న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్ వరుసగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరిలో డెట్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.13,815 కోట్ల మేర నికరంగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డెట్ ఫండ్స్ నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు తరలిపోవడం వరుసగా మూడో నెలలోనూ చోటు చేసుకుంది.
ఈ ఏడాది జనవరిలో రూ.10,316 కోట్లు, గత డిసెంబర్‌లో రూ.21,947 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేష్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022 నవంబర్‌లో డెట్ ఫండ్స్‌లోకి రూ.3,668 కోట్ల మేర వచ్చాయి. డెట్‌లో మొత్తం 16 విభాగాలు ఉంటే, తొమ్మిది విభాగాల్లోని పథకాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మిగిలిన విభాగాల్లోకి పెట్టుబడులు వచ్చాయి.
విభాగాల వారీగా..
► లిక్విడ్ ఫండ్స్ నుంచి అత్యధికంగా రూ.11,304 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు.
► అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.2,430 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.1,904 కోట్లు, ఫ్లోటర్ ఫండ్స్ నుంచి రూ.1,665 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు.
► ఓవర్‌నైట్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.2,946 కోట్ల అమ్మకాలు చేశారు. ఆ తర్వాత కార్పొరేట్ కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌లో రూ.662 కోట్లు, డైనమిక్ బాండ్ ఫండ్స్‌లోకి రూ.502 కోట్లు, గిల్ట్ ఫండ్స్‌లోకి రూ.451 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి.
► డెట్ విభాగంలో లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, మనీ మార్కెట్, ఓవర్‌నైట్ ఫండ్ విభాగాలు 50 శాతానికి పైగా ఆస్తులు కలిగి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment