Debt Mutual Funds
-
డెట్ ఫండ్స్‌లోకి రూ.1.57 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు అక్టోబర్‌లో డిమాండ్ ఏర్పడింది. ఏకంగా రూ.1.57 లక్షల కోట్లను డెట్ ఫండ్స్ ఆకర్షించాయి. సెప్టెంబర్ నెలలో ఇదే విభాగం నుంచి రూ.1.14 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోగా, మరుసటి నెలలోనే పరిస్థితుల్లో పూర్తి మార్పు కనిపించింది.ముఖ్యంగా డెట్‌లో మొత్తం 16 కేటగిరీలకు గాను 14 విభాగాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. దీంతో డెట్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఆస్తులు (ఏయూఎం) 11 శాతం వృద్ధితో అక్టోబర్ చివరికి రూ.16.64 లక్షల కోట్లకు పెరిగాయి. సెప్టెంబర్ చివరికి ఇవి రూ.14.97 లక్షల కోట్లుగా ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.స్వల్పకాల ఫండ్స్‌కు ఆదరణ » లిక్విడ్ ఫండ్స్ అత్యధికంగా 83,863 కోట్లను రాబట్టాయి. అక్టోబర్ నెలలో మొత్తం డెట్ పెట్టుబడుల్లో సగం లిక్విడ్ ఫండ్స్‌లోకే వచ్చాయి. » ఓవర్‌నైట్ ఫండ్స్ రూ.25,784 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్ రూ.25,303 కోట్ల చొప్పున ఆకర్షించాయి. » అల్ట్రా షార్ట్ డ్యురేషన్ (12 నెలల్లోపు) ఫండ్స్‌లోకి రూ.7,054 కోట్లు వచ్చాయి. » లో డ్యురేషన్ ఫండ్స్ రూ.5,600 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రూ.4,644 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.1,362 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ప్రధానంగా తక్కువ కాలానికి ఉద్దేశించని డెట్ ఫండ్స్‌కు ఆదరణ లభించింది. » నాలుగు నెలల విరామం తర్వాత బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.936 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. » గిల్ట్ ఫండ్స్ రూ.1,375 కోట్లు, లాంగ్ డ్యురేషన్ బాండ్ ఫండ్స్ రూ.1,177 కోట్ల చొప్పున ఆకర్షించాయి. -
డెట్ ఫండ్స్ నుంచి ఉపసంహరణలు
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఆగస్ట్ నెలలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. జూలై నెలలో నికర పెట్టుబడులను ఈ విభాగం ఆకర్షించగా.. ఆగస్ట్‌లో రూ.25,872 కోట్లు వీటి నుంచి బయటకు వెళ్లిపోయాయి. అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఇంకా ముగియకపోవడంతో ఇన్వెస్టర్లు డెట్ ఫండ్స్‌లో పెట్టుబడుల పట్ల అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెట్‌లో 16 విభాగాలకు గాను 9 విభాగాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లిక్విడ్ ఫండ్స్ (రూ.26,824 కోట్లు), అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ (రూ.4,123 కోట్లు)లో ఎక్కువగా అమ్మకాలు నమోదయ్యాయి. ఇవన్నీ స్వల్పకాల పెట్టుబడుల కోసం ఉద్దేశించిన పథకాలు. అలాగే, బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ విభాగం సైతం నికరంగా రూ.985 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. ఇక ఓవర్ నైట్ ఫండ్స్ రూ.3,158 కోట్లు, ఫ్లోటర్ ఫండ్స్ రూ.2,325 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రూ.1,755 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ఈ ఏడాది జూలైలో డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ.61,140 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. ఈక్విటీల్లోకి పెట్టుబడులు.. ‘‘ప్రస్తుత వడ్డీ రేట్ల వాతావరణం, వడ్డీ రేట్ల గమనంపై నెలకొన్న అనిశి్చతితో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. వడ్డీ రేట్ల గమనంపై స్పష్టత వచ్చే వరకు వేచి ఉండే ధోరణి అనుసరించినట్టుగా ఉంది. అదే సమయంలో ఈక్విటీల్లో ర్యాలీ మొదలు కావడంతో డెట్ నుంచి పెట్టుబడులను అటువైపు మళ్లించినట్టున్నారు’’అని మారి్నంగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ మెలి్వన్ శాంటారియా వివరించారు. తాజా అమ్మకాలతో ఆగస్ట్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని డెట్ ఫండ్స్ పెట్టుబడుల విలువ రూ.14 లక్షల కోట్లకు పరిమితమైంది. జూలై చివరికి ఇది రూ.14.17 లక్షల కోట్లుగా ఉంది. -
పెట్టుబడుల వరద.. రూ.1.06 లక్షల కోట్లకు డెట్ మ్యూచువల్ ఫండ్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో (ఏప్రిల్) డెట్ మ్యాచువల్ ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. రూ.1.06 లక్షల కోట్లను డెట్ మ్యూచువల్ ఫండ్ విభాగం ఆకర్షించింది. అంతక్రితం మార్చిలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.56,884 కోట్లు బయటకు వెళ్లగా, మరుసటి నెలలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లిక్విడ్ ఫండ్స్ మొత్తం పెట్టుబడుల్లో 60 శాతాన్ని ఆకర్షించాయి. వీటిల్లోకి రూ.63,219 కోట్లు వచ్చాయి. క్రెడిట్ రిస్క్, బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్ విభాగాలను మినహాయిస్తే, డెట్‌లో మిగిలిన అన్ని విభాగాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. స్వల్పకాల పథకాలకు ఎక్కువ ఆదరణ లభించింది. ఏప్రిల్ 1 నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై పన్ను ప్రయోజనం తొలగిపోయినందున పెట్టుబడులు రానున్న రోజుల్లో క్షీణించొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. దీర్ఘకాల మూలధన లాభాల పన్ను నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించే వెసులుబాటును కేంద్ర సర్కారు ఇటీవల తొలగించడం తెలిసిందే. మార్చి నెలలో డెట్ విభాగం నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లడం సాధారణమేనని ఫిన్ ఎడ్జ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయాంక్ భట్నాగర్ పేర్కొన్నారు. అయితే ఒక్కసారిగా లిక్విడ్ ఫండ్స్‌లోకి ఏప్రిల్ నెలలో అంత భారీ పెట్టుబడులు రావడానికి కారణం నిర్ధారించడం కష్టమన్నారు. మనీ మార్కెట్ ఫండ్స్‌కూ డిమాండ్ ఏప్రిల్ నెలలో భారీ పెట్టుబడుల రావడం వల్ల ఫండ్స్ నిర్వహణలోని డెట్ ఆస్తుల విలువ మార్చి చివరికి ఉన్న రూ.11.81 లక్షల కోట్ల నుంచి రూ.12.98 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం. లిక్విడ్ ఫండ్స్ తర్వాత మనీ మార్కెట్ ఫండ్స్ అత్యధికంగా రూ.10,663 కోట్లను ఆకర్షించాయి. అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.10,663 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫ్లోటర్స్ ఫండ్స్‌లోకి రూ.3,991 కోట్లు వచ్చాయి. ఇక క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి రూ.356 కోట్లకు బయటకు వెళ్లాయి. బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.150 కోట్లను ఉపసంహరించుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధన ప్రకారం మ్యూచువల్ ఫండ్స్‌లో లాభాలకు కాల వ్యవధితో సంబంధం లేకుండా స్వల్పకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. లాభం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. దీంతో తమ శ్లాబు రేటు ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన పెట్టుబడుల రాకపై ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయం ఫండ్స్ పరిశ్రమ నుంచి వినిపిస్తోంది. -
Finance Bill 2023: సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) విభాగంలో సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను(ఎస్టీటీ) పెంచింది. దీంతోపాటు రుణ సెక్యూరిటీల(డెట్) మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపైనా స్వల్పకాలిక పన్నుకు తెరతీసింది. శుక్రవారం ఎస్‌టీటీసహా 64 సవరణలతో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2023 ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందింది. వెరసి పన్ను సవరణలతోకూడిన 2023 ఫైనాన్స్ బిల్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఆప్షన్స్‌లో 0.05 శాతం నుంచి 0.0625 శాతానికి, ఫ్యూచర్ కాంట్రాక్టులలో 0.01 శాతం నుంచి 0.0125 శాతానికి ఎస్టీటీ పెరగనుంది. తద్వారా ప్రభుత్వ ఆదాయం బలపడటంతోపాటు.. ట్రేడింగ్ వ్యయాలు పెరగనుండటంతో మితిమీరిన లావాదేవీలకు చెక్ పడనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల భారీ సంఖ్యలో రిటైల్ ఇన్వెస్టర్లు ఈ విభాగంలో నష్టపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ చర్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఆప్షన్స్‌లో తొలుత 0.017 శాతం నుంచి 0.021 శాతానికి ఎస్టీటీ పెరగనున్నట్లు వెలువడిన వార్తలు టైపింగ్ పొరపాటుగా ఆర్థిక శాఖ వివరణ ఇవ్వడం గమనార్హం! డెట్ ఎంఎఫ్లపైనా.. తాజా బిల్లు ప్రకారం డెట్ ఎంఎఫ్ ఆస్తులలో 35 శాతానికి మించి ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అంతకంటే తక్కువగా ఈక్విటీలకు మళ్లించే ఎంఎఫ్‌లు స్వల్పకాలిక పెట్టుబడి లాభాల(క్యాపిటల్ గెయిన్) పన్ను చెల్లించవలసి వస్తుంది. తాజా నిబంధనల ప్రకారం డెట్ ఎంఎఫ్‌లు చేపట్టే 35 శాతంలోపు ఈక్విటీ పెట్టుబడులపై శ్లాబులకు అనుగుణంగా పన్ను చెల్లించవలసి వస్తుంది. ప్రస్తుత సవరణలతో మార్కెట్ ఆధారిత డిబెంచర్, అధిక శాతం నిధులను రుణ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేసే ఎంఎఫ్ మధ్య సారూప్యతకు తెరలేవనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి ఎంఎఫ్లకు ప్రస్తుతం ఇండెక్సేషన్ లబ్ధి్దతో కలిపి 20 శాతం దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్(ఎల్టీసీజీ) ట్యాక్స్ వర్తిస్తోంది. ఆశ్చర్యకరం ఎల్టీసీజీ సవరణలతోకూడిన 2023 ఫైనాన్స్ బిల్లు ఆశ్చర్యకరమని ఎంఎఫ్ పరిశ్రమ అసోసియేషన్(యాంఫీ) చైర్మన్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ చీఫ్ ఎ.బాలసుబ్రమణ్యన్ పేర్కొన్నారు. తాజా మార్పులకు పరిశ్రమ సన్నద్ధం కావలసి ఉన్నట్లు తెలియజేశారు. కార్పొరేట్ బాండ్ల మార్కెట్ అభివృద్ధి ఎజెండాను బిల్లు దెబ్బతీసే వీలున్నట్లు పలువురు అసెట్ మేనేజర్లు అభిప్రాయపడ్డారు. పీఎస్‌యూ దిగ్గజాలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లేదా నాబార్డ్ జారీ చేసే సెక్యూరిటీలకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ అతిపెద్ద సబ్స్క్రయిబర్లన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సవరణలపై సమీక్షను చేపట్టవలసి ఉన్నట్లు యాంఫీ వైస్‌చైర్‌పర్సన్, ఎడిల్వీస్ ఏఎంసీ హెడ్ రాధికా గుప్తా పేర్కొన్నారు. దేశీయంగా ఫైనాన్షియలైజేషన్ ఇప్పుడిప్పుడే బలపడుతున్నదని, వైబ్రేంట్ కార్పొరేట్ బాండ్ల మార్కెట్‌కు పటిష్ట డెట్ ఫండ్ వ్యవస్థ అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. డెట్ ఎంఎఫ్‌లలో పెట్టుబడులకు దీర్ఘకాలిక నిధులు తగ్గిపోతే బాండ్ల జారీ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవలసి వస్తుందని బాలసుబ్రమణ్యన్ వివరించారు. తాజా బిల్లు కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయని మరికొంతమంది నిపుణులు అంచనా వేశారు. కాగా.. మార్కెట్లు అనిశ్చితిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్టీటీ పెంపు సరికాదని పారిశ్రామిక సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ పేర్కొంది. ఇది మార్కెట్ సెంటిమెంటు, లావాదేవీల పరిమాణంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాల్మియా అభిప్రాయపడ్డారు. ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల విక్రయంపై ఎస్టీటీ పెంపుపై ఆర్థిక శాఖ స్పష్టతను ఇవ్వవలసి ఉన్నట్లు ఆయన తెలియజేశారు. అదనపు లావాదేవీ చార్జీలు రద్దు ఏప్రిల్ 1 నుంచి ఎన్ఎస్ఈ అమలు ఈక్విటీ నగదు, డెరివేటివ్స్ విభాగాలలో విధిస్తున్న అదనపు లావాదేవీల చార్జీలను ఏప్రిల్ 1 నుంచి రద్దు చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా వెల్లడించింది. 2021 జనవరి 1 నుంచి 6 శాతం పెంపును అమలు చేస్తోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్ఎస్ఈ తాజాగా తెలియజేసింది. ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ రక్షణ నిధి ట్రస్ట్(ఐపీఎఫ్టీ) మూలధనాన్ని(కార్పస్) పెంచేందుకు ఈ చార్జీలలో కొంత భాగాన్ని వినియోగిస్తోంది. రెండేళ్ల క్రితం బ్రోకర్ వైఫల్యాల కారణంగా మార్కెట్లలో సంకట పరిస్థితులు తలెత్తడంతో 6 శాతం చార్జీలను ఎన్ఎస్ఈ విధించింది. -
డెట్ మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు షాక్!
డెట్ మ్యూచువల్ ఫండ్స్ (Debt Mutual Funds) మదుపర్లకు కేంద్రం భారీ షాకిచ్చింది. ఆర్థిక బిల్లు 2023 సవరణల్లో భాగంగా లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ (ltcg) ప్రయోజనాన్ని ఎత్తివేసింది. దీంతో డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై పెట్టుబడి పెట్టగా వచ్చే రాబడిపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 35 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయని డెట్ మ్యూచువల్ ఫండ్లకు ఇకపై ఎల్టీసీజీ ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం డెట్ మ్యూచువల్ ఫండ్లలో మూడేళ్ల కంటే ఎక్కువ కాలం మదుపు చేస్తే వాటిని దీర్ఘకాల పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ఈ ఫండ్స్‌లో పెట్టుబడులపై ఇండికేషన్‌తోపాటు 20 శాతం ఎల్టీసీజీ చెల్లించాలి. ఇండికేషన్ లేకుండా అయితే 10 శాతం పన్ను పే చేస్తే సరిపోతుంది. కానీ ఇక నుంచి ఈ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లంతా తమకు వచ్చే ఆదాయంపై ఇన్‌కం టాక్స్ శ్లాబ్ ఆధారంగా పన్ను పే చేయాల్సిందే. దీనివల్ల ఈక్విటీ మార్కెట్ లింక్డ్ డిబెంచర్లు, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై విధించే పన్నులు సమానం అవుతాయి. -
డెట్ ఫండ్స్‌లో కొనసాగుతున్న అమ్మకాలు
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్ వరుసగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరిలో డెట్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.13,815 కోట్ల మేర నికరంగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డెట్ ఫండ్స్ నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు తరలిపోవడం వరుసగా మూడో నెలలోనూ చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో రూ.10,316 కోట్లు, గత డిసెంబర్లో రూ.21,947 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేష్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022 నవంబర్‌లో డెట్ ఫండ్స్‌లోకి రూ.3,668 కోట్ల మేర వచ్చాయి. డెట్‌లో మొత్తం 16 విభాగాలు ఉంటే, తొమ్మిది విభాగాల్లోని పథకాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మిగిలిన విభాగాల్లోకి పెట్టుబడులు వచ్చాయి. విభాగాల వారీగా.. ► లిక్విడ్ ఫండ్స్ నుంచి అత్యధికంగా రూ.11,304 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ► అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.2,430 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.1,904 కోట్లు, ఫ్లోటర్ ఫండ్స్ నుంచి రూ.1,665 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ► ఓవర్‌నైట్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.2,946 కోట్ల అమ్మకాలు చేశారు. ఆ తర్వాత కార్పొరేట్ కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌లో రూ.662 కోట్లు, డైనమిక్ బాండ్ ఫండ్స్‌లోకి రూ.502 కోట్లు, గిల్ట్ ఫండ్స్‌లోకి రూ.451 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► డెట్ విభాగంలో లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, మనీ మార్కెట్, ఓవర్‌నైట్ ఫండ్ విభాగాలు 50 శాతానికి పైగా ఆస్తులు కలిగి ఉన్నాయి. -
