
చండీగఢ్: పంజాబ్ కాబోయే ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ (48) శనివారం గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. శుక్రవారం మొహాలిలో జరిగిన సమావేశంలో ఆప్ శాసనసభా పక్ష నేతగా మాన్ ఎన్నికవడం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలకు చెందిన 122 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పలువురు వీవీఐపీలకు భద్రతను ఉపసంహరించుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. కేంద్ర హోం శాఖ సూచనల ప్రకారం బాదల్ కుటుంబం, మాజీ సీఎంలు కెప్టెన్ అమరీందర్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ వంటి వారు మినహా మిగతా వారి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి తీసుకోవాలన్నారు.