rs.2000 note
-
రూ.2వేల నోట్ల మార్పిడి.. బ్యాంక్ ఖాతాదారులకు భారీ ఊరట!
ఈ నెల 19 నుంచి దేశ వ్యాప్తంగా రూ. 2000 వేల నోట్లు ఎక్ఛేంజ్, డిపాజిట్లు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ఆర్బీఐ రూ. 2000 నోట్లను ఉపసంహరణ ప్రకటనతో దేశంలో పలు బ్యాంక్‌లు కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చాయి. బ్యాంకులు సాధారణంగా నెలలో జరిపే ట్రాన్సాక్షన్లు మించి జరిగితే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఆ ఛార్జీలు రూ.2000 నోట్ల డిపాజిట్లు, మార్పిడిపై వర్తిస్తాయని తెలిపాయి. ఈ తరుణంలో కొన్ని బ్యాంకులు మాత్రం ఆ అదనపు ఛార్జీల భారాన్ని కస్టమర్లపై మోపడం లేదని ప్రకటించాయి. దీంతో సదరు బ్యాంకుల్లో రూ.2000 వేల నోట్ల డిపాజిట్లు, ఉపసంహరణ చేసే ఖాతాదారులకు భారీ ఊరట లభించినట్లైంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌లలో రూ.2000 నోట్లను మెషిన్లో డిపాజిట్లు చేయొచ్చు. సీనియర్ సిటిజన్లు ఇతర పద్దతుల్లో బ్యాంక్ సర్వీసుల్ని వినియోగించి డిపాజిట్లు చేసుకోవచ్చని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. కేవైసీ నిబంధనలకు లోబడి బ్యాంక్ ఖాతాదారులు రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి అభ్యంతరాలు లేవని కస్టమర్లకు మెయిల్స్ పంపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు రూ.2వేల నోట్ల ఉపసంహరణ గడువు సెప్టెంబర్ 30,2023 వరకు ఎలాంటి అందనపు ఛార్జీలు విధించబోమని, సేవింగ్ అకౌంట్ ఖాతాదారులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలలో రూ. 2,000 డినామినేషన్ నోట్ల డిపాజిట్లపై నగదు చెల్లింపు ఛార్జీల్ని తొలగిస్తున్నట్లు ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఐడీ కార్డ్‌లను అడగడం లేదని ఏఎన్ఐ ట్వీట్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మెయిల్ ద్వారా తన కస్టమర్లు రూ. 2,000 నోట్లను తమ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాలో సెప్టెంబర్ 30, 2023 వరకు ఏదైనా బ్రాంచ్‌లో జమ చేసుకోవచ్చని తెలియజేసింది. చదవండి👉 రూ 2000 నోటు మార్చుకుంటున్నారా?, సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్న బ్యాంక్‌లు! -
బంగారం కొంటాం.. రూ.2 వేల నోట్లు తీసుకుంటారా?
రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన వెంటనే జువెలరీ షాపులకు ఎంక్వైరీలు వెల్లువెత్తాయి. బంగారం కొనుగోలుకు రూ.2 వేల నోట్లు స్వీకరిస్తారా అని కస్టమర్లు దేశవ్యాప్తంగా పలు జువెలరీ దుకాణాల్లో ఆరా తీస్తున్నారు. అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు అయితే 2016లో నోట్ల రద్దు సమయంలో కనిపించిన ఉధృత పరిస్థితి ఇప్పుడు లేదని జువెలర్స్ బాడీ జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) తెలిపింది. వాస్తవానికి రూ.2 వేల నోట్ల మార్పిడి, కఠిన కేవైసీ నిబంధనల నేపథ్యంలో గత రెండు రోజులుగా బంగారం కొనుగోళ్లు మందగించాయి. 