ఐఎన్‌ఎఫ్‌ నుంచి వైదొలగిన అమెరికా | Donald Trump confirms US withdrawal from INF nuclear treaty | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎఫ్‌ నుంచి వైదొలగిన అమెరికా

Published Sat, Feb 2 2019 5:28 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Donald Trump confirms US withdrawal from INF nuclear treaty - Sakshi

వాషింగ్టన్‌: రష్యాతో కుదుర్చుకున్న ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఐఎన్‌ఎఫ్‌ (ఇంటర్మీడియట్‌–రేంజ్‌ న్యూక్లియర్‌ ఫోర్సెస్‌) ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి రష్యా క్షిపణులను తయారు చేసినందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో చెప్పారు. వైదొలిగే ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమై ఆర్నెల్లు కొనసాగుతుందనీ, ఆలోపు రష్యా తాను తయారు చేసిన ఆయుధాలను నాశనం చేసి చర్చలకు రావాలని కోరారు. ‘30 ఏళ్లకుపైగా ఈ ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉంది. కానీ రష్యా ఉల్లంఘనలకు పాల్పడుతున్నప్పుడు మేం కూడా ఈ ఒప్పందం నుంచి బయటకొస్తాం’అని పాంపియో తెలిపారు. ఈ ఆరు నెలల్లోపు రష్యా తన ఆయుధాలను నాశనం చేసి ఒప్పందానికి కట్టుబడుతుందని తాము భావిస్తున్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement