న్యూఢిల్లీ: ప్రముఖ కేఫ్ కాఫీ డే చైన్‌ను నిర్వహిస్తున్న కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్ (సీడీజీఎల్)పై దాఖలైన దివాలా పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ బెంగళూరు బెంచ్ అడ్మిట్ చేసింది. రూ.94 కోట్లు చెల్లించాలని పేర్కొంటూ, బకాయిలను రాబట్టుకునేందుకుగాను కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను (సీఐఆర్‌పీ) ప్రారంభించాలని కంపెనీ ఫైనాన్షియల్ క్రెడిటార్ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్ స్వీకరించింది.
సీడీజీఎల్ మాతృ సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఎన్‌సీఎల్‌టీ లిఖితపూర్వక ఆదేశాల కోసం సీడీజీఎల్ ఎదురుచూస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఈ పిటిషన్‌కు సంబంధించి తన అనుబంధ సంస్థ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కూడా పేర్కొంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో సీడీజీఎల్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సీడీజీఎల్ ఆదాయం రూ. 920.41 కోట్లు. నష్టం రూ.67.77 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment