శ్రీనివాసన్కు తొలగిన అడ్డంకులు
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్తో సమస్యల సునామీలో చిక్కుకున్న బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ బయటపడ్డారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఆయనకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.
ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై విచారణ జరిపేందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ముకుల్ ముగ్దల్ నేతృత్వంలో దర్యాప్తు సంఘాన్ని నియమించింది. నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని శ్రీనివాసన్ను కోర్టు ఆదేశించింది. ఈ కమిటీ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ యజమానులపై వచ్చిన ఆరోపణలపై కమిటీ విచారణ జరుపుతుందని న్యాయస్థానం వెల్లడించింది.
బీసీసీఐ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో శ్రీనివాసన్ బోర్డు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. తన మద్దతుదారులకు బోర్డు పదవులు కట్టబెట్టి బీసీసీఐలో తనకు ఎదురులేదని శ్రీనివాసన్ మరోసారి నిరూపించుకున్నారు.