వాషింగ్టన్ : అంతర్యుద్ధంతో విచ్ఛిన్నమైన సిరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద షాకే ఇచ్చారు. భారీ ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు శనివారం ట్రెజరీ(నిధుల) విభాగానికి ఆయన ఆదేశాలు జారీచేశారు.
తాజాగా సిరియా నుంచి తమ బలగాలు వెనక్కి తీసుకోవాలని అమెరికా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో సుమారు 200 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేసినట్లు ట్రెజరీ శాఖ పేర్కొంది. ఫిబ్రవరిలో కువైట్ పర్యటన సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్.. సిరియా పునర్మిణానికి ఆ భారీ ఆర్థిక సాయ ప్రకటన చేశారు.
దాడుల్లో విధ్వంసం అయిన ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల నిర్మాణాలు, రోడ్ల నిర్మాణం, విద్యుత్, నీటి సదుపాయాల కోసం వీటిని వెచ్చించనున్నట్లు టిల్లర్‌సన్ ఆ సమయంలో ప్రకటించారు. ఇక సిరియన్ డెమొక్రటిక్ దళాలకు సాయంగా అమెరికా 2 వేల మంది సైనికులను సుమారు దశాబ్దం క్రితమే సిరియాలో మోహరించింది. తాజా నిర్ణయంతో త్వరలో వారంతా స్వదేశానికి చేరుకోబోతున్నట్లు గురువారం ట్రంప్ ప్రకటించారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment