begger
-
బాబా మందిరానికి యాచకుడి విరాళం.. రూ. 9.54 లక్షలు అందజేత
సాక్షి, విజయవాడ: సాయిబాబా మందిర అభివృద్ధికి ఓ యాచకుడు శుక్రవారం లక్షరూపాయల విరాళం అందజేశారు. దీంతో ఇప్పటివరకూ ఆయన అందజేసిన విరాళం రూ.9.54 లక్షలకు చేరుకుంది. వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, ముత్యాలంపాడులోని శ్రీ షిర్డీసాయి బాబా మందిరం వద్ద యాదిరెడ్డి అనే వృద్ధుడు యాచకుడిగా జీవనం సాగిస్తున్నారు. భక్తుల నుంచి సేకరించిన సొమ్ముతో లక్షరూపాయలు పోగుచేసి బాబా మందిర అభివృద్ధికి ఇచ్చేలా నిర్ణయించుకుని, ఆ డబ్బును మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి మాట్లాడుతూ... బాబామందిరానికి యాదిరెడ్డి విరాళం ఇవ్వడం ఇది మొదటిసారికాదని, ఇప్పటివరకూ పలు దఫాలుగా రూ.8,54,691 అందజేశారని తెలిపారు. తాజాగా శుక్రవారం అందజేసిన రూ.లక్షతో కలిపి రూ.9,54,691 ఇచ్చినట్లయిందని చెప్పారు. ఈ రకంగా విరాళం అందజేయడం అభినందనీయమన్నారు. దాత యాదిరెడ్డి మాట్లాడుతూ బాబా మందిరం వద్ద యాచించి సంపాదించిన డబ్బు బాబాకే ఇవ్వడం ఆనందంగా ఉందని, ఇకపై తాను సేకరించే ప్రతి పైసా దైవకార్యాలకే వినియోగిస్తానని తెలిపారు. మందిర అధ్యక్షుడు పొన్నలూరి లక్ష్మణరావు, కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి తదితరులు యాదిరెడ్డిని అభినందించారు. అనంతరం యాదిరెడ్డిని బాబావారి శేషవస్త్రంతో గౌతంరెడ్డి సత్కరించారు. చదవండి: బనియన్ల నిండా బంగారం, నగదు -
ఏం తెలివి సామీ.. క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన చేస్తున్న మోడ్రన్ బిక్షగాడు
మనం ప్రతిరోజూ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, దేవాలయాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బిచ్చగాళ్లను చూస్తుంటాం. కొందరు తమకు తోచినంత సాయం చేస్తారు. ఇంకొందరేమో చిల్లర లేదని సింపుల్‌గా చెప్పి తప్పించుకుంటుంటారు. అయితే ఈ బిచ్చగాడి నుంచి మాత్రం మీరు అస్సలు తప్పించుకోలేరు. ఇందుకంటే ఇతను టెక్నాలజీని వాడుకుంటూ చేతిలో క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన చేస్తూ చాలా స్టైల్‌గా అడుక్కుంటున్నాడు. సాధరణంగా యచకులు పాత సంచి లేదా ఏదైనా చిన్న బొచ్చులాంటి పాత్ర పట్టుకొని అడ్డుకోవడం చూశాం. కానీ ఇది డిజిటల్ యుగం కదా. కాలం మారడంతో మనమూ మారాలి అనుకున్నాడేమో ఏకంగా ఇలా క్యూఆర్ కోడ్ ఇచ్చి మరీ దానం చేయమని అడుక్కుంటున్నాడు. ముంబైలోని ఓ రద్దీ లోకల్ ట్రైన్లో కనిపించింది ఈ దృశ్యం. చక్కగా పాటలు పాడుతూ స్టైల్లో క్యూఆర్ కోడ్ ఇచ్చి భిక్షాటన చేయడంతో అక్కడున్నవారంతా నోరెళ్లబెట్టారు. ఓ వ్యక్తి ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ డిజిటల్ భిక్షగాడి తెలివికి నెటిజన్లు షాకవుతున్నారు. మరికొందరేమో ఇన్ని తెలివితేటలు ఉన్నవాడు సొంతంగా ఉద్యోగం చేస్తూ బతకొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. #MumbaiLocal #DigitalIndia That's Mumbai local where you can see the height of using digital payment A beggar is carrying the online payment sticker with him so you have not to bother about excuses of not having change its purely a cashless facility 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/HIxlRJkbmM — 💝🌹💖jaggirmRanbir💖🌹💝 (@jaggirm) June 25, 2023 -
తాగిన మత్తులో చిన్నారిని చెత్తబుట్టలో వేయబోయిన యాచకురాలు
-
పరిమళించిన మానవత్వం..యాచకుడికి ట్రాఫిక్ కానిస్టేబుల్ సపర్యలు
సాక్షి, షాద్‌నగర్: ఆకలితో అలమటిస్తున్న ఓ యాచకుడు రోడ్డు దాటుతూ కిందపడిపోయాడు. వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుల్ సాయం అందించి మానవత్వాన్ని చాటాడు. షాద్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మురళీ శుక్రవారం పట్టణంలోని ముఖ్య కూడలిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో డొక్కలు ఎండిపోయి ఆకలితో అలుమటిస్తూ ఓ యాచకుడు రోడ్డు దాటేందుకు యత్నిస్తూ కింద పడిపోయాడు. చదవండి: టీఎస్ఆర్టీసీ: ప్రభుత్వ పూచీకత్తు లేకుండానే రూ.300 కోట్ల రుణం గమనించిన కానిస్టేబుల్ మురళీ ఆ యాచకుడిని పైకి లేపి పక్కన కూర్చోబెట్టాడు. ఆకలితో ఉన్నానని, కళ్లు తిరుగుతున్నాయని ఆ యాచకుడు సైగలు చేయడంతో వెంటనే కానిస్టేబుల్ యాచకుడికి నీళ్లు తాగించి, పక్కనే ఉన్న పండ్లు కొనిచ్చి ఆకలి తీర్చాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు. మానవత్వాన్ని చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. షాద్‌నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ కానిస్టేబుల్ మురళీకి రివార్డు అందజేశారు. తోటి పోలీస్ సిబ్బంది అతన్ని అభినందించారు. చదవండి: కూకట్‌పల్లిలో వ్యభిచార దందా.. ఓ మహిళను రప్పించి.. -
రూ.కోటి ఎగ్గొట్టి.. బిచ్చగాడిగా మారి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నకిలీ ధృవపత్రాలతో వివిధ బ్యాంకుల నుంచి రూ.కోటికిపైగా రుణాలు పొంది బురిడి కొట్టించాడు.. అడ్డదారులు తొక్కి ఆర్థికంగా చితికిపోయి భిక్షాటన చేసే స్థితి చేరుకు న్నాడు.. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లాడు.. అయితే 15 ఏళ్ల తర్వాత ఆ నిందితుడిని కరీంనగర్ పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. ‘ఆపరేషన్ తలాష్’లో భాగంగా నిందితుడు కుందన శ్రీనివాస్ రావు అలియాస్ శశాంకరావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా ఎన్జీవో కాలనీకి చెందిన శ్రీనివాస్‌రావు 1991లో ఇంజనీరింగ్ పూర్తిచేసి పైవ్రేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశాడు. 2006 నుంచి విలాసవంత మైన జీవితానికి అలవాటు పడి అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు నకిలీ కిసాన్ వికాస పత్రాలు సృష్టించాడు. వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.కోటికి పైగా రుణాలు పొందాడు. కరీంనగర్‌తో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇలాగే మోసా లుచేశాడు. దీంతో బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు వరంగల్, హైదరాబాద్, గుంటూరు, హన్మకొండ, కరీంనగర్ టూటౌన్లో కలిపి మొత్తం 40 కేసులు నమోదయ్యాయి. అలిపిరి మెట్లపై భిక్షాటన.. 2007లో బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో శ్రీనివాసరావును కరీంనగర్ పోలీసులు రిమాండ్‌కు పంపగా, ఏడాదిపాటు కరీంనగర్ జైళ్లోనే ఉన్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్‌కు మకాంమార్చాడు. కూర శశాంకరావు పేరుతో చెలా మణి అవుతూ నకిలీ ఆధార్, పాన్ కార్డులతో తరచూ చిరునామా మారుస్తూ మూడేళ్లు గడిపాడు. వరంగల్‌లో కొంతకాలం మారుపేరుతోనే ఇంజనీ రింగ్ కళాశాలల్లో పనిచేశాడు. తదుపరి కుటుంబం లో వివాదాలు తలెత్తడంతో భార్య అతడిని విడిచి పెట్టింది. వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా అమ్ముకొని విజయవాడకు మకాం మార్చాడు. అక్కడ కొంత కాలం, తిరుపతిలో కొంతకాలం హోటళ్లలో పనిచేశాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో అతని కాలు విరిగిపోయింది. అప్పటి నుండి ఆర్థిక ఇబ్బందులతో జీవితం దుర్భరంగా మారింది. చివరికి అలిపిరి మెట్ల మీద భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. కుటుంబంతో సం బంధాలు కోల్పోయిన శ్రీనివాస్‌రావు కనిపించడం లేదని బెంగుళూర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచే స్తున్న అతని తమ్ముడు శ్రీధర్ 2018లో వరంగల్‌లో ఫిర్యాదు చేశాడు. కొద్దిరోజులకు తిరుపతిలో భిక్షా టన చేస్తున్న శ్రీనివాసరావును నిజామాబాద్ నుంచి వచ్చిన కొందరు గమనించి సమాచారాన్ని అతని సోదరుడు శ్రీధర్‌కు అందించారు. అతను తన అన్నను బెంగుళూర్ తీసుకెళ్లి ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం ఇప్పించాడు. ఫోన్‌కాల్స్ ఆధారంగా.. కరీంనగర్ పోలీసులు ‘ఆపరేషన్ తలాష్’లో భాగంగా శ్రీనివాసరావు ఆచూకీ కోసం వేట ప్రారంభించారు. ఇందులో భాగంగా శ్రీనివాస్ రావును గాలించేందుకు టౌన్ అడిషనల్ డీసీపీ పి.అశోక్ పర్యవేక్షణలో ఏఎస్ఐ సుజాత, కానిస్టేబుల్ కృష్ణ, రమేశ్, సంపత్తో ఓ బృం దాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రత్యేక బృందానికి చెందిన పోలీసులు శ్రీనివాస రావుకు గతంలో జామీను ఇచ్చిన వారిని, తెలి సిన వారిని ఆరా తీశారు. శ్రీనివాసరావు కుటుం బసభ్యుల ఫోన్‌కాల్స్‌పై నిఘా పెట్టారు. అలా బెంగుళూర్లో ఉన్నట్లు నిర్ధారించుకొని ఆచూకీ కనుగొన్నారు. జమ్మికుంట రూరల్ సీఐ సురేశ్, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్చార్జి మురళితో కూడిన బృందం 2 రోజులు బెంగళూర్‌లో గాలించి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కరీంనగర్‌కు తరలించారు. గతంలోని వారెంట్లతోపాటు నకిలీ పాన్‌కార్డు, ఆధార్ కార్డులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక బృందం సభ్యులను సీపీ అభినందించి రివార్డులు అందించారు. -
సంపదలో పేదవాడు.. గుణంలో ధనవంతుడు
మనిషికి మానవత్వానికి విడదీయరాని బంధం ఉంది. అయితే ప్రస్తుతం మనిషి, మనిషికి మధ్య బంధాలు, బంధుత్వాలు తెగిపోతున్నాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా మానవత్వం సన్నగిల్లుతోంది. కానీ మనిషిలోని మంచితనం ఇంకా బతికి ఉందనేందుకు ఈ సంఘటన అద్దంపడుతోంది. అయితే అతడేం ధనవంతుడు కాదు. అయినప్పటికీ తనకున్న దానిలో సాయం చేసి తన దయా గుణాన్ని చాటుకున్నాడు. (అమ్మాయ్.. ఎన్ని మార్కులొచ్చాయ్?) భారత అటవీశాఖ అధికారి సుశాంత్ నందా తన ట్విటర్ ఖాతాలో ఓ సందేశాత్మక వీడియోను పోస్టు చేశారు. 