వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. సిరియానుంచి సైనిక దళాలను ఉపసంహరించుకుంటున్నట్టు అనూహ్యంగా ప్రకటించడం ఆశ్చర్యంలో ముంచెత్తింది. సిరియాలోని అమెరికా సైనిక దళాలను పూర్తిగా విరమించుకుంటున్నామని వెల్లడించారు. ఐసిస్‌ను పూర్తిగా ఓడించామని ట్రంప్ పేర్కొన్నారు. సైనిక దళాలను వెనక్కి రావాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ట్రంప్ ట్విటర్‌లో ఒక పోస్ట్ పెట్టారు.
సిరియాలో ఐసిస్ ఓడించాం. తన హయాంలో ఇన్నాళ్లు అక్కడ ఉండటానికి ఇదే ఏకైక కారణమని ట్వీట్ చేశారు. మరోవైపు ట్రంప్ ఆదేశాల మేరకు మిలిటర్ దళాలను సిరియానుంచి అతి త్వరగా వెనక్కి మళ్లేందుకు కృషి చేస్తున్నాయని అధికారికవర్గాలు వెల్లడించాయి. అయితే ఈ అంశాన్ని పెంటగాన్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
కాగా ఇటీవల (డిసెంబరు 6) అక్కడ(సిరియా) ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జిమ్ మాటిస్ ప్రకటించడం గమనార్హం.
We have defeated ISIS in Syria, my only reason for being there during the Trump Presidency.
— Donald J. Trump (@realDonaldTrump) December 19, 2018
Comments
Please login to add a commentAdd a comment