levy taxes
-
రూ.2వేల నోట్ల మార్పిడి.. బ్యాంక్ ఖాతాదారులకు భారీ ఊరట!
ఈ నెల 19 నుంచి దేశ వ్యాప్తంగా రూ. 2000 వేల నోట్లు ఎక్ఛేంజ్, డిపాజిట్లు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ఆర్బీఐ రూ. 2000 నోట్లను ఉపసంహరణ ప్రకటనతో దేశంలో పలు బ్యాంక్‌లు కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చాయి. బ్యాంకులు సాధారణంగా నెలలో జరిపే ట్రాన్సాక్షన్లు మించి జరిగితే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఆ ఛార్జీలు రూ.2000 నోట్ల డిపాజిట్లు, మార్పిడిపై వర్తిస్తాయని తెలిపాయి. ఈ తరుణంలో కొన్ని బ్యాంకులు మాత్రం ఆ అదనపు ఛార్జీల భారాన్ని కస్టమర్లపై మోపడం లేదని ప్రకటించాయి. దీంతో సదరు బ్యాంకుల్లో రూ.2000 వేల నోట్ల డిపాజిట్లు, ఉపసంహరణ చేసే ఖాతాదారులకు భారీ ఊరట లభించినట్లైంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌లలో రూ.2000 నోట్లను మెషిన్లో డిపాజిట్లు చేయొచ్చు. సీనియర్ సిటిజన్లు ఇతర పద్దతుల్లో బ్యాంక్ సర్వీసుల్ని వినియోగించి డిపాజిట్లు చేసుకోవచ్చని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. కేవైసీ నిబంధనలకు లోబడి బ్యాంక్ ఖాతాదారులు రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి అభ్యంతరాలు లేవని కస్టమర్లకు మెయిల్స్ పంపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు రూ.2వేల నోట్ల ఉపసంహరణ గడువు సెప్టెంబర్ 30,2023 వరకు ఎలాంటి అందనపు ఛార్జీలు విధించబోమని, సేవింగ్ అకౌంట్ ఖాతాదారులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలలో రూ. 2,000 డినామినేషన్ నోట్ల డిపాజిట్లపై నగదు చెల్లింపు ఛార్జీల్ని తొలగిస్తున్నట్లు ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఐడీ కార్డ్‌లను అడగడం లేదని ఏఎన్ఐ ట్వీట్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మెయిల్ ద్వారా తన కస్టమర్లు రూ. 2,000 నోట్లను తమ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాలో సెప్టెంబర్ 30, 2023 వరకు ఏదైనా బ్రాంచ్‌లో జమ చేసుకోవచ్చని తెలియజేసింది. చదవండి👉 రూ 2000 నోటు మార్చుకుంటున్నారా?, సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్న బ్యాంక్‌లు! -
ఆ సిటీలో పొగ బండ్లకి ప్రత్యేక పన్ను! బెంబేలెత్తున్న వాహనదారులు
జీరో కార్బన్ ఎమిషన్స్ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ పఠిస్తున్న మంత్రం. కర్బన ఉద్ఘారాలను తగ్గించాలనే లక్క్ష్యంతో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇంగ్లండ్ మరో అడుగు ముందుకేసింది. డీజిల్, పెట్రోల్ బండ్లతో రోడ్ల మీదకి వస్తే భారీ ఫైన్లు విధిస్తున్నాయి అక్కడి స్థానిక ప్రభుత్వాలు. ప్రత్యేక పన్ను ప్రపంచలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా లండన్‌కి పేరు. అయితే ఈ నగరంలో కొన్ని ప్రాంతాలను అల్ట్రా లో ఎమిషన్ జోన్లుగా ప్రకటించారు. అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువ కాలుష్యం విడుదల చేసే వాహనాలు తిరిగేందుకు అనుమతి లేదు. ఈ నిబంధన ఉల్లంఘించి ఏదైనా వాహనం ఈ మార్గంలో ప్రయాణిస్తే వాటికి ప్రత్యేక పన్నుగా 12.5 పౌండ్లు విధిస్తున్నారు. ఇండియన్ కరెన్సీలో ఈ పన్ను దాదాపు రూ. 