న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) ఫోరెన్సిక్ ఆడిట్ ప్రక్రియపై సంస్థ డైరెక్టర్ కిశోర్ బియానీ తాజాగా బోంబే హైకోర్టును ఆశ్రయించారు.
బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బీడీవో ఇండియా ఆగస్టు 9న సమర్పించిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టుతో పాటు మొత్తం ఆడిట్ ప్రక్రియను సవాలు చేస్తూ ఆయన రిట్ పిటీషన్ దాఖలు చేసినట్లు కంపెనీ తెలిపింది.
వివరాల్లోకి వెడితే.. గతేడాది జూలై 20న ఎఫ్‌ఆర్‌ఎల్‌పై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 15 నాటికి ముగియాలి. ఇందులో భాగంగా కంపెనీ ఖాతాలను ప్రధాన రుణదాత బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) తరఫున బీడీవో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది. దీనిపై తమ సమాధానాలు తెలపాల్సిందిగా కిషోర్ బియానీ, ఆయన సోదరుడు రాకేష్ బియానీకి బీవోఐ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment