ఆగస్టు నుంచి ఆన్‌లైన్‌లో పీఎఫ్ ఉపసంహరణ!
న్యూఢిల్లీ: ఖాతాదారులు ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ ఉపసంహరించుకునే వెసులుబాటును ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఆగస్టు నుంచి ప్రవేశపెట్టనుంది. ఖాతాదారులకు పేపర్ వర్క్ లేకుండా సౌకర్యవంతంగా సేవలందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్‌వో అధికారి ఒకరు తెలిపారు. ఈ కొత్త సౌకర్యంతో కొన్ని గంటల్లోనే పీఎఫ్ సొమ్ము ఖాతాదారుల బ్యాంకు అకౌంట్లలో చేరిపోతుందన్నారు. ఆన్‌లైన్ క్లెయిమ్స్‌కు ఖాతాదారులు యూనివర్సల్ అకౌంట్ నంబర్లు యాక్టివేట్ చేసుకోవాలని, బ్యాంకు ఖాతా తదితరాలతో కేవైసీ సమర్పించాలన్నారు. సికింద్రాబాద్, గుర్‌గావ్, ద్వారకా (ఢిల్లీ)లలో సెంట్రల్ డాటా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.