1200లుగా ఉంది. ఈ ఇంజన్లయితే ఓకే లండన్ నగరంలోని అల్ట్రా లో ఎమిషన్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణించాలని అక్కడి ప్రభుత్వం కోరుతోంది. దీంతో పాటు పెట్రోలు వాహానాలైతే యూరో స్టేజ్ 4 ప్రమాణాలు పాటించాలని డీజిల్ వాహానాలైతే యూరో స్టేజ్ 6 ప్రమాణాలు పాటించాలని నిర్ధేశించాయి. ముక్కుపిండి యూరో స్టేజ్ 4, 6 ప్రమాణాల ప్రకారం తయారైన వాహనాలు కాకుండా పాత పెట్రోలు, డీజిల్ ఇంజన్‌తో నడిచే వాహనాలతో ఈ జోన్లలోని రోడ్లపైకి వస్తే 12.5 పౌండ్ల ప్రత్యేక పన్నుని ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. మిగిలిన నగరాలకు కర్బన ఉద్ఘారాలను తగ్గించాలనే టార్గెట్‌తో మొదట బైకులు, స్కూటర్లపై ఈ ప్రత్యేక పన్ను విధించారు. సానుకూల ఫలితాలు రావడంతో ఇప్పుడు ఇతర వాహనాలకు విస్తరించారు. బెటర్ రిజల్ట్స్ వస్తే ఈ విధానాన్ని దేశంలోని ఇతర నగరాల్లోనూ అమలు చేయాలనే యోచనలో ఉంది అక్కడి ప్రభుత్వం. బాదేస్తున్నారు ఈ ప్రత్యేక పన్నుపై లండన్‌లో మిశ్రమ స్పందన వస్తోంది. ఇంట్లో నుంచి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత రకరకాల పనుల నిమిత్తం తిరగాల్సి ఉంటుందని, ఒక్కొసారి ట్రాఫిక్ జామ్స్ వల్ల ఆల్టర్నేట్ రూట్స్‌లో వెళ్తుంటామని, ఇలాంటి సమయంలో అల్ట్రా లో ఎమిషన్ జోన్లోకి వచ్చారంటూ ఈ ప్రత్యేక పన్ను విధించడం బాగాలేదని కొందరు వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కాలుష్యం తగ్గించాలంటే కఠిన చర్యలు తప్పవంటున్నారు. చదవండి : ఎలక్ట్రిక్ మార్కెట్లోకి హోండా మోటార్స్ -
పప్పుధాన్యాలపై పన్నులొద్దు...
న్యూఢిల్లీ : దేశంలో పప్పుధరలు కొండెక్కనున్నాయా..? అంటే అవుననే సంకేతాలు వచ్చాయి. కొన్ని నెలల్లోనే ఈ ధరల మోత సాధారణ వినియోగదారుడిపై పడనుందని తెలిసింది. దీంతో పప్పు ధాన్యాల ధరలు మండకుండా ఉండేందుకు కేంద్రప్రభుత్వం ఉపశమన చర్యలు ప్రారంభించింది. పప్పుధాన్యాలపై స్థానిక పన్నులు వ్యాట్ లాంటివి వేయొద్దని రాష్ట్రప్రభుత్వాలను కేంద్రప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా పప్పుధాన్యాలను మార్కెట్లోకి విడుదలచేయకుండా అక్రమంగా నిల్వలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పేర్కొంది. అక్రమ నిల్వలను నిరోధించి, సప్లై పెంచి ధరలను అదుపులో ఉంచాలని కేంద్ర ఆహార మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. ప్రస్తుతమున్న 1.5లక్షల టన్నుల పప్పు ధాన్యాల నిల్వలను, 9లక్షల టన్నులకు పెంచాలని నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు. స్థానిక పన్నులను తగ్గించడమే కాకుండా.. రాష్ట్రాలు సొంతంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసుకోవాలని పాశ్వాన్ ఆదేశించారు. దీనివల్ల పెరిగిన ధరల భారం నుంచి వినియోగదారులకు ఉపశమనం కల్పించవచ్చన్నారు. గత రెండేళ్లగా ఏర్పడిన కరువు నేపథ్యంలో పప్పు ధాన్యాల డిమాండ్ - సప్లైలకు అంతరం ఏర్పడిందని, ఉత్పత్తి 170లక్షల టన్నులుంటే, డిమాండ్ 236లక్షల టన్నులున్నట్టు పాశ్వాన్ చెప్పారు. 55లక్షల టన్నుల పప్పులను 2015-16 ఏడాదిలో భారత్ దిగుమతి చేసుకుందని, అయినప్పటికీ ఇంకా 10లక్షల టన్నుల కొరత ఏర్పడిందన్నారు. ఈ కొరతనే ధరల పెరగడానికి దోహదం చేస్తుందని చెప్పారు. ప్రజలకు అందుబాటులోకి తెచ్చే పప్పుధాన్యాల్లో ట్రేడర్స్ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా, పారదర్శకతతో అందించాలని పాశ్వాన్ పేర్కొన్నారు. మార్కెట్లోకి విడుదలయ్యే ఉత్పత్తిని, డిమాండ్ ను, ధరల పెరుగుదలను వెంటవెంటనే అంచనా వేసి, ధర పెరుగుదలను నియంత్రించడానికి కేంద్రప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీల సహాయం తీసుకోనుంది.