ఈక్విటీ పథకాల్లో కొనసాగిన పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక డిసెంబర్లో బలంగా నమోదైంది. రూ.7,303 కోట్లను ఈక్విటీ ఫండ్స్ ఆకర్షించాయి. అంతకుముందు నవంబర్ నెలలో వచ్చిన రూ.2,224 కోట్లతో పోలిస్తే రెండింతలు పెరిగాయి. డిసెంబర్ నెలకు సంబంధించి ఫండ్స్ సంస్థల గ ణాంకాలను యాంఫి విడుదల చేసింది. డెట్ మ్యూ చువల్ ఫండ్స్ నికరంగా రూ.21,947 కోట్లను కో ల్పోయాయి. 2022 సంవత్సరం మొత్తం మీద అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తు లు (ఏయూఎం) 5.7 శాతం (రూ.2.2 లక్షల కోట్లు ) వృద్ధి చెంది రూ.39.88 లక్షల కోట్లకు చేరాయి. 2021లో 7 శాతం వృద్ధితో పోలిస్తే తగ్గింది. పథకాల వారీగా.. ► ఈక్విటీ విభాగంలో స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,245 కోట్లు వచ్చాయి. ► లార్జ్‌క్యాప్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.26 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ రూ.203 కోట్ల పెట్టుబడులను కోల్పోయాయి. ► 24 ఓపెన్ ఎండెడ్ న్యూ ఫండ్ ఆఫర్ల రూపంలో (నూతన పథకాలు/ఎన్‌ఎఫ్‌వోలు) ఫండ్స్ సంస్థలు డిసెంబర్లో ఇన్వెస్టర్ల నుంచి రూ.6,954 కోట్లను సమీకరించాయి. ► 12 క్లోజ్ ఎండెడ్ ఎన్‌ఎఫ్‌వోలు రూ1,532 కోట్లను సమీకరించాయి. ► మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.676 కోట్లు రాగా, లా ర్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.1189 కోట్లు ఆకర్షించా యి. మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,962 కో ట్లు వచ్చా యి. ► వ్యాల్యూ ఫండ్స్‌లోకి రూ.648 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి రూ.564 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.403 కోట్ల చొప్పున వచ్చాయి. ► డెట్ విభాగంలో అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.13,852 కోట్లు బయటకు వెళ్లాయి. ► మల్టీ అస్సెట్ అలోకేషన్ పథకాలు రూ.1,711 కోట్లను ఆకర్షించాయి. సిప్ రూపంలో రూ.13,573 కోట్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో (సిప్) మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి డిసెంబర్ నెలలో రూ.13,573 కోట్లు వచ్చాయి. అంతకుముందు నెల నవంబర్‌లో సిప్ పెట్టుబడులు రూ.13,307 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. సిప్ వరుసగా వృద్ధి చూపించడం ఇది మూడో నెల. డిసెంబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ మొత్తం ఫోలియోల సంఖ్య 14.11 కోట్లకు చేరింది. ఒక పథకంలో ఇక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపును ఫోలియోగా చెబుతారు. పెట్టుబడులు కొనసాగుతాయి.. ‘‘ఇన్వెస్టర్లు సమీప భవిష్యత్తులోనూ మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో పెట్టుబడులు కొనసాగిస్తారు. వృద్ధి ఆధారిత బడ్జెట్ కోసం ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఇది మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించనుంది. దీర్ఘకాల లక్ష్యాలకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలన్న ప్రాధాన్యాన్ని ఇన్వెస్టర్లు విస్మరించలేదు. సిప్ ఖాతాలు పెరగడం దీన్నే సూచిస్తోంది. కొత్తగా డిసెంబర్లో 24 లక్షల సిప్ ఖాతాలు నమోదయ్యాయి. ఈ సాధనంపై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఇది తెలియజేస్తోంది’’అని యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. -
2022లో డెట్ ఫండ్స్‌కు అమ్మకాల సెగ
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల పెంపు 2022లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ విభాగంపై పెద్ద ప్రభావమే చూపించింది. ఏకంగా రూ.2.3 లక్షల కోట్లు డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటకు వెళ్లిపోయాయి. వడ్డీ రేట్ల పెంపు ఈ ఏడాది నిదానిస్తుందన్న అంచనాలతో డెట్ ఫండ్స్ తిరిగి పెట్టుబడులను ఆకర్షించొచ్చన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. 2021లోనూ డెట్ విభాగం రూ.34,545 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. డెట్ నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం రెండో ఏడాది నమోదైంది. ఇందుకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. వడ్డీ రేట్ల పెంపు క్రమంతోపాటు ఈక్విటీ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండడం నికర పెట్టుబడుల ఉపసంహరణకు దారితీసింది. తగ్గిన డెట్ ఫండ్స్ ఆస్తులు ► 2022లో మొత్తం మీద 5 నెలల్లో డెట్ పథకాల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా మా ర్చిలో రూ.1,14,824 కోట్లు, జూన్‌లో రూ. 92, 248 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ► షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.49,200 కోట్లను, కార్పొరేట్ బాండ్స్ నుంచి రూ. 40,500 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ► లిక్విడ్ ఫండ్స్‌లోకి గతేడాది నికరంగా రూ.17,940 కోట్లు వచ్చాయి. ► మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.9,250 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.1,021 కోట్ల చొప్పున వచ్చాయి. ► డెట్ మార్కెట్లో లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, మనీ మార్కెట్, ఓవర్‌నైట్ ఫండ్స్ పెట్టుబడులే 50 శాతానికి పైగా ఉన్నాయి. ► గతేడాది అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని డెట్ ఫండ్స్ ఆస్తులు 11 శాతం తగ్గి రూ.12.41 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. 