Mutual Funds: ఆధునిక కాలంలో సంపాదించేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే సంపాదనలో ఎంతో కొంత పొదుపు చేయాలనీ లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని అనుకుంటారు. ఆలా అనుకునే వారికి మ్యుచువల్ ఫండ్స్ ఉత్తమ మార్గం అనే చెప్పాలి. ఈ కథనంలో బెస్ట్ ఫండ్ ఏది? ఎంత పెట్టుబడికి ఎంత వస్తుందనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో పెట్టుబడికి చాలా మార్గాలు ఉన్నాయి, అందులో ఉత్తమ మార్గాన్ని ఎంచుకున్నట్లయితే మీరు తప్పకుండా ప్రతి నెలా పెద్ద మొత్తంలో డబ్బులు పొందవచ్చు. మ్యుచువల్ ఫండ్ సిస్టమాటిక్ ప్లాన్ ద్వారా ఎక్కువ ప్రయోజనాలను అందుకోవాలనుకుంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
రిటర్న్స్..
మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసే డబ్బుని బట్టి మీ రిటర్న్స్ ఉంటాయని తప్పకుండా గుర్తుంచుకోవాలి. తక్కువ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ రిటర్న్స్.. ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మీరు ఎంచుకున్న మ్యుచువల్ ఫండ్ వ్యాల్యూ రూ.10 ఉన్న ఒక లక్ష యూనిట్లను కొనుగోలు చేశారనుకుంటే.. మీ పెట్టుబడి రూ. 10 లక్షలు (1,00,000×10) అవుతుంది.
మీరు నెలకు రూ. 10000 రిటర్న్ పొందాలంటే.. మొదటి నెలలో ఎన్ఏవీ రూ. 10 ఉన్నప్పుడు 1000 యూనిట్లను విక్రయించి అనుకున్న పదివేలు తిరిగి పొందుతారు. అంటే అప్పుడు మీ వద్ద 99,000 యూనిట్లు మిగిలి ఉంటాయి.
రెండవ నెలలో ఫండ్ ఎన్ఏవీ విలువ రూ.12కు పెరిగితే ఆ నెలలు మీకు పదివేలు ఇవ్వడానికి కేవలం 833 యూనిట్లను (10,000/12) మాత్రమే విక్రయించడం జరుగుతుంది. దీంతో మీ ఖాతాలో 98,167 యూనిట్లు ఉంటాయి. ఈ విధంగా మీరు ప్రతి నెలా లెక్కించుకోవచ్చు. ఫండ్ మంచి పనితీరుని కనపరిస్తే పెట్టుబడి అలాగే ఉంటుంది, డబ్బులు వస్తూనే ఉంటాయి. పనితీరు మందగిస్తే పెట్టుబడి కరిగిపోతూ వస్తుంది.
నెలకు రూ. 1 లక్ష..
ఈ విధంగా మీకు నెలకు రూ. 1 లక్ష.. 25 సంవత్సరాలు పాటు రావాలంటే ఒకే సారి రూ. 1,55,50,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన 8 శాతం వార్షిక రిటర్న్స్ వచ్చాయంటే ప్రతి నెలా రూ. 1 లక్ష అందుకోవచ్చు. ఇలా 25 సంవత్సరాల తరువాత కూడా మీ పెట్టుబడి ఖాతాలో అలాగే ఉంటుంది. అంతే కాకుండా పాతికేళ్లు నెలకు 1 లక్ష వస్తూనే ఉంటుంది.
Disclaimer: ఇలాంటి మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు, తప్పకుండా దాని గురించి అవగాహన కలిగి ఉండాలి లేదా నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో లాభాలు మాత్రమే కాకుండా నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా గమనించగలరు.
Comments
Please login to add a commentAdd a comment