10 శాతం వరకు అధిక ధర! రూ.2 వేల నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో కొంతమంది బంగారు వ్యాపారులు కస్టమర్ల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. బంగారం కొనుగోలు కోసం రూ.2 వేలు నోట్లు ఇచ్చే కస్టమర్ల నుంచి 5 నుంచి 10 శాతం అదనంగా తీసుకున్నట్లు తెలిసింది. 10 గ్రాముల గ్రాముల బంగారాన్ని రూ. 66,000 వరకు అమ్మినట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో బంగారం ధర తులం రూ.60,200 మేర ఉంది. కాగా రూ. 2 లక్షల లోపు బంగారం, వెండి ఆభరణాలు, రత్నాల కొనుగోలు కోసం పాన్, ఆధార్ వంటి డాక్యుమెంట్లను కస్టమర్లు సమర్పిచాల్సిన అవసరం లేదు. ‘రూ. 2,000 నోట్లతో బంగారం లేదా వెండిని కొనుగోలు చేసేందుకు కస్టమర్ల నుంచి జువెలరీ షాపులకు అధిక సంఖ్యలో ఎంక్వైరీలు వచ్చాయి. అయితే కఠినమైన కేవైసీ నిబంధనల కారణంగా వాస్తవ కొనుగోళ్లు తక్కువగా ఉన్నాయి’ అని జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయమ్ మెహ్రా పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు మే 19న ప్రకటించింది. ఆ నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి, బ్యాంకుల్లో మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. మరోవైపు రూ.2000 నోట్ల చలామణిని తక్షణమే నిలిపివేయాలని బ్యాంకులను కోరింది. ఇదీ చదవండి: RS 2000 Note: ముగిసిన రూ.2 వేల నోటు శకం.. ఆరేళ్ల ప్రస్థానం.. -
నకిలీ నోటుతో యాచకుడికి టోకరా
బంజారాహిల్స్ : మహాశివరాత్రి సందర్భంగా శ్రీకృష్ణానగర్ ఏ బ్లాక్‌లోని అభయాంజనేయస్వామి ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్న వృద్ధుడిని ఓ వ్యక్తి నకిలీ రూ.2 వేల నోటు ఇచ్చి మోసం చేశాడు. గుంటూరుకు చెందిన గురవయ్య అనే వృద్ధుడిని అభయాంజనేయ ఆలయం వద్ద శుక్రవారం భిక్షాటన చేస్తున్నాడు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి తన వద్ద రూ.2 వేల నోటు ఉందని, చిల్లర ఇవ్వాలని కోరగా, గురవయ్య అతడికి చిల్లర ఇచ్చాడు. తీరా అతను వెళ్లిపోయాక నోటును పరిశీలించగా అది దొంగనోటుగా తేలింది. దీంతో ఎన్నాళ్ల నుంచో దాచుకున్న డబ్బుపోయేసరికి అతను ఆ నోటును అక్కడే పడేసి ఏడుస్తూ వెళ్లిపోయాడు. -
రూ.2వేల నోటుపై ఆ వీడియోలు నమ్మొద్దు
న్యూఢిల్లీ: రూ.2000 నోటుపై ఇంటర్ నెట్లో హల్ చల్ చేస్తున్న వీడియోలు నిజం కావని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ఓ ప్రకటనలో తెలిపారు. రూ.2వేల నోటును నీటిలో తడుపుతూ ఎలాంటి రంగూ కోల్పోడం లేదని చూపుతున్న వీడియోల్లో నిజం లేదని అన్నారు. అసలైన రూ.2వేల నోటు రంగు కోల్పోతుందని చెప్పారు. నోటును తడిపినా, రుద్దినా దానిపై ఉన్న రంగు పోతుందని పేర్కొన్నారు. నోట్ల తయారీలో ఉపయోగించిన రంగే ఇందుకు కారణమని తెలిపారు. అలా రంగు కోల్పోని నోట్లే నకిలీవని చెప్పారు. మరి నెట్ లో చూపుతున్న వీడియోల మాటేమిటని మీడియా ప్రశ్నించగా.. ఇంటర్ నెట్లో కనిపించే ప్రతి ఒక్కటి నిజం కాదని వాటిని నమ్మొద్దని సమాధానం ఇచ్చారు. యూట్యూబ్ లోని మరికొన్ని వీడియోల్లో రూ.2వేలు నోటును నీటిలో తడిపినప్పుడు రంగు కోల్పోయాయని చెప్పారు. నోట్లను సొంతగా పరీక్షించుకున్న వారు అవి చెల్లవని ఆందోళన చెందొద్దని తెలిపారు. రంగు కోల్పోయిన నోట్లు కూడా చెల్లుతాయని చెప్పారు.