‘మున్సిపల్’ నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరిరోజు | Today Last date to Municipal nominations withdrawal | Sakshi
Sakshi News home page

‘మున్సిపల్’ నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరిరోజు

Published Tue, Mar 18 2014 3:46 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

Today Last date to Municipal nominations  withdrawal

  సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో సోమవారం 1,608 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మున్సిపాలిటీల్లో 1,524 మంది, మున్సిపల్ కార్పొరేషన్లలో 84 మంది తమ నామినేషన్లను వెనక్కు తీసుకున్నారు. మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం ఆఖరిరోజు. రాజకీయ పార్టీలు ‘బీ’ ఫారాలు ఇప్పటివరకు ఇవ్వనిపక్షంలో.. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా రిటర్నింగ్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ అభ్యర్థులను స్వతంత్రుల కింద పరిగణిస్తారు.
 
 ఆదిలాబాద్‌లో బీజేపీ బోణీ
 
 ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలలో 34వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయిన బీజేపీ అభ్యర్థి నెక్రం కృష్ణను  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సోమవారమిక్కడ అభినందించారు. ఇది శుభారంభం మాత్రమేనని, మున్ముందు మరిన్ని విజయాలు తథ్యమని కిషన్‌రెడ్డి చెప్పారు. కృష్ణను ఘనంగా సన్మానించారు.
 
 రేపు మీడియా ప్రతినిధులతో ఈసీ వర్క్‌షాపు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రింట్ మీడియాకు పెయిడ్ న్యూస్, ఎన్నికల నిబంధనల గురించి కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం వర్క్ షాపును నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 గంటల నుంచి  అన్నిమాధ్యమాల పత్రికల సంపాదకులు, ప్రతినిధులతో జూబ్లీహాల్‌లో వర్క్‌షాపు నిర్వహించనున్నట్లు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement