IPRS
-
‘జీ’పై ఐపీఆర్‌ఎస్ దివాలా అస్త్రం
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజ్‌పై రచయితలు, కంపోజర్లు, మ్యూజిక్ పబ్లిషర్లతో కూడిన నాన్–ప్రాఫిట్ సొసైటీ ద ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్ సొసైటీ(ఐపీఆర్‌ఎస్) దివాలా అస్త్రాన్ని ప్రయోగించింది. రాయల్టీకింద రూ. 211.41 కోట్ల చెల్లింపుల్లో విఫలమైనట్లు పేర్కొంటూ ఐపీఆర్‌ఎస్ దివాలా చట్ట ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీని ఆశ్రయించినట్లు స్వయంగా ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అయితే ఈ క్లెయిమును తిరస్కరిస్తున్నట్లు జీ తెలియజేసింది. క్లెయిము మొత్తాన్ని తాను చెల్లించాల్సిన పనిలేదని వివరించింది. ఈ మేరకు తాను ఎన్సీఎల్టీలో సమాధానం దాఖలు చేస్తామని తెలిపింది. లిటరరీ, మ్యూజికల్ వర్క్‌లకు సంబంధించి రాయల్టీలు చెల్లించవలసి ఉన్నట్లు ఐపీఆర్‌ఎస్ ప్రస్తావించినట్లు వివరించింది. ఈ కేసుపై గతంలో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఐపీఆర్‌ఎస్ కోరుతున్న సొమ్ము బకాయికాదని, చెల్లించవలసిన అవసరంలేదని వివరణ ఇచ్చింది. -
శ్రీసిటీ.. ఇట్స్ ఎ బ్రాండ్!
సాక్షి, న్యూఢిల్లీ/వరదయ్యపాళెం: దేశంలోని అత్యున్నత పారిశ్రామిక పార్కుల్లో ఒకటిగా ఏపీలోని శ్రీసిటీ నిలిచింది. కేంద్ర పరిశ్రమ, అంతర్గత వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ (ఐపీఆర్‌ఎస్) రిపోర్ట్ 2.0 నివేదికలో 41 పారిశ్రామిక పార్కులను ‘లీడర్స్’గా గుర్తించారు. ఇందులో దక్షిణ భారత్ నుంచి శ్రీసిటీ మాత్రమే లీడర్స్ కేటగిరీలో చోటు దక్కించుకోవడం విశేషం. దేశంలోని 15 అత్యున్నత సెజ్‌లలో ఒకటిగా శ్రీసిటీ నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న 449 పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లపై జరిపిన అధ్యయనంలో పారిశ్రామిక పార్కులను లీడర్స్, చాలెంజర్స్, ఆస్పిరర్స్‌గా విభజించారు. కాగా 90 పారిశ్రామిక పార్కులను చాలెంజర్ కేటగిరీలో, 185 పార్కులను ఆస్పిరర్స్‌గా చేర్చారు. ఈ రేటింగ్‌లు ఇప్పటికే ఉన్న కీలక పారామీటర్స్, మౌలిక సదుపాయాల ఆధారంగా కేటాయించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ ఈ నివేదికను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ నివేదిక భారతదేశ పారిశ్రామిక పోటీతత్వాన్ని పెంపొందిస్తుందని, మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తాయని తెలిపారు. కాగా, ఐపీఆర్‌ఎస్ రేటింగ్‌పై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గౌరవం శ్రీసిటీ ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు, పారిశ్రామిక స్నేహపూర్వక వాతావరణానికి, స్థిరమైన పర్యావరణ ఉత్తమ పద్ధతులకు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. -
‘కాపీరైట్ పాటలపై రాయల్టీ చెల్లించాల్సిందే’
న్యూఢిల్లీ: ఈవెంట్ ఆర్గనైజర్లు కాపీరైట్ అయిన పాటలను వేడుకల్లో వాడుకున్నప్పుడు.. సంబంధిత సంస్థలకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి పాటలను వాడుకునే ముందు ఆ సంస్థలకు విషయాన్ని తెలియజేసి.. అనుమతి పొందాలంది. ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్ సొసైటీ (ఐపీఆర్‌ఎస్), ఫోనోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ లిమిటెడ్ (పీపీఎల్), నోవెక్స్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ మూడు సంస్థలు ప్రస్తుతం కాపీరైట్స్‌ను పర్యవేక్షిస్తున్నాయి. కనుక ఈవెంట్ ఆర్గనైజర్లు ఈ సంస్థలకు తప్పక సమాచారం ఇవ్వాలని పేర్కొంది -
ఐపీఆర్‌ఎస్ నుంచి వైదొలుగుతున్నా
తమిళసినిమా : ఇండియన్ పెర్ఫామింగ్ రైట్ సొసైటీ (ఐపీఆర్‌ఎస్)నుంచి వైదొలుగుతున్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా వెల్లడించారు. కొనేళ్ల క్రితం సంగీతానికి సంబంధించి సంగీత దర్శకులు, గీతరచయితలు, నిర్మాతలు తమ రాయల్టీ కోసం ఐపీఆర్‌ఎస్ సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. సాంస్కృతిక, తదితర కార్యక్రమాల్లో తమ పాటల్ని వాడుకున్నవారు తగిన రాయల్టీని ఈ సంఘం వసూలు చేసి ఆయా సంగీత దర్శకులకు, గీతరచయితలకు, నిర్మాతలకు అందిస్తుంది. కాగా ఈ సంఘం సక్రమంగా బాధ్యతలు నిర్వహించడం లేదంటూ ఇళయరాజా ధ్వజమెత్తారు. ఆయన పిలుపు మేరకు రంగస్థల సంగీత, సాంకేతిక కళాకారుల సంఘం టి,నగర్‌లోని వాణిమహాల్లో సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో ఇళయరాజా మాట్లాడుతూ తాను అడిగేవాడి ని కాదు, ఇచ్చేవాడినేన్నారు. అలా కొన్నివేల పాటల్ని మీకిచ్చానన్నారు. ఇక విషయాని కొస్తే తన పాటల్ని కానీ,ఇతరులు పాటల్ని కానీ మీరు పాడుకోవడానికి చట్ట ప్రకారం అనుమతి పొందాలన్నారు. అందుకోసమే సంగీతదర్శకులు,గీతరచయితలు, నిర్మాతలు సమష్టి నిర్ణయంతో ఐపీఆర్ఎస్ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.అయితే ఆ సంఘం నిర్వాహకులు సక్రమంగా బాధ్యతలు నిర్వహించడం లే దన్నారు. అంతే కాకుండా తప్పుడు లెక్కల తో సభ్యులను మోసం చేస్తున్నారని ఆరోపిం చారు. తన పాటలకు వసూలు చేస్తున్న మొ త్తంలో ఇప్పటికి పది శాతం కూడా తన కు అందించలేదన్నారు. తనను కలుసుకున్న వా రు సంగీత కార్యక్రమాల్లో 80 శాతం నా పా టలే పాడుతున్నారని చెబుతున్నానన్నారు. అలాంటిది తనకే ఐదు, పది శాతం ఇస్తుంటే ఇతరుల సంగతేమిటని ప్రశ్నించా రు. అసలు ఎవరి పాటకు ఎంత నిర్ణయించారు, ఏడాదికి ఎంత వసూలూ చేస్తున్నారు లాంటి ప్రశ్నలు అడగడానికి ఆస్కారమే లేదన్నారు. నేను వైదొలుగుతున్నా ఇలాంటి పలు కారణాలతో తానీ సంఘం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.తనకు జరుగుతున్న మోసమే మీకూ జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని మీ అందరికీ వివరించి ఇకపై తన పాటలకు సంబంధించిన రాయల్టీని మీరే స్వయంగా తన కార్యాలయానికి వచ్చి ఇవ్వాలని తెలి య జేయడానికే సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వివరిచారు. ఇంకో విషయం ఏమిటం టే తన పాటలకు రాయల్టీ ఎంత అని తాను చెప్పనని, మీరే నిర్ణయించుకుని ఇవ్వాలని అ న్నారు. అవసరం అయితే సినీ మ్యూజిక్ యూనియన్‌తో సంప్రదించి నిర్ణయం తీసేకోవలసిందిగా అన్నారు. అదీ కాదంటే మన మే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుందాం అ ని ఇళయరాజా అన్నారు. సమావేశానికి రా ష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రంగస్థల కళాకారులు, సాంకేతిక నిపుణులు విచ్చేశారు.