ఐపీఎల్ నుంచి చెన్నై, రాజస్థాన్ అవుట్
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై వేటు పడింది. రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ . సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పు ఖరారు చేసింది. ఈరోజు నుంచే అమల్లోకి వస్తుందని వస్తుందని ప్రకటించింది.
చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాపై జీవితకాల నిషేధం విధించింది. వీరిద్దరూ క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనకుండా నిషేధం పెట్టింది. మేయప్పన్, కుంద్రా బెట్టింగ్ వ్యవహారాలతో బీసీసీఐ, ఐపీఎల్ తో పాటు క్రికెట్ కు చెడ్డ పేరు వచ్చిందని లోధా కమిటీ పేర్కొంది.