'బీసీసీఐ మీటింగ్లకు ఆయన హాజరుకావచ్చా?'
ముంబయి : బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఐసీసీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ విషయమై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) శనివారం నాడు సుప్రీంకోర్టును సంప్రదించాల్సి వచ్చింది. బీసీసీఐ అధికారిక సమావేశాలకు శ్రీని హాజరు కావచ్చా.. లేదా అనే విషయంపై స్పష్టత కోసం బోర్డు సభ్యులు సుప్రీంకోర్టు సలహాను కోరారు. నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఆయనకు చెందిన ఇండియా సిమెంట్స్ వాటాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి.
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం నేపథ్యంలో నిషేధానికి రెండు జట్లపై ఐపీఎల్ చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించడానికి గత నెలలో సమావేశం ఏర్పాటు చేయగా.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తరఫున శ్రీని హాజరుకావడంతో సమావేశం రద్దయింది. ఎందుకంటే చెన్నై ఫ్రాంచైజీకి శ్రీని కంపెనీ ఇండియా సిమెంట్స్ వాటాలను ఎలా అమ్మిందన్న దానిపై స్పష్టతలేని కారణంగా కొంత సందిగ్ధత నెలకొందన్నది వాస్తవం. ఫిక్సింగ్ ఆరోపణలు రుజువైనందున జస్టిస్ లోథా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్లపాటు నిషేధం విదించిన విషయం విదితమే.