చవాన్‌కు రూ. 32 లక్షలు చెల్లించిన ఎంసీఏ
ముంబై: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌తో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న అంకిత్ చవాన్‌కు ముంబై క్రికెట్ అసోసియేషన్ 2012-13 రంజీ సీజన్‌కు సంబంధించిన బకాయిలను చెల్లిం చింది. మ్యాచ్ ఫీజులు, బోనస్‌తో కలిపి మొత్తం రూ. 32 లక్షలను ఇచ్చామని ఎంసీఏ ఉపాధ్యక్షుడు రవి సావంత్ తెలిపారు.
‘బకాయిల చెల్లింపు అంశంపై బీసీసీఐ అనుమతి కోసం గతేడాది నవంబర్‌లో లేఖ రాశాం. కానీ మార్చి వరకూ బోర్డు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో చేసేదేమీలేక బకాయిలు విడుదల చేశాం. చవాన్‌పై నిషేధం ఉంది కాబట్టి బోర్డు నుంచి అనుమతి కోరాల్సి వచ్చింది’ అని సావంత్ పేర్కొన్నారు.