17 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో వృద్ధుడైన ఓ బిచ్చగాడు తింటుండగా.. వీధి కుక్కలు అతని చుట్టూ వచ్చి చేరాయి. దీంతో ఆ వృద్ధుడు తింటున్న ఆహారాన్ని రెండు ప్లేట్లలో వేసి కుక్కలకు తినిపించాడు. ‘సంపదలో పేదవాడు. మనసున్న వ్యక్తిలో ధనవంతుడు’ అని షేర్ చేసిన ఈ వీడియోను పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. అంతేగాక వృద్ధుడు దయతో చేసిన మంచితనాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘ఈ రోజుల్లో మానవ్వతం తగ్గిపోతుంది. ఈ వృద్ధుడు మనిషిలోని మానవత్వాన్ని చాటుకున్నాడు’. అంటూ కామెంట్ చేస్తున్నారు. (సూపర్ హిట్ సాంగ్‌కు డాన్స్ చేసిన వార్నర్ కూతుళ్లు) -
స్పైడర్ మ్యాన్‌ను ఆదుకున్న యాచకుడు
చిన్న పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ల దాకా అందరూ ఇష్టపడే కార్టూన్ స్పైడర్ మ్యాన్ . దీనిపై వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఈలలు కొట్టించాయి. సినిమాలో ఎవరికైనా కష్టం ఉందనగానే స్పైడర్ మ్యాన్ చటుక్కున ప్రత్యక్షమవుతాడు. ఎంతటి సాహసానికైనా పూనుకుని వారిని కాపాడతాడు. అలాంటి స్పైడర్ మ్యాన్‌కు నిజ జీవితంలో ఓసారి కష్టం వచ్చింది. అప్పుడు ఓ యాచకుడు అతన్ని ఆదుకుని గండం నుంచి గట్టెక్కించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. స్పైడర్ మ్యాన్ సినిమాలో హీరోగా నటించిన టామ్ హాలండ్ లండన్‌లో షాపింగ్‌కు వెళ్లాడు. అక్కడ ట్రాలీని తీసుకోడానికి ఒక పౌండ్ (భారత కరెన్సీలో రూ.92) రుసుము ఇవ్వాలి. అయితే ఈ హీరో దగ్గర చిల్లర లేక ఇబ్బందిపడుతున్నాడు. (‘జుమాంజి’ నటికి కరోనా) దీన్ని దూరం నుంచి గమనించిన ఓ యాచకుడు అతనికి ఆ పౌండ్‌ను అందించి సాయపడ్డాడు. అయితే షాపింగ్ అనంతరం టామ్ ఆ భిక్షగాడి దగ్గరకు వెళ్లి అతనిచ్చిన ఒక్క పౌండ్‌ను తిరిగివ్వడమే కాకుండా మరో వంద పౌండ్లను అదనంగా ఇచ్చాడు. ఇది అక్కడే ఉన్న ఓ తల్లీకూతుళ్లను ఆశ్చర్యచకితులను చేసింది. స్పైడర్ మ్యాన్ గొప్ప మనసుతో అతనికి రెట్టింపు సాయం చేయడాన్ని చూసి తమ కళ్లల్లో నీళ్లు తిరిగాయని వారు పేర్కొన్నారు. 23 యేళ్ల టామ్ హాలండ్.. స్పైడర్ మ్యాన్ నటి జెండయాతో డేటింగ్లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. (రుచి...వాసన తెలియడంలేదు) -
ఈ అభాగ్యుడిని పట్టించుకోరూ!
బంజారాహిల్స్: యాచక రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామంటూ వేదికలెక్కిన ప్రతిసారి మైకుల్లో ఉపన్యాసాలు దంచుతుంటారు. ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడంలేదు. బంజారాహిల్స్ రోడ్‌నంబర్– 12లో తెలంగాణకే తలమానికంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ ఎదుట ఓ అభాగ్యుడు తన సంచులతో పాక్కుంటూ వెళ్తున్న దృశ్యం ఇది. అటు నుంచి వెళ్తున్న వారిని కంటనీరు పెట్టించింది. తెలంగాణ భవన్ సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. యాచకులకు పునరావాసం కల్పిస్తున్నట్లు ఒక వైపు జీహెచ్ఎంసీ పేర్కొంటుండగా ఎక్కడ చూసినా యాచకులు కనిపిస్తూనే ఉన్నారు. ఈ అభాగ్యుడు గత రెండు వారాల నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులపైన ఇలా నేలపై రెండు చేతులతో పాక్కుంటూ ముందుకు సాగుతున్నాడు. తన వివరాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి తెలంగాణ భవన్ రోడ్డులో పాక్కుంటూ వెళ్తున్న ఈ దీనుడిని పునరావాస కేంద్రంలో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నెలమంగలలో వింత బిచ్చగాడు..
