బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు ఎదురుదెబ్బ!
బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు ఎదురుదెబ్బ!
Published Mon, Sep 1 2014 8:44 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముగ్దల్ కమిటీ విచారణ పూర్తయ్యేంత వరకు శ్రీనివాసన్ బీసీసీఐ పదవీ బాధ్యతలు చేపట్టడానికి వీల్లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చించింది.
అంతేకాక ఏపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై ముగ్దల్ కమిటీ జరుపుతున్న దర్యాప్తుపై సుప్రీం కోర్టు ఆసంతృప్తిని వెల్లగక్కింది. అంతేకాక కమిటీ దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేయాలని ముగ్దల్ కమిటీని ఆదేశించింది.
వార్షిక సాధారణ సమావేశం నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని శ్రీనివాసన్ చేసిన విజ్క్షప్తిని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు టీఎస్ ఠాకూర్, ఎఫ్ఎమ్ ఇబ్రహీం కలీఫుల్లా కూడిన బెంచ్ తోసిపుచ్చింది.
Advertisement