ఐపీఆర్‌ఎస్ నుంచి వైదొలుగుతున్నా | Retirement from IPRS | Sakshi
Sakshi News home page

ఐపీఆర్‌ఎస్ నుంచి వైదొలుగుతున్నా

Published Sat, Jul 4 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM

ఐపీఆర్‌ఎస్ నుంచి వైదొలుగుతున్నా

ఐపీఆర్‌ఎస్ నుంచి వైదొలుగుతున్నా

తమిళసినిమా : ఇండియన్ పెర్ఫామింగ్ రైట్ సొసైటీ (ఐపీఆర్‌ఎస్)నుంచి వైదొలుగుతున్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా వెల్లడించారు. కొనేళ్ల క్రితం సంగీతానికి సంబంధించి సంగీత  దర్శకులు, గీతరచయితలు, నిర్మాతలు తమ రాయల్టీ కోసం ఐపీఆర్‌ఎస్ సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. సాంస్కృతిక, తదితర కార్యక్రమాల్లో తమ పాటల్ని వాడుకున్నవారు తగిన రాయల్టీని ఈ సంఘం వసూలు చేసి ఆయా సంగీత దర్శకులకు, గీతరచయితలకు, నిర్మాతలకు అందిస్తుంది. కాగా ఈ సంఘం సక్రమంగా బాధ్యతలు నిర్వహించడం లేదంటూ ఇళయరాజా ధ్వజమెత్తారు.

ఆయన పిలుపు మేరకు రంగస్థల సంగీత, సాంకేతిక కళాకారుల సంఘం టి,నగర్‌లోని వాణిమహాల్‌లో సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో ఇళయరాజా మాట్లాడుతూ తాను అడిగేవాడి ని కాదు, ఇచ్చేవాడినేన్నారు. అలా కొన్నివేల పాటల్ని మీకిచ్చానన్నారు. ఇక విషయాని కొస్తే తన పాటల్ని కానీ,ఇతరులు పాటల్ని కానీ మీరు పాడుకోవడానికి చట్ట ప్రకారం అనుమతి పొందాలన్నారు. అందుకోసమే సంగీతదర్శకులు,గీతరచయితలు, నిర్మాతలు సమష్టి నిర్ణయంతో ఐపీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.అయితే ఆ సంఘం నిర్వాహకులు సక్రమంగా బాధ్యతలు నిర్వహించడం లే దన్నారు.

అంతే కాకుండా తప్పుడు లెక్కల తో సభ్యులను మోసం చేస్తున్నారని ఆరోపిం చారు. తన పాటలకు వసూలు చేస్తున్న మొ త్తంలో ఇప్పటికి పది శాతం కూడా తన కు అందించలేదన్నారు. తనను కలుసుకున్న వా రు సంగీత కార్యక్రమాల్లో 80 శాతం నా పా టలే పాడుతున్నారని చెబుతున్నానన్నారు. అలాంటిది తనకే ఐదు, పది శాతం ఇస్తుంటే ఇతరుల సంగతేమిటని ప్రశ్నించా రు. అసలు ఎవరి పాటకు ఎంత నిర్ణయించారు, ఏడాదికి ఎంత వసూలూ చేస్తున్నారు లాంటి ప్రశ్నలు అడగడానికి ఆస్కారమే లేదన్నారు.

 నేను వైదొలుగుతున్నా
 ఇలాంటి పలు కారణాలతో తానీ సంఘం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.తనకు జరుగుతున్న మోసమే మీకూ జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని మీ అందరికీ వివరించి ఇకపై తన పాటలకు సంబంధించిన రాయల్టీని మీరే స్వయంగా తన కార్యాలయానికి వచ్చి ఇవ్వాలని తెలి య జేయడానికే సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వివరిచారు. ఇంకో విషయం ఏమిటం టే తన పాటలకు రాయల్టీ ఎంత అని తాను చెప్పనని, మీరే నిర్ణయించుకుని ఇవ్వాలని అ న్నారు. అవసరం అయితే సినీ మ్యూజిక్ యూనియన్‌తో సంప్రదించి నిర్ణయం తీసేకోవలసిందిగా అన్నారు. అదీ కాదంటే మన మే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుందాం అ ని ఇళయరాజా అన్నారు. సమావేశానికి రా ష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రంగస్థల కళాకారులు, సాంకేతిక నిపుణులు విచ్చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement