ఫిక్సింగ్‌పై విచారణ 25కు వాయిదా | IPL spot-fixing: SC defers case hearing to 25 March | Sakshi
Sakshi News home page

ఫిక్సింగ్‌పై విచారణ 25కు వాయిదా

Published Sat, Mar 8 2014 1:43 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై సుప్రీం కోర్టు తమ విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.

 న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై సుప్రీం కోర్టు తమ విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. ఈ రిపోర్ట్‌పై బీసీసీఐ తమ స్పందనను గురువారమే దాఖలు చేయడంతో వాటిని పూర్తిగా పరిశీలించాల్సి ఉందని జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది.
 
 గత సీజన్‌లో చోటు చేసుకున్న ఫిక్సింగ్ ఉదంతంపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ జస్టిస్ ముద్గల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎన్.నాగేశ్వర్ రావు, అస్సాం క్రికెట్ అసోసియేషన్ సభ్యులు నిలయ్ దత్తాలతో కూడిన కమిటీని గతంలోనే సుప్రీం కోర్టు నియమించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement