
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి జూన్ త్రైమాసికంలో రూ.70,213 కోట్లను ఉపసంహరించుకున్నారు. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదల ఇందుకు దారితీసింది. ‘‘సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్య పరిస్థితులు ఇంకా కఠినతరం అవుతాయి. దీంతో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు మరికొంత తగ్గొచ్చు’’అని ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ సీఈవో సందీప్ తెలిపారు.
జూన్ చివరికి డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు 5 శాతం తగ్గి రూ.12.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. మార్చి క్వార్టర్ చివరికి ఇవి రూ.13 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2021–22 మొదటి త్రైమాసికం నాటికి రూ.14.16 లక్షల కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment