వాషింగ్టన్: సిరియా నుంచి అమెరికా దళాల ఉపసంహరణ ప్రారంభమైంది. సిరియాలో ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను ఓడించామని అమెరికా ప్రకటించింది. ‘సిరియాలో ఐఎస్‌ను ఓడించాం. నా అధ్యక్ష కాలంలో పూర్తిచేయాలనుకున్న లక్ష్యం అది’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం ట్వీట్ చేశారు. సిరియా నుంచి అమెరికా దళాలు వెనుతిరిగాయని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ తెలిపారు.
ఉగ్రవాదం వల్ల, లేదా వేరే ఏ ఇతర కారణం వల్ల కానీ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రయోజనాలకు ప్రమాదం వాటిల్లే సందర్భాల్లో యూఎస్, దాని మిత్రదేశాల దళాలు తమ సేవలందించేందుకు సిద్ధంగా ఉంటాయని అందులో పేర్కొన్నారు. ‘సిరియాలో విజయం సాధించాం. కానీ ఐఎస్‌పై పోరాటం ఇంకా ముగియలేదు’ అని యూఎస్ రక్షణ శాఖ ప్రతినిధి డానా డబ్ల్యూ వైట్ పేర్కొన్నారు. సిరియా నుంచి దళాల ఉపసంహరణను.. లక్ష్యం చేరకముందే తీసుకున్న అర్ధాంతర నిర్ణయంగా వాల్‌స్ట్రీట్ జర్నల్ అభివర్ణించింది.
Comments
Please login to add a commentAdd a comment