ఈ నెల 19 నుంచి దేశ వ్యాప్తంగా రూ. 2000 వేల నోట్లు ఎక్ఛేంజ్, డిపాజిట్లు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ఆర్‌బీఐ రూ. 2000 నోట్లను ఉపసంహరణ ప్రకటనతో దేశంలో పలు బ్యాంక్‌లు కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చాయి. బ్యాంకులు సాధారణంగా నెలలో జరిపే ట్రాన్సాక్షన్‌లు మించి జరిగితే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఆ ఛార్జీలు రూ.2000 నోట్ల డిపాజిట్లు, మార్పిడిపై వర్తిస్తాయని తెలిపాయి.
ఈ తరుణంలో కొన్ని బ్యాంకులు మాత్రం ఆ అదనపు ఛార్జీల భారాన్ని కస్టమర్లపై మోపడం లేదని ప్రకటించాయి. దీంతో సదరు బ్యాంకుల్లో రూ.2000 వేల నోట్ల డిపాజిట్లు, ఉపసంహరణ చేసే ఖాతాదారులకు భారీ ఊరట లభించినట్లైంది.
ఐసీఐసీఐ బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌లలో రూ.2000 నోట్లను మెషిన్‌లో డిపాజిట్లు చేయొచ్చు. సీనియర్ సిటిజన్లు ఇతర పద్దతుల్లో బ్యాంక్ సర్వీసుల్ని వినియోగించి డిపాజిట్లు చేసుకోవచ్చని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.
కేవైసీ నిబంధనలకు లోబడి బ్యాంక్ ఖాతాదారులు రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి అభ్యంతరాలు లేవని కస్టమర్లకు మెయిల్స్ పంపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
అంతేకాదు రూ.2వేల నోట్ల ఉపసంహరణ గడువు సెప్టెంబర్ 30,2023 వరకు ఎలాంటి అందనపు ఛార్జీలు విధించబోమని, సేవింగ్ అకౌంట్ ఖాతాదారులకు ఇది వర్తిస్తుందని తెలిపింది.
కెనరా బ్యాంక్
కెనరా బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలలో రూ. 2,000 డినామినేషన్ నోట్ల డిపాజిట్లపై నగదు చెల్లింపు ఛార్జీల్ని తొలగిస్తున్నట్లు ప్రకటిస్తూ ట్వీట్ చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఐడీ కార్డ్‌లను అడగడం లేదని ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మెయిల్ ద్వారా తన కస్టమర్‌లు రూ. 2,000 నోట్లను తమ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాలో సెప్టెంబర్ 30, 2023 వరకు ఏదైనా బ్రాంచ్‌లో జమ చేసుకోవచ్చని తెలియజేసింది.
చదవండి👉 రూ 2000 నోటు మార్చుకుంటున్నారా?, సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్న బ్యాంక్‌లు!
Comments
Please login to add a commentAdd a comment