సాక్షి,ముంబై: కిషోర్ బియానీ నేతృత‍్వంలోని ఫ్యూచర్ గ్రూపు 3.4 బిలియన్ డాలర్ల రిలయన్స్ రీటైల్ డీల్ ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్ అలుపెరుగని పోరాటం చేస్తోంది. మరోవైపు ఈ ఒప్పందం అమలును అడ్డుకునేందుకు అమెజాన్ ప్రయత్నాలను ఎద్దేవా చేస్తూ ఫ్యూచర్ గ్రూపు సీఈఓ కిషోర్ బియానీ సంచలన వ్యాఖ‍్యలు చేశారు. ఈ భూమిని ఆక్రమించాలన్న అలెగ్జాండర్ ది గ్రేట్ క్రూరమైన కోరికలాంటిదే అమెజాన్ ప్రయస కూడా అని అభివర్ణించారు. ప్రపంచంలో చాలా భాగాన్ని జయించిన గ్రీకు వీరుడు ఇండియాలో తోక ముడిచాడనేది చరిత్ర చెబుతోందని వ్యంగ‍్యంగా వ్యాఖ్యానించారు. (బియానీని అరెస్ట్ చేయండి!)
రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు రిటైల్ ఆస్తుల విక్రయం నిబంధనలకు విరుద్ధమని వాదిస్తున్న అమెరికా ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీసహా వ్యవస్థాపకులందరినీ అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బియానీ తాజా వ్యాఖ‍్యలు చేశారు. అంతేకాదు భారతీయ కస్టమర్లపై ఆధిపత్యం కోసం అమెజాన్ చేస్తున్న కార్పొరేట్ యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఒక అంతర‍్గత లేఖ రాశారు. రిలయన్స్ రీటైల్ ఒప్పందానికి సంబంధించి అన్ని నిబంధనలను పాటించామని, రెగ్యులేటరీ ఇటీవలి ఆమోదమే ఇందుకు నిదర్శనమన్నారు. 1,700 దుకాణాలు, వేలాది మంది ఉద్యోగుల మనుగడకు ఈ ఒప్పందం కీలకమని తెలిపారు. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి అమెజాన్ నిరాకరించింది. (అమెజాన్‌కు ఎలాంటి పరిహారం చెల్లించం : కిశోర్ బియానీ)
Comments
Please login to add a commentAdd a comment