2021 డిసెంబర్ నాటికి ఇవి రూ.14.06 లక్షల కోట్లుగా ఉన్నాయి. ► డెట్ ఫండ్స్‌కు సంబంధించి మొత్తం ఫోలియోలు 5 లక్షలు తగ్గి 73.38 లక్షలుగా ఉన్నాయి. మార్కెట్ పరిస్థితుల్లో మార్పులు ‘‘ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, సమీప కాలంలో వడ్డీ రేట్ల పెంపు ఎలా ఉంటుందోనన్న అస్పష్టత, రూపాయి పతనం ఇన్వెస్టర్లలో అప్రమత్తతకు దారితీసింది. దీని ఫలితమే డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం’’అని ఫెల్లో సహ వ్యవస్థాపకుడు, సీఈవో మనీష్ మర్యాద తెలిపారు. ‘‘ఈక్విటీ మార్కెట్ల వ్యాల్యూషన్లు కాస్త విస్తరించి ఉన్నాయి. రిస్క్ రాబడుల దృష్ట్యా మెరుగైన రాబడులను ఇచ్చే మీడియం టర్మ్ డెట్ కేటగిరీల్లోకి ఇన్వెస్టర్లు పెట్టుబడులను మళ్లించొచ్చు. జీసెక్‌లు, కార్పొరేట్ బాండ్ల మధ్య అంతరం పెరగడంతో క్రెడిట్ ఫండ్స్ కూడా పెట్టుబడులకు మంచి అవకాశం’’అని మార్నింగ్ స్టార్ ఇండియా సీనియర్ అనలిస్ట్ మేనేజర్ (పరిశోధన) కవితా కృష్ణన్ తెలిపారు. -
డెట్ ఫండ్స్‌కు అమ్మకాల సెగ
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి జూన్ త్రైమాసికంలో రూ.70,213 కోట్లను ఉపసంహరించుకున్నారు. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదల ఇందుకు దారితీసింది. ‘‘సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్య పరిస్థితులు ఇంకా కఠినతరం అవుతాయి. దీంతో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు మరికొంత తగ్గొచ్చు’’అని ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ సీఈవో సందీప్ తెలిపారు. జూన్ చివరికి డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు 5 శాతం తగ్గి రూ.12.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. మార్చి క్వార్టర్ చివరికి ఇవి రూ.13 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2021–22 మొదటి త్రైమాసికం నాటికి రూ.14.16 లక్షల కోట్లు. -
డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సరైన తరుణం ఏది?
మార్కెట్లు పడినప్పుడు ఈక్విటీ ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేసినట్టుగానే.. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు అనుకూల సమయం ఏది? డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టుకునేందుకు సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టుకునే ముందు, లంప్ సమ్ (ఒకే విడత మొత్తం) అయినా సరే.. మీ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలమైన ఫథకాన్ని ఎంపిక చేసుకోవడం అన్నది కీలకమవుతుంది. చాలా మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీరు ఎంపిక చేసుకున్న పథకం రక్షణ ఎక్కువగా ఉండే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేలా ఉండాలి. ఈక్విటీ మార్కెట్లు పడినప్పుడు కొనుగోలు చేసే మాదిరి అని అన్నారు. కానీ, అదేమంత సులభం కాదు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లు పడిపోతున్నప్పుడు దిద్దుబాటు చివరికి వచ్చిందా.. ఇంకా కరెక్షన్ మిగిలి ఉన్నదా అన్నది మీకు తెలియదు. అందుకని ఇన్వెస్టర్లు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని ఆచరించాలని చెబుతుంటాను. మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే కొంత మొత్తాన్ని మార్కెట్లు పడినప్పుడు పెట్టే విధంగా లక్ష్యాన్ని నిర్ధేశించుకోవచ్చు. కనిష్ట స్థాయిల్లో పెట్టుబడి పెట్టాలన్న దానిపై దృష్టి పెట్టడం వల్ల మంచిగా పెరిగే వాటిల్లో పెట్టుబడుల అవకాశాలను కోల్పోవచ్చు. నా మొత్తం పెట్టుబడుల్లో 70 శాతం ఈక్విటీల్లో ఉంటే, 30 శాతం ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) పథకాల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఈక్విటీ పెట్టుబడుల్లో 10 శాతాన్ని తీసుకెళ్లి రీట్లలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. పదేళ్ల కాలంలో వీటి రాబడులు సెన్సెక్స్‌ను అధిగమిస్తాయా? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఆర్ఈఐటీ/రీట్)లు అన్నవి వాణిజ్య అద్దె ఆదాయం వచ్చే ఆస్తులపై ఇన్వెస్ట్ చస్తుంటాయి. వీటి అద్దె రాబడులు అన్నవి ప్రస్తుతం అంత ఎక్కువేమీ లేవు. వచ్చే పదేళ్లలో కొంత పురోగతి ఉంటుందని ఆశిస్తున్నాను. అదే సమయంలో ప్రస్తుతం చూస్తున్న మాదిరి ప్రతికూలతలు మధ్యలో ఎదురైనప్పటికీ ఆర్థిక వ్యవస్థ, సెన్సెక్స్ పట్ల నేను ఎంతో ఆశావహంతో ఉన్నాను. రీట్ల కంటే సెన్సెక్స్ విషయంలోనే నేను ఎక్కువ సానుకూలంగా ఉన్నాను. ప్రతి నెలా ఫండ్స్‌లో రూ.50,000కు మించి పెట్టుబడులు పెట్టేట్టు అయితే పథకాల విభజన ఎలా? ప్రతి నెలా రూ.50,000తో ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ, పోర్ట్‌ఫోలియో సరళంగా ఉండేలా చూసుకోవాలన్నది నా సూచన. రెండు మంచి ఫ్లెక్సీక్యాప్ పథకాలు సరిపోతాయి. పదేళ్లు, అంతకుమించిన కాలానికి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే, రెండు ఫ్లెక్సీక్యాప్ పథకాలకు తోడు, రెండు స్మాల్‌క్యాప్ పథకాలను కూడా చేర్చుకోండి. పెట్టుబడులు సంక్లిష్టంగా కాకుండా, సరళంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలి. చదవండి: ఇలాంటి పాన్ కార్డు మీకుంటే.. రూ.10,000 పెనాల్టీ! -
డెట్ మ్యూచువల్ ఫండ్ నుంచి రూ.92,248 కోట్లు ఉపసంహరణ!
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలు జూన్ నెలలో అమ్మకాల ఒత్తిడిని చూశాయి. ఇన్వెస్టర్లు ఏకంగా రూ.92,248 కోట్లను డెట్ పథకాల నుంచి ఉపసంహరించుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగే క్రమం కావడం, అధిక కమోడిటీల ధరలు, వృద్ధి మందగమనం ఇవన్నీ పెట్టుబడులపై ప్రభావం చూపించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది మే నెలలోనూ డెట్ పథకాల నుంచి రూ.32,722 కోట్లు బయటకు వెళ్లగా.. ఏప్రిల్ నెలలో రూ.54,756 కోట్ల పెట్టుబడులు రావడం గమనించాలి. డెట్‌లో మొత్తం 16 విభాగాలకు గాను, 14 విభాగాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. ముఖ్యంగా ఓవర్‌నైట్, లిక్విడ్, అల్ట్రా షార్ట్‌టర్మ్ డ్యురేషన్ ఫండ్స్ ఎక్కువ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఓవర్‌నైట్ ఫండ్స్ నుంచి రూ.20,668 కోట్లు, లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.15,783 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ నుంచి 10,058 కోట్లు బయటకు వెళ్లాయి. 10 ఏళ్ల గిల్ట్ ఫండ్స్, లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌లోకి మాత్రమే నికరంగా పెట్టుబడులు వచ్చాయి. మే చివరికి డెట్ పథకాల పరిధిలోని నిర్వహణ ఆస్తులు రూ.13.22 లక్షల కోట్లుగా ఉంటే, జూన్ చివరికి రూ.12.35 లక్షల కోట్లకు తగ్గాయి. ఇందులోనూ 50 శాతం మేర ఆస్తులు లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, మనీ మార్కెట్, ఓవర్‌నైట్ పథకాల్లోనే ఉన్నాయి. అనిశ్చితుల వల్లే.. రెపో రేటు, ద్రవ్యోల్బణం పెరుగుతుండడం, ఇన్వెస్టర్ల స్వల్పకాల అవసరాల కోసం పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కారణాలై ఉండొచ్చని ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకురాలు ప్రీతిరాతి గుప్తా తెలిపారు. మహిళల కోసమే ఉద్దేశించిన ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్ ఎల్‌ఎక్స్‌ఎంఈ. మార్నింగ్ స్టార్ ఇండియా సీనియర్ అనలిస్ట్ కవిత కృష్ణన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకే అంకె రాబడికితోడు పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, పెరిగే ద్రవ్యోల్బణం వల్ల.. ఇతర పెట్టుబడి సాధనాలకు ఉన్న అనుకూలతలతో ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గు చూపి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికితోడు కార్పొరేట్ సంస్థలు, వ్యాపారస్థులు తమ స్వల్పకాల నిధుల అవసరాల కోసం ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడాన్ని ఎంపిక చేసుకుని ఉండొచ్చన్నారు. జూన్ నెలలో ఈక్విటీ పథకాలు నికరంగా రూ.15,498 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం తెలిసిందే. సాధారణంగా డెట్ పథకాలు తక్కువ రిస్క్‌తో ఉంటాయి. స్వల్పకాల అవసరాల కోసం ఇన్వెస్టర్లు వీటినే ఎంపిక చేసుకుంటారు. రాబడి తగ్గడం, ఈక్విటీ మార్కెట్లు దిద్దుబాటుకు గురై ఆకర్షణీయ అవకాశాలు అందుబాటులోకి రావడం కూడా పెట్టుబడుల ప్రవాహంపై ప్రభావం చూపి ఉంటాయి. -
ఫండ్ ఆఫ్ ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి?
నేను గత నాలుగేళ్లుగా క్వాంటమ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ఓఎఫ్), కోటక్ అసెట్ అలొకేటర్ ఎఫ్ఓఎఫ్... ఈ రెండు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయిస్తే నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? - సుధాకర్, హైదరాబాద్ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఎలాంటి పన్ను నిబంధనలు వర్తిస్తాయో ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కు కూడా అలాంటి పన్ను నిబంధనలే వర్తిస్తాయి. ఈ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్మెంట్స్ మూడేళ్లు దాటితే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై పన్ను 20 శాతంగా (ఇండెక్సేషన్ ప్రయోజనంతో) ఉంటుంది. మూడేళ్లలోపే ఈ ఫండ్స్‌ను విక్రయిస్తే ఆ లాభాలపై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రాబడులను మీ మొత్తం ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. నేను నాలుగు సంవత్సరాల క్రితం ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారాను. మొదటి కంపెనీలో 2 సంవత్సరాల ఏడు నెలల పాటు పనిచేశాను. పాత కంపెనీ పీఎఫ్‌ను కొత్త కంపెనీకి మార్చుకున్నాను. ఇప్పుడు ఈపీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రెండు కంపెనీల్లో నేను ఐదేళ్లకు మించి పనిచేసినందున నేను ఏమైనా పన్నులు చెల్లించాలా? - నందిని, విశాఖపట్టణం రెండు సందర్భాల్లో ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్ఓ) మూలం వద్దే పన్ను కోత(టీడీఎస్) విధిస్తుంది. మొదటిది ఈపీఎఫ్ విత్‌డ్రాయల్ 50,000 కంటే తక్కువగా ఉన్నప్పుడు, రెండవది విత్‌డ్రాయల్ చేసే మొత్తం 50వేలకు మించి, ఉద్యోగి ఐదేళ్ల సర్వీస్‌ను పూర్తి చేయనప్పుడు.. ఈ రెండు సందర్భాల్లో ఈపీఎఫ్ఓ(ఎంప్లాయీ ప్రావి డెండ్ ఫండ్) మూలం వద్దే పన్ను కోత(టీడీఎస్) విధిస్తుంది. హెచ్డీఎఫ్సీ క్లిక్ 2 ఇన్వెస్ట్లో గత ఏడాది అక్టోబర్‌లో ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించాను. మూడు నెలలకొకసారి రూ.12,500 ప్రీమియమ్ చొప్పున మూడు క్వార్టర్ల పాటు ప్రీమియ మ్లు చెల్లించాను. అయితే ఈ ఫండ్ పనితీరు ఆశించిన విధంగా లేదని భావిస్తున్నాను. ఈ ఫండ్‌ను సరెండర్ చేయాలనుకుంటున్నాను. నేను ఏమైనా సరెండర్ చార్జీలు చెల్లించాలా ? ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేసినప్పుడు ఆ మొత్తాన్ని డిస్కంటిన్యూడ్ ఫండ్‌కు బదిలీ చేస్తారని దీనిని పరిగణిస్తారని, ఐదేళ్ల పూర్తయిన తర్వాత సాధారణ వడ్డీ మాత్రమే వస్తుందని మిత్రులంటున్నారు. అది నిజమేనా? ఈ ఫండ్‌ను సరెండర్ చేయడం సరైన నిర్ణయమేనా? - కుమార్, విజయవాడ హెచ్డీఎఫ్సీ క్లిక్ 2 ఇన్వెస్ట్ అనేది తక్కువ వ్యయమున్న యులిప్(యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్). ఈ ఫండ్ మోర్టాలిటీ, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలను మాత్రమే వసూలు చేస్తోంది. ఇది 1.35 శాతంగా ఉంది. మీరు చెల్లించిన ప్రీమియమ్‌లో ఈ మొత్తాన్ని మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. వ్యయాల పరంగా చూస్తే అది చౌక యులిప్ అని చెప్పవచ్చు. ఇది మినహా మిగిలిన యులిప్‌లకు ఉండే అన్ని ప్రతికూలాంశాలు ఈ హెచ్డీఎఫ్సీ క్లిక్2కు వర్తిస్తాయి. సరైన పనితీరును కనబరచలేకపోవడం, లిక్విడిటీ లేకపోవడం... తదితర ప్రతికూలతలు షరా మామూలుగానే ఉన్నాయి. బీమా, ఇన్వెస్ట్మెంట్స్ కలగలసిన ఈ తరహా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు దూరంగా ఉండాలని ఇన్వెస్టర్లకు సూచిస్తూ ఉంటాం. యులిప్స్‌తో పోల్చితే మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి రాబడులు వస్తాయి. యులిప్‌లకు లాక్ ఇన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. ఓపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్‌లా యులిప్‌లను ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించలేం. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ అనుసంధాన ప్లాన్లు కాబట్టి ఈ ప్లాన్లు సరైన రాబడులు ఇవ్వనప్పుడు వేరే ఫండ్‌లోకి మారిపోవచ్చు. ఇక యులిప్‌ల్లో పారదర్శకత కూడా ఉండదు. ఇక మీ విషయానికొస్తే, ఈ యులిప్‌ను సరెండర్ చేయడం సరైన నిర్ణయమే. ఈ ప్లాన్‌ను సరెండర్ చేసేటప్పుడు ఉండే ఎన్ఏవీ(నెట్ అసెట్ వేల్యూ) బట్టి సరెండర్ విలువ ఉంటుంది. ఈ మొత్తాన్ని డిస్కంటిన్యూడ్ ఫండ్‌కు బదిలీ చేస్తారు. ఐదేళ్ల లాక్ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత డిస్కంటిన్యూడ్ చార్జీలను మినహాయించుకొని మిగిలిన దానిని మీకు చెల్లిస్తారు. ఈ ప్లాన్‌ను సరెండర్ చేయడం వల్ల మీకు నష్టాలు వచ్చినప్పటికీ, ఈ ప్లాన్‌ను సరెండర్ చేయడమే సరైన నిర్ణయం. భవిష్యత్తులో ఎప్పుడూ బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన ఈ తరహా ప్లానుల్లో ఇన్వెస్ట్ చేయకండి. జీవిత బీమా కోసం టర్మ్ బీమా పాలసీలు తీసుకోవాలి. వీటిల్లో బీమా కవరేజ్ అధికంగానూ, ప్రీమియమ్‌లు తక్కువగానూ ఉం టాయి. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం ఐదేళ్లపాటైనా ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందుతారు. నా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్) మెచ్యూర్ అయింది. దీనిని పొడిగించుకోవచ్చా? పొడిగించిన కాలానికి వడ్డీరేట్లలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటాయా? - కేశవరావు, రాజమండ్రి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్) ఐదేళ్ల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఇలా మెచ్యూర్ అయిన సీనియర్ సిటిజన్ స్కీమ్‌ను మరో మూడేళ్ల వరకూ పొడిగించుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంత వడ్డీరేటు ఉందో మొదటి ఐదేళ్ల కాలానికి అదే వడ్డీరేటు వర్తిస్తుంది. ఇక మీ ఖాతా మెచ్యూ ర్ అయిన తర్వాత అప్పుడు వడ్డీ రేట్లు ఎలా ఉం టాయో అవే మీ ఖాతాకు వర్తిస్తాయి. ఇప్పుడు భార త ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీరేట్లను మూడు నెలలకొకసారి సవరిస్తోంది. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఫండ్స్‌కు స్వల్ప ఊరట
లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లు-2014కు ఆమోదం ►డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై 20% పన్ను జూలై 10 నుంచి అమల్లోకి ►ఐటీ పన్ను రిటర్నుల జాప్యాలకు జరిమానాపై సీబీడీటీకి విచక్షణాధికారం న్యూఢిల్లీ: బడ్జెట్లో మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పరిశ్రమపై విధించిన అధిక పన్ను నుంచి స్వల్ప ఊరటను కల్పిస్తూ ప్రతిపాదనల్లో కేంద్రం కొద్దిగా సవరణలు చేసింది. అదేవిధంగా ఆదాయపు పన్ను(ఐటీ) చెల్లింపుదారులకు కూడా కొంత వెసులుబాటు కల్పించే చర్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ స్వల్ప మార్పులు మినహా ఫైనాన్స్ బిల్లు-2014లోని మిగతా ప్రతిపాదనలన్నింటికీ లోక్‌సభలో శుక్రవారం ఆమోదముద్ర పడింది. దీంతో దిగువసభలో బడ్జెట్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఏడాది బడ్జెట్లో డెట్ మ్యూచువల్ ఫండ్ యూనిట్ల విక్రయాలపై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్నును 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ ప్రతిపాదించారు. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. అయితే, ఇప్పుడు ఈ 20 శాతం పన్ను విధింపు అనేది బడ్జెట్ సమర్పించిన రోజు(జూలై 10) నుంచి అమల్లోకి వస్తుందని, ఈ మేరకు మూడు నెలలపాటు వాయిదావేస్తూ ఫైనాన్స్ బిల్లులో సవరణలు చేస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 1 నుంచి జూలై 10 వరకూ విక్రయించిన డెట్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై గతంలో ఉన్న 10 శాతం పన్ను రేటే అమలవుతుందని ప్రకటించారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువగా కార్పొరేట్ కంపెనీలే ఆర్బిట్రేజ్ కోసం పెట్టుబడులు పెడుతున్నాయని.. అందుకే ఈ 10 శాతం రాయితీ పన్ను రేటును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఫైనాన్స్ బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ జైట్లీ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ డెట్ ఫండ్స్ యూనిట్లపై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధింపునకు వ్యవధిని ఏడాది కాలంగా పరిగణిస్తుండగా.. బడ్జెట్లో మూడేళ్ల తర్వాత విక్రయించే యూనిట్లకు మాత్రమే ఈ పన్ను వర్తింపజేసేలా వ్యవధిని పెంచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం పెంచిన పన్ను రేట్లను మూడు నెలలపాటు వాయిదా వేయడం కేవలం అతిస్వల్ప ఊరటమాత్రమేనని.. దీనివల్ల తమ రంగానికి పెద్దగా ఉపయోగం లేదని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వర్గాలు పెదవివిరిచాయి. ఐటీ రిటర్నుల జరిమానాలకు సంబంధించి... ఐటీ రిటర్నుల దాఖలులో జాప్యానికిగాను ప్రస్తుతం ఉన్న రోజువారీ పద్దతిలో జరిమానా విధింపు నుంచి ఊరటనిచ్చే అధికారాన్ని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)కే ఇవ్వనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ఎవరైనా ఏడాది లేటుగా రిటర్నులు దాఖలు చేస్తే జరిమానా చాలా భారీగా ఉంటోందని... పెనాల్టీ తగ్గింపు లేదా మాఫీ అధికారం ప్రస్తుతం సీబీడీటీకి లేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే జరిమానా విధింపుపై విచక్షణాధికారాన్ని సీబీడీటీకి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే చర్యలు తీసుకున్న ఐటీ కేసులపై పన్ను చెల్లింపుదారులు తిరిగి సెటిల్మెంట్ కమిషన్‌కు వెళ్లే వెసులుబాటును కల్పిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో గార్‌పై నిర్ణయం... పన్ను ఎగవేతల నిరోధానికి సంబంధించి గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జనరల్ యాంటీ అవాయ్‌డెన్స్ రూల్స్(గార్) చట్టం అమలు, దీనిలో మార్పుచేర్పులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని జైట్లీ చెప్పారు. ఈ చట్టం అమలును వచ్చే ఏడాది ఏప్రిల్ 1 వరకూ గత సర్కారే వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గార్‌పై దేశీ ఇన్వెస్టర్లతోపాటు విదేశీ పెట్టుబడిదారుల నుంచి కూడా తీవ్ర వ్యతికేకత వ్యక్తం కావడంతో దీన్ని సమీక్షించనున్నట్లు ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రకటన చేసింది. కాగా, మార్చిలోగా సెయిల్(5% వాటా విక్రయం), ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్-10%), హిందుస్తాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్10%)లలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను చేపట్టనున్నట్లు ఆరుణ్ జైట్లీ వెల్లడించారు. తక్కువ పన్ను రేట్లే లక్ష్యం... సామాజిక కార్యకలాపాలకు మరిన్ని నిధులను సమకూర్చుకోవడం, దేశంలో ఉద్యోగకల్పన పెంపొందించేందుకుగాను పారిశ్రామిక రంగాన్ని పోత్సహిస్తామని.. పన్ను రేట్లను తక్కువస్థాయిలోనే ఉంచుతామని ఆయన హామీనిచ్చారు. ఇన్వెస్టర్లలో దెబ్బతిన్న విశ్వాసాన్ని పునరుత్తేజపరచడం, దేశీ ఉత్పత్తులకు విదేశాల్లో పోటీపడే వాతావరణం కల్పించేందుకు తక్కువ పన్ను రేట్లు ఆవశ్యకమని చెప్పారు. పొదుపు, పెట్టుబడుల పెంపు, తయారీ రంగం గాడిలోపడటంతోపాటు వృద్ధి తిరిగి పుంజుకునేందుకు దోహదం చేస్తుందన్నారు. తమ ప్రభుత్వానికి అధిక పన్నులు, సుంకాల జమానా కాదని చెప్పారు.