ 8; కౌల్టర్ నైల్నాటౌట్ 12; రిషి ధావన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 2, వైడ్లు 5) 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 142. వికెట్ల పతనం: 1-9; 2-26; 3-38; 4-43; 5-95; 6-130; 7-141. బౌలింగ్: మేనరియా 2-0-9-0; విక్రమ్‌జీత్ మాలిక్ 4-0-24-3; ఫాల్క్‌నర్ 4-0-31-0; వాట్సన్ 3-0-26-1; స్టువర్ట్ బిన్నీ 2-0-13-1; రాహుల్ శుక్లా 2-0-6-0; కూపర్ 3-0-31-0. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ద్రవిడ్ (సి) పొలార్డ్ (బి) కౌల్టర్ నైల్ 1; రహానే (బి) రిషి ధావన్ 33; శామ్సన్ (సి) స్మిత్ (బి) పొలార్డ్ 54; వాట్సన్ నాటౌట్ 27; స్టువర్ట్ బిన్నీ నాటౌట్ 27; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 4, వైడ్లు 2) 6; మొత్తం (19.4 ఓవర్లలో మూడు వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1-5; 2-79; 3-107. బౌలింగ్: జాన్సన్ 4-0-38-0; కౌల్టర్ నైల్ 3.4-0-22-1; రిషి ధావన్ 4-0-17-1; ప్రజ్ఞాన్ ఓజా 1-0-13-0; హర్బజన్ 3-0-22-0; పొలార్డ్ 3-0-20-1; డ్వేన్ స్మిత్ 1-0-12-0. -
జీవితకాల నిషేధంపై శ్రీశాంత్ సవాలు!
న్యూఢిల్లీ: వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జీవితకాల నిషేధం విధించడం అనాగరికమని అతని వ్యక్తిగత లాయర్ రెబెకా జాన్ అభిప్రాయపడ్డారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, దీన్ని కోర్టులో సవాలు చేస్తున్నామని చెప్పారు. ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్‌లో దోషిగా తేలడంతో అతనిపై బోర్డు వేటు వేసిన సంగతి తెలిసిందే. బోర్డు నియమించిన సవాని కమిటీ అతనితో సహా నలుగురు ఆటగాళ్లను తప్పుబట్టింది. అయితే ఈ కమిటీ విచారణలో ఏ మాత్రం పసలేదని ఆమె ఆరోపించారు. కేవలం ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగానే విచారణను ముగించింది కానీ... సొంత దర్యాప్తుతో కాదని చెప్పారు. లోగడ ఫిక్సింగ్ ఉదంతాన్ని విచారించిన సెషన్స్ కోర్టు బలమైన ఆధారాలు లేవని వారికి బెయిల్ మంజూరు చేసిందని రెబెకా వివరించారు. కోర్టుకే లభించని ఆధారాలు బోర్డు కమిటీకి లభించాయా అని ఆమె ఎద్దెవా చేశారు. -
బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో ఇరుక్కున్న రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా భవితవ్యంపై నేడు (శుక్రవారం) బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ ముగ్గురి వ్యవహారంపై ఇప్పటికే అవినీతి నిరోధక యూనిట్ చీఫ్ రవి సవానీ గత నెలలో బోర్డు వర్కింగ్ కమిటీకి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ నేడు సమావేశం కానుంది. అరుణ్ జైట్లీ, నిరంజన్ షా నేతృత్వంలోని ఈ కమిటీ వీరి గురించి చర్చించనుంది. తదనంతరం తమ అభిప్రాయాలను ఈనెల 29న జరిగే వార్షిక సమావేశం ముందుంచుతారు. ఢిల్లీ పోలీసులచే అరెస్ట్ అయిన ఈ త్రయం ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారు. ఫిక్సింగ్ వ్యవహారం బయటపడగానే ఈ ముగ్గురి ఆటగాళ్ల ఒప్పందాన్ని రాజస్థాన్ జట్టు ఉపసంహరించుకుంది.