నకిలీ నోటుతో యాచకుడికి టోకరా | fakenote, begger, rs.2000 note, దొంగనోటు, యాచకుడు, రూ.2000 నోటు | Sakshi
Sakshi News home page

నకిలీ నోటుతో యాచకుడికి టోకరా

Published Sat, Feb 25 2017 3:25 PM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

fakenote, begger, rs.2000 note, దొంగనోటు, యాచకుడు, రూ.2000 నోటు

బంజారాహిల్స్‌ : మహాశివరాత్రి సందర్భంగా శ్రీకృష్ణానగర్‌ ఏ బ్లాక్‌లోని అభయాంజనేయస్వామి ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్న వృద్ధుడిని ఓ వ్యక్తి నకిలీ రూ.2 వేల నోటు ఇచ్చి మోసం చేశాడు. గుంటూరుకు చెందిన గురవయ్య అనే వృద్ధుడిని అభయాంజనేయ ఆలయం వద్ద శుక్రవారం భిక్షాటన చేస్తున్నాడు.
 
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి తన వద్ద  రూ.2 వేల నోటు ఉందని, చిల్లర ఇవ్వాలని కోరగా, గురవయ్య అతడికి చిల్లర ఇచ్చాడు. తీరా అతను వెళ్లిపోయాక నోటును పరిశీలించగా అది దొంగనోటుగా తేలింది. దీంతో ఎన్నాళ్ల నుంచో దాచుకున్న డబ్బుపోయేసరికి అతను ఆ నోటును అక్కడే పడేసి ఏడుస్తూ  వెళ్లిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement