IPRS Files Insolvency Petition Case Against Zee Entertainment - Sakshi
Sakshi News home page

‘జీ’పై ఐపీఆర్‌ఎస్‌ దివాలా అస్త్రం

Published Tue, Jan 3 2023 7:43 PM | Last Updated on Tue, Jan 3 2023 8:05 PM

Iprs Files Insolvency Petition Case Against Zee Entertainment - Sakshi

న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజ్‌పై  రచయితలు, కంపోజర్లు, మ్యూజిక్‌ పబ్లిషర్‌లతో కూడిన నాన్‌–ప్రాఫిట్‌ సొసైటీ ద ఇండియన్‌ పెర్ఫార్మింగ్‌ రైట్‌ సొసైటీ(ఐపీఆర్‌ఎస్‌) దివాలా అస్త్రాన్ని ప్రయోగించింది.  రాయల్టీకింద రూ. 211.41 కోట్ల చెల్లింపుల్లో విఫలమైనట్లు పేర్కొంటూ ఐపీఆర్‌ఎస్‌ దివాలా చట్ట ట్రిబ్యునల్‌ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించినట్లు స్వయంగా ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

అయితే ఈ క్లెయిమును తిరస్కరిస్తున్నట్లు జీ తెలియజేసింది.  క్లెయిము మొత్తాన్ని తాను చెల్లించాల్సిన పనిలేదని వివరించింది. ఈ మేరకు తాను ఎన్‌సీఎల్‌టీలో సమాధానం దాఖలు చేస్తామని తెలిపింది. లిటరరీ, మ్యూజికల్‌ వర్క్‌లకు సంబంధించి రాయల్టీలు చెల్లించవలసి ఉన్నట్లు ఐపీఆర్‌ఎస్‌ ప్రస్తావించినట్లు వివరించింది. ఈ కేసుపై గతంలో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఐపీఆర్‌ఎస్‌ కోరుతున్న సొమ్ము బకాయికాదని, చెల్లించవలసిన అవసరంలేదని వివరణ ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement