ముంబైకి ఫైనల్ అవకాశం
ఐపీఎల్ నుంచి ఎంసీఏకు లేఖ!
ముంబై: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పు వ్యవహారం మరో మలుపు తిరిగింది. వాంఖడే నుంచి ఈ మ్యాచ్‌ను బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి మార్చిన వైనంపై ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఐపీఎల్ పాలకమండలి (జీసీ)కి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఎంసీఏ నిరసనపై జీసీ సమావేశమైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. మరోవైపు లీగ్ చైర్మన్ రంజిబ్ బిశ్వాల్ ఎంసీఏ నిరసనపై సమాధానమిచ్చారు.
కానీ ఈ అంశంపై కొన్ని షరతులు కూడా విధించారు. తమ తరఫున రానున్న అతిథుల కోసం హాస్పిటాలిటీ బాక్సుల నిర్వహణ తమకే అప్పగించడం, రాత్రి పది తర్వాత బాణసంచా కాల్చడానికి, పెద్ద శబ్దంతో సంగీతం పెట్టుకునేందుకు ముంబై పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడంలాంటి షరతులు వీటిలో ఉన్నట్టు సమాచారం. ‘బిశ్వాల్ నుంచి మాకు లేఖ అందింది. షరతులపై చర్చించేందుకు మా మేనేజింగ్ కమిటీ సమావేశమవుతుంది’ అని ఎంసీఏ ఉపాధ్యక్షుడు సావంత్ తెలిపారు.
ఆ షరతులు ఒప్పుకుంటేనే..!
Published Wed, May 14 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM
Advertisement
Advertisement