SMBC
-
ఎన్సీఎల్ఏటీకి గో ఫస్ట్ లీజుదార్లు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ గో ఫస్ట్ స్వచ్ఛంద దివాలా ప్రక్రియను వ్యతిరేకిస్తూ విమానాల లీజుదార్లు ఒక్కొక్కరుగా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో ఎన్సీఎల్టీ ఆదేశాలను సవాలు చేస్తూ జీవై ఏవియేషన్, ఎస్ఎఫ్వీ ఎయిర్క్రాఫ్ట్ హోల్డింగ్ సంస్థలు.. నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో పిటీషన్ దాఖలు చేశాయి. ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ ఇప్పటికే పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్కు చెందిన జీవై ఏవియేషన్.. గో ఫస్ట్కు 9 విమానాలు, ఎస్ఎఫ్వీ ఎయిర్క్రాఫ్ట్ హోల్డింగ్స్ ఒకటి, ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ 5 విమానాలను లీజుకిచ్చాయి. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న గో ఫస్ట్ దాఖలు చేసిన స్వచ్ఛంద దివాలా పిటీషన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ టీ) విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. -
కొటక్ మహీంద్రాలో సుమిటొమొ వాటాల విక్రయం
విలువ రూ. 2,069 కోట్లు ముంబై: జపాన్ దిగ్గజం సుమిటొమొ మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్ఎంబీసీ) మంగళవారం కొటక్ మహీంద్రా బ్యాంకులో దాదాపు 1.78 శాతం మేర వాటాలను విక్రయించింది. వీటి విలువ దాదాపు రూ. 2,069 కోట్లు. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఎస్ఎంబీసీ ఈ వాటాలు విక్రయించింది. కొటక్ మహీంద్రాలో ఎస్ఎంబీసీకి 3.58 శాతం వాటాలుండేవి. తాజాగా బీఎస్ఈలో 1.81 కోట్ల షేర్లను (0.98%) రూ. 1,152 కోట్లకు, ఎన్ఎస్ఈలో 1.47 కోట్ల షేర్లను (0.80 శాతం) రూ.917 కోట్లకు విక్రయించింది. బీఎస్ఈలో షేర్లు సగటున రూ. 636.25 రేటుకి, ఎన్ఎస్ఈలో రూ.623.95 ధరకి అమ్ముడయ్యాయి. 1.81 కోట్ల షేర్లను కెనడాకు చెందిన సీపీపీ ఇన్వెస్ట్మెంట్ బోర్డు కొనుగోలు చేసింది. 2015 ఆఖరు నాటికి కొటక్ మహీంద్రా బ్యాంకులో సీపీపీకి 3.91% వాటాలు ఉన్నాయి.