సుప్రీంకోర్టుకు బీసీసీఐ విన్నపం
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం వ్యవహారంలో చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్, టీమిండియా సారథి ధోనికి ఎటువంటి సంబంధం లేదని బీసీసీఐ మరోసారి పేర్కొంది. ఈ మేరకు ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ ముద్గల్ కమిటీ ఎదుట ధోని ఇచ్చినట్లుగా చెబుతున్న వాంగ్మూలాన్ని పరిశీలించేందుకు అనుమతించాల్సిందిగా సుప్రీంకోర్టును బీసీసీఐ కోరింది.
ధోనితోపాటు ఎన్.శ్రీనివాసన్, ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్‌ల వాంగ్మూలాలనూ పరిశీలించేందుకు అనుమతి కోరింది. కుంభకోణంలో చెన్నై ఫ్రాంచైజీ యజమాని ఎన్.శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ పాత్రపై ధోని అబద్ధం చెప్పాడని, అందుకు కారణమేంటో తేల్చాలని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ ప్రతినిధి ఆదిత్య వర్మ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, బీసీసీఐ అభ్యర్థనను శుక్రవారం విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.