న్యూఢిల్లీ: విమానయాన సంస్థ గో ఫస్ట్ స్వచ్ఛంద దివాలా ప్రక్రియను వ్యతిరేకిస్తూ విమానాల లీజుదార్లు ఒక్కొక్కరుగా ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలను సవాలు చేస్తూ జీవై ఏవియేషన్, ఎస్‌ఎఫ్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్ హోల్డింగ్ సంస్థలు.. నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో పిటీషన్ దాఖలు చేశాయి.
ఎస్‌ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ ఇప్పటికే పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్‌కు చెందిన జీవై ఏవియేషన్.. గో ఫస్ట్‌కు 9 విమానాలు, ఎస్‌ఎఫ్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్ హోల్డింగ్స్ ఒకటి, ఎస్‌ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ 5 విమానాలను లీజుకిచ్చాయి. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న గో ఫస్ట్ దాఖలు చేసిన స్వచ్ఛంద దివాలా పిటీషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్ టీ) విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment