వారానికి రూ. 50,000 తీసుకోవొచ్చు
సేవింగ్స్ ఖాతాల విత్ డ్రాయల్ పరిమితి పెంపు
ముంబై: సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వీక్లీ క్యాష్ విత్‌డ్రాయల్ పరిమితి సోమవారం నుంచి రూ.50,000కు పెరిగింది. అంటే ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి వారానికి రూ.50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. మార్చి 13 నుంచి ఈ పరి మితి కూడా ఉండదు. కాగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి క్యాష్ విత్‌డ్రాయల్ పరిమితి ఇప్పటివరకూ రూ.24,000గా ఉంది.
క్యాష్ విత్‌డ్రాయల్స్‌పై ఉన్న పరిమితులను రెండంచెల్లో ఎత్తివేస్తామని ఆర్‌బీఐ ఇదివరకే ప్రకటించింది. ఇందులో మొదటిది సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్ 8 నుంచి క్యాష్ విత్‌డ్రాయెల్స్‌పై పరిమితులు ఆర్‌బీఐ విధించింది.