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ఏంటీ డబ్బులు ఇవ్వవా... అయితే బండెలా కదులుతుందో చూస్తా...నన్ను దాటుకుని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేవు తెలుసా... ఇది ఏ రౌడీనో, ట్రాఫిక్ పోలీసో చేసిన హెచ్చరికలు కావు...నెలమంగలలో ఒక బిచ్చగాడు చేస్తున్న హంగామా ఇది. నెలమంగల పట్టణంలో కేఈబీ ఆంజనేయ స్వామి దేవాలయం రోడ్డులో గత కొన్ని రోజులుగా తాగుబోతు కం బిచ్చగాడు అయిన ఒక వ్యక్తి కార్లకు, ఇతర వాహనాలకు అడ్డంపడి డబ్బులు డిమాండు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వనిదే వాహనం కదలడానికి వీల్లేదని రోడ్డుమీదే అడ్డంగా పడుకుంటున్నాడు. కొందరు ఎందుకొచ్చిన గొడవ అని డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. అయితే రోజూ అదే రోడ్డులో తిరిగే వాహనదారులకు ఈ వ్యక్తి పెద్ద సమస్యగా మారాడు. కార్లలో వచ్చేవారు మినిమమ్ వంద రూపాయలు ఇవ్వాలని పట్టుబడతాడు. చిల్లర ముట్టుకోవడం లేదు. గంజాయి, వైట్నర్ తీసుకోవడం వల్ల ఈ వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఏదైనా అఘాయిత్యానికి పాల్పడక ముందే ఆ వ్యక్తిని పట్టుకుని ఏదైనా ఆశ్రమానికి తరలించాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. -
భిక్షగాడి పేరిట ఆరు ఎకరాలు
చిత్తూరు, పెద్దతిప్పసముద్రం: భవతీ బిక్షాందేహీ అంటూ కావిడి.. పట్టుకుని ఇల్లిల్లూ తిరిగి భిక్షాటన చేస్తున్న ఆ వృద్ధుడి పేరు వడ్డి పెద్దన్న (76). పెద్దతిప్పసముద్రం మండలం పట్టెంవాండ్లపల్లెకి చెందిన ఈయనకు వెనకా, ముందూ నా అనే వారు ఎవరూ లేరు. తల దాచుకునేందుకు ఇల్లు కూడా లేకపోవడంతో నాలుగిళ్లు తిరిగి గ్రామస్తుల దయా దాక్షిణ్యాలతో పొట్ట నింపుకుని ఇదే గ్రామంలో మూతబడిన ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తల దాచుకుంటున్నాడు. ఇతని పేరిట 237512162539 నంబర్ ఆధార్ కార్డులో 76 ఏళ్ల వయసు ఉంది. రేషన్ కార్డులో కూడా 70 ఏళ్ల వయసు ఉన్నట్లు పేర్కొన్నారు. కొన్నేళ్ల పాటు ఇతని కార్డు ఇన్ యాక్టివేషన్ అని రావడంతో సరుకులు పొందలేకపోయినా పలువురి సాయంతో కొద్ది నెలలుగా సరుకులు పొందుతున్నాడు. అయితే ఈ అనాథకు ఇంత వరకు వృద్ధాప్య పింఛన్ మాత్రం మంజూరు కాలేదు. జన్మభూమి–మాఊరుతో పాటు వివిధ గ్రామసభల్లో అర్జీలు ఇచ్చినా ఎవరూ కనికరించలేదు. పింఛన్ ఎందుకు మంజూరు కాలేదం టూ వృద్ధుడు అధికారులను ప్రశ్నిస్తే మీ పేరిట ఆరు ఎకరాల భూమి ఉన్నట్లు ఆన్లైన్లో వచ్చిందని చెప్పడంతో అవాక్కయ్యాడు. తన పేరిట ఎలాంటి భూములు లేకున్నా ఆన్లైన్లో ఎలా నమోదు చేశారో తనకు తెలియదని ఆయన వాపోతున్నాడు. తనకు పింఛన్ రాకున్నా పరవాలేదు, ఆరు ఎకరాల భూమి ఎక్కడ ఉందో చూపించి పట్టా ఇస్తే కౌలుకైనా ఇచ్చుకుని కాలం గడుపుతానని పెద్దన్న అధికారులకు విన్నవిస్తున్నాడు. అయితే పింఛన్ పొందేందుకు పెద్దన్నకు అర్హత ఉన్నా రెవెన్యూ రికార్డుల్లో భూమి ఐదు ఎకరాల కన్నా అధికంగా ఉన్నట్లు నమోదై ఉండడంతో తామేమీ చేయలేక పోతున్నామని ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలిపారు. -
తమిళనాట కరోడ్‌పతి..యూపీలో బెగ్గర్
సాక్షి,న్యూఢిల్లీ: ఆధార్ కార్డుపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుంటే అదే ఆధార్ ద్వారా తమిళనాడులో కోటీశ్వరుడైన ఓ వ్యక్తి యూపీలో యాచకుడిగా దీనస్థితిలో ఉన్న విషయం వెల్లడైంది.యూపీలోని రాయ్‌బరేలి జిల్లా రాల్పూర్ పట్టణంలో వృద్ధుడి వద్ద ఆధార్ కార్డు, కోటి రూపాయల పైన ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలున్నట్టు కనుగొన్నారు. స్వామి భాస్కర్ స్వరూప్‌జీ ఆశ్రమ పాఠశాల వద్ద యాచకుడిగా తిరుగుతున్న వ్యక్తిని స్వామి చేరదీసిన క్రమంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. యాచకుడికి స్నానం చేయిస్తుండగా ఆయన దుస్తుల్లో ఆధార్ కార్డు, రూ కోటికి పైగా ఎఫ్డీ పత్రాలు లభించాయి. ఆధార్‌లో పొందుపరిచిన వివరాలతో ఆరా తీయగా ఆ యాచకుడు తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన సంపన్న వ్యాపారవేత్త ముత్తయ్యనాడార్‌గా తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు.తండ్రిని తీసుకునివెళ్లేందుకు తమిళనాడు నుంచి ఆయన కుమార్తె గీత రాల్పూర్‌కు వచ్చారు. తన తండ్రికి ఆశ్రయమిచ్చిన స్వామీజీకి, ఆశ్రమ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఓ రైలు ప్రయాణంలో తప్పిపోయిన తమ తండ్రి కోసం ఆరు నెలలుగా గాలిస్తున్నామని ఆమె చెప్పారు. తమ తండ్రికి బలవంతంగా మత్తుపదార్ధాలు ఎక్కించడంతో ఆయన దారితప్పి ఉంటారని భావిస్తున్నామన్నారు. -
అమ్మకోసం.. బిచ్చగాడిగా మారిన బాలుడు.!
ప్రాణం పోసే వైద్యులను కనిపించే దేవుళ్లని చెబుతారు. అలా వృత్తికి అంకితమై గొప్ప పేరుతెచ్చుకున్న డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. కానీ వైద్యాన్ని కార్పొరేట్ కల్చర్ ఆవహించిన తర్వాత చాలామంది డబ్బు సంపాందించేందుకే డాక్టర్లవుతున్నారు. డబ్బు కట్టకపోతే మధ్యలో చికిత్సను కూడా ఆపేస్తున్నారు. ఇలాంటి వైద్యుల నిర్వాకమే.. ఓ పదేళ్ల బాలుణ్ని అడుక్కునే దయనీయ స్థితికి తీసుకొచ్చింది. వివరాల్లోకెళ్తే... సాక్షి, స్కూల్ ఎడిషన్: కళ్లు తెరవని పసికందు కూడా అమ్మకోసం పరితపిస్తుంది. అమ్మ ఒడికి దూరమైతే అల్లాడిపోతుంది. అది అమ్మతనం గొప్పదనం. అలాంటి ఓ తల్లిని బతికించుకునేందుకు పదేళ్లు కూడా నిండని ఓ బాలుడు వీధుల్లో తిరుగుతూ బిచ్చమడుక్కున్నాడు. ఈ దౌర్భాగ్యస్థితికి కారణం వైద్యులేనన్న విషయం తర్వాత వెలుగుచూసింది. ‘డబ్బు తీసుకొచ్చే వరకు మీ అమ్మకు ట్రీట్మెంట్ చేయబోమ’ని డాక్టర్లు చెప్పడంతో చేసేదిలేక చేతులు చాచాడు. ఈ ఘటన బిహార్‌లోని పట్నాలో చోటుచేసుకుంది. బిల్లు చూసి... ఆరోగ్యం బాగాలేకపోవడంతో పదేళ్ల కొడుకు కుందన్‌ను వెంటబెట్టుకొని బిహార్‌లోని మాధేపురా జిల్లాలో ప్రైవేటు నర్సింగ్‌హోం వెళ్లింది ఓ తల్లి. రకరకాల పరీక్షలు చేసి, చిన్నపాటి ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్లు. ఐదువేలో.. పదివేలో అవుతుందనుకొని సరేనన్నారు. తీరా ఆపరేషన్ అయ్యాక రూ.70వేల బిల్లు చేతిలో పెట్టారు. దానిని చూసిన తల్లీకొడుకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తమవద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో.. ఇంకా ట్రీట్మెంట్ మిగిలే ఉందని, మధ్యలో ఆపేస్తామని, ఏం చేసైనా డబ్బులు తెమ్మని చెప్పారు. బిల్లు చెల్లించేదాకా డిశ్చార్జ్ చేసేది లేదని చెప్పారు. శస్త్రచికిత్స తర్వాత వేసిన కుట్లను ఊడదీయకుండా అలాగే ఉంచేశారు. వైద్యమూ నిలిపివేశారు. సొంతూరికెళ్లి.. యాజమాన్యం వేసిన భారీ బిల్లును చెల్లించలేక...సాయం చేసే వారెవరూ కానరాక... ఆమె పదేళ్ల కుమారుడు కుందన్ చివరకు మధేపురాజిల్లాలోని తన సొంతూరికి వెళ్లాడు. ‘అమ్మ ఆసుపత్రి బిల్లు చెల్లించాలి.. సాయం చేయండ’ంటూ వీధివిధి తిరిగాడు. చివరకు విషయం మాధేపురా ఎంపీకి తెలియడంతో... హుటాహుటిన ఆయన నర్సింగ్‌హోంకు వెళ్లి, తల్లిని డిశ్చార్జ్ చేయించాడు. -
‘బిచ్చమెత్తుకోవటం భలే బాగుంది’
సాక్షి, చెన్నై: ‘దర్జాగా తిరిగితే సరదా ఏముంది...బిక్షమెత్తుకోవడంలోనే మజా ఉంది’ అని భావిస్తున్నాడు రష్యాకు చెందిన ఒక పర్యాటకుడు. ఖర్చుకు కనీస డబ్బులు లేని స్థితిలో బిక్షమెత్తుకుంటున్న అతడికి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్నేహహస్తం అందించినా నిరాకరించి చెన్నైలో బిక్షమెత్తుకుంటా అంటూ నగరంలో తిరుగుతున్నాడు. వివరాలివీ.. రష్యా దేశానికి చెందిన ఈవ్జెనీ బేర్టినీ కోవ్ అనే వ్యక్తి ఈనెల 9వ తేదీన కాంచీపురం పర్యాటనకు వచ్చాడు. ఖర్చుల కోసం ఏటీఎం వద్దకు వెళ్లగా అతని కార్డు నుంచి సొమ్మురాలేదు. దీంతో విరక్తి చెందిన అతను ఎటీఎం కార్డును విరగొట్టాడు. ఖర్చులకు మరో మార్గం లేకపోవడంతో కాంచీపురంలోని ఒక ఆలయం మెట్ల వద్ద తన టోపీని జోలెగా పడుతూ ఈనెల 10వ తేదీన బిచ్చమెత్తుతూ కూర్చున్నాడు. అదే ఆలయం వద్దనున్న బిచ్చగాళ్లు తమ వరుసలో ఎర్రగా బుర్రగా ఉన్న రష్యా బిక్షగాడిని చూసి ఎంతో మర్యాదగా వ్యవహరించసాగారు. ఆలయానికి వచ్చిన భక్తులు సైతం అయ్యో పాపం అంటూ దండిగా డబ్బులు వేయడం ప్రారంభించారు. ఇంతలో ఈ సమాచారం పోలీసులకు అందడంతో అతడికి కౌన్సెలింగ్ చేసి చెన్నైలో రష్యా రాయబార కార్యాలయానికి కబురంపారు. పోలీసుల సహకారంతో చెన్నైకి చేరుకున్న కోవ్, టీ నగర్ పరిసరాలు తిరిగి, అక్కడి ఆలయంలో స్వామిని దర్శించుకున్నాడు. తనను పలుకరించిన వారితో అతను మాట్లాడుతూ, రష్యా–ఉగ్రెయిన్ మధ్య సైనికపోరు కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఈ కారణంగా తాను పర్యాటక వీసాలో భారత్‌కు చేరుకున్నట్లు తెలిపాడు. భారత్‌కు వచ్చిన సమయంలో తన వద్ద కేవలం రూ.4 వేలు మాత్రమే ఉన్నాయని, ఈ డబ్బు కూడా ఖర్చయిపోవడంతో దిక్కుతోచక కాంచీపురంలో బిక్షమెత్తినట్లు తెలిపాడు. ఈ విషయం పత్రికల్లో రావడంతో కొందరు డబ్బు సహాయం చేశారని చెప్పాడు. రష్యాకు ఎప్పుడెళతావు అని ప్రశ్నించగా, చెన్నైలోనే ఉంటూ బిచ్చమెత్తుకుంటాను, ఇదే బాగుందని తెలిపాడు. ఈ విషయంపై రష్యా రాయబార కార్యాలయంలో వివరణ కోరగా, నిబంధనల ప్రకారం ఎవరైనా సాయం కోరినప్పుడే తాము స్పందించాలని, అతని నుంచి ఎటువంటి అభ్యర్దన రాలేదని తెలిపారు. రష్యా పర్యాటకుని భారత్ వీసా నవంబరు 22వ తేదీతో ముగియనుంది. రష్యా యువకుడు బిక్షమెత్తుకుంటున్న సమాచారం తెలుసుకున్న భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్ ద్వారా స్పందించిన విషయం తెలిసిందే. ‘ఈవ్ జెనీ..మీ రష్యా మాకు మిత్రదేశం, చెన్నైలోని విదేశాంగశాఖ అధికారులు నీకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నారు’ అని తన ట్విటర్ ద్వారా ఈనెల 11వ తేదీన సందేశం పంపారు. అయితే సుష్మాస్వరాజ్ సహకారంపై రష్యా యువకుడు స్పందించిన దాఖలాలు లేవు. -
ఏటీఎం కార్డు లాక్ కావటంతో.. బిచ్చగాడిగా..
సాక్షి, చెన్నై: భారతదేశంలో పర్యటించటానికి వచ్చిన రష్యా యువకుడు విధి వక్రించి బిచ్చగాడిగా మారాడు. అధికారులు అతడి విషయం తెలుసుకుని రష్యా రాయబార కార్యాలయం అధికారులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన బెర్నకోల్(25) భారత దేశంలోని ఆలయాలను చూడడానికి సెప్టెంబర్ 8న భారత్‌కు వచ్చాడు. రైలులో సోమవారం రాత్రి 8.15 గంటలకు కాంచీపురం చేరుకున్నాడు. చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు కావడంతో మనీ తీయడానికి ఏటీఎంలో ప్రయత్నించాడు. ఏటీఎం పాస్వర్డ్ తప్పుగా ఎంటర్ చేయడంతో కార్డు లాక్ అయిపోయింది. చేతిలో పైసా లేకపోవడంతో విరక్తి చెందిన అతడు కార్డును విరిచేశాడు. డబ్బు కోసం ఏం చేయాలో తెలియక రాత్రంతా కాంచీపురంలోని వీధుల వెంట తిరిగాడు. మంగళవారం ఉదయం కుమరకోట్టం ప్రాంతంలో గల మురుగన్ ఆలయం పరిసరాల్లో భిక్షమెత్తుకోవటం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకుని శివకంచి పోలీసులు అతడిని మంగళవారం రైలులో చెన్నైకు తీసుకు వచ్చి దౌత్య కార్యాలయ అధికారులకు అప్పగించారు. -
యాచకుడి అనుమానాస్పద మృతి
ధర్మవరం అర్బన్ : పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో ఓ యాచకుడు (75) ఆదివారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. తలకు రాయితో కొట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతుడి వివరాలు పూర్తిగా తెలియరాