ఫండ్ ఆఫ్ ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి? | Fund of funds are the taxes? | Sakshi
Sakshi News home page

ఫండ్ ఆఫ్ ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి?

Published Mon, Aug 15 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

ఫండ్ ఆఫ్ ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి?

ఫండ్ ఆఫ్ ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి?

నేను గత నాలుగేళ్లుగా  క్వాంటమ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌ఓఎఫ్), కోటక్ అసెట్ అలొకేటర్ ఎఫ్‌ఓఎఫ్... ఈ రెండు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయిస్తే నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా?  - సుధాకర్, హైదరాబాద్
డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఎలాంటి పన్ను నిబంధనలు వర్తిస్తాయో ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కు కూడా అలాంటి పన్ను నిబంధనలే వర్తిస్తాయి. ఈ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్ మూడేళ్లు దాటితే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై పన్ను 20 శాతంగా (ఇండెక్సేషన్ ప్రయోజనంతో) ఉంటుంది. మూడేళ్లలోపే ఈ ఫండ్స్‌ను విక్రయిస్తే ఆ లాభాలపై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రాబడులను మీ మొత్తం ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు.


నేను నాలుగు సంవత్సరాల క్రితం ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారాను. మొదటి కంపెనీలో 2 సంవత్సరాల ఏడు నెలల పాటు పనిచేశాను. పాత కంపెనీ పీఎఫ్‌ను కొత్త కంపెనీకి మార్చుకున్నాను. ఇప్పుడు ఈపీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రెండు కంపెనీల్లో నేను ఐదేళ్లకు మించి పనిచేసినందున నేను ఏమైనా పన్నులు చెల్లించాలా?  - నందిని, విశాఖపట్టణం
రెండు సందర్భాల్లో ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్‌ఓ) మూలం వద్దే పన్ను కోత(టీడీఎస్) విధిస్తుంది. మొదటిది  ఈపీఎఫ్ విత్‌డ్రాయల్ 50,000 కంటే తక్కువగా ఉన్నప్పుడు, రెండవది విత్‌డ్రాయల్ చేసే మొత్తం 50వేలకు మించి, ఉద్యోగి ఐదేళ్ల సర్వీస్‌ను పూర్తి చేయనప్పుడు.. ఈ రెండు సందర్భాల్లో ఈపీఎఫ్‌ఓ(ఎంప్లాయీ ప్రావి డెండ్ ఫండ్) మూలం వద్దే పన్ను కోత(టీడీఎస్) విధిస్తుంది.

 
హెచ్‌డీఎఫ్‌సీ క్లిక్ 2 ఇన్వెస్ట్‌లో గత ఏడాది అక్టోబర్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రారంభించాను. మూడు నెలలకొకసారి రూ.12,500 ప్రీమియమ్ చొప్పున మూడు క్వార్టర్ల పాటు ప్రీమియ మ్‌లు చెల్లించాను. అయితే ఈ ఫండ్ పనితీరు ఆశించిన విధంగా లేదని భావిస్తున్నాను. ఈ ఫండ్‌ను సరెండర్ చేయాలనుకుంటున్నాను. నేను ఏమైనా సరెండర్ చార్జీలు చెల్లించాలా ? ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేసినప్పుడు ఆ మొత్తాన్ని డిస్‌కంటిన్యూడ్ ఫండ్‌కు బదిలీ చేస్తారని దీనిని పరిగణిస్తారని, ఐదేళ్ల పూర్తయిన తర్వాత సాధారణ వడ్డీ మాత్రమే వస్తుందని మిత్రులంటున్నారు. అది నిజమేనా? ఈ ఫండ్‌ను సరెండర్ చేయడం సరైన నిర్ణయమేనా?  - కుమార్, విజయవాడ
హెచ్‌డీఎఫ్‌సీ క్లిక్ 2 ఇన్వెస్ట్ అనేది తక్కువ వ్యయమున్న యులిప్(యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్). ఈ ఫండ్ మోర్టాలిటీ, ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీలను మాత్రమే వసూలు చేస్తోంది. ఇది 1.35 శాతంగా ఉంది. మీరు చెల్లించిన ప్రీమియమ్‌లో ఈ మొత్తాన్ని మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. వ్యయాల పరంగా చూస్తే అది చౌక యులిప్ అని చెప్పవచ్చు. ఇది మినహా మిగిలిన యులిప్‌లకు ఉండే అన్ని ప్రతికూలాంశాలు ఈ హెచ్‌డీఎఫ్‌సీ క్లిక్2కు వర్తిస్తాయి. సరైన పనితీరును కనబరచలేకపోవడం, లిక్విడిటీ లేకపోవడం... తదితర ప్రతికూలతలు షరా మామూలుగానే ఉన్నాయి. బీమా, ఇన్వెస్ట్‌మెంట్స్ కలగలసిన  ఈ తరహా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు దూరంగా ఉండాలని ఇన్వెస్టర్లకు సూచిస్తూ ఉంటాం. యులిప్స్‌తో పోల్చితే మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి రాబడులు వస్తాయి. యులిప్‌లకు లాక్ ఇన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. ఓపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్‌లా యులిప్‌లను ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించలేం. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ అనుసంధాన ప్లాన్‌లు కాబట్టి ఈ ప్లాన్‌లు సరైన రాబడులు ఇవ్వనప్పుడు వేరే ఫండ్‌లోకి మారిపోవచ్చు. ఇక యులిప్‌ల్లో పారదర్శకత కూడా ఉండదు. ఇక మీ విషయానికొస్తే, ఈ యులిప్‌ను సరెండర్ చేయడం  సరైన నిర్ణయమే. ఈ ప్లాన్‌ను సరెండర్ చేసేటప్పుడు ఉండే ఎన్‌ఏవీ(నెట్ అసెట్ వేల్యూ) బట్టి  సరెండర్ విలువ ఉంటుంది.

ఈ మొత్తాన్ని డిస్‌కంటిన్యూడ్ ఫండ్‌కు బదిలీ చేస్తారు. ఐదేళ్ల లాక్‌ఇన్ పీరియడ్ పూర్తయిన  తర్వాత డిస్‌కంటిన్యూడ్ చార్జీలను మినహాయించుకొని మిగిలిన దానిని మీకు చెల్లిస్తారు. ఈ ప్లాన్‌ను సరెండర్ చేయడం వల్ల మీకు నష్టాలు వచ్చినప్పటికీ,  ఈ ప్లాన్‌ను సరెండర్ చేయడమే సరైన నిర్ణయం. భవిష్యత్తులో ఎప్పుడూ బీమా, ఇన్వెస్ట్‌మెంట్ కలగలసిన ఈ తరహా ప్లానుల్లో  ఇన్వెస్ట్ చేయకండి. జీవిత బీమా కోసం టర్మ్ బీమా పాలసీలు తీసుకోవాలి. వీటిల్లో బీమా కవరేజ్ అధికంగానూ, ప్రీమియమ్‌లు తక్కువగానూ ఉం టాయి. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం ఐదేళ్లపాటైనా ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందుతారు.

 
నా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్‌ఎస్) మెచ్యూర్ అయింది. దీనిని పొడిగించుకోవచ్చా? పొడిగించిన కాలానికి వడ్డీరేట్లలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటాయా? - కేశవరావు, రాజమండ్రి

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్‌ఎస్) ఐదేళ్ల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఇలా మెచ్యూర్ అయిన సీనియర్ సిటిజన్ స్కీమ్‌ను మరో మూడేళ్ల వరకూ పొడిగించుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంత వడ్డీరేటు ఉందో మొదటి ఐదేళ్ల కాలానికి అదే వడ్డీరేటు వర్తిస్తుంది. ఇక మీ ఖాతా మెచ్యూ ర్ అయిన తర్వాత అప్పుడు వడ్డీ రేట్లు ఎలా ఉం టాయో అవే మీ ఖాతాకు వర్తిస్తాయి. ఇప్పుడు భార త ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీరేట్లను మూడు నెలలకొకసారి సవరిస్తోంది.

ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement