'ఫిక్సింగ్కు చోటిస్తే.. క్రికెట్ను చంపేసినట్టే' | supreme-court-hearing-ipl-spot-fixing-case | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 24 2014 9:29 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిక్సింగ్ చోటు కల్పిస్తే, క్రికెట్ను చంపేసినట్టేనని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసును దర్యాప్తు చేసిన జస్టిస్ ముద్గల్ కమిటీ తమ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక ఆధారంగా విచారణ చేయనున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. క్రికెట్ను నిజమైన క్రీడా స్ఫూర్తితో ఆడాలని, జెంటిల్మెన్ గేమ్గా ఉండాలని వ్యాఖ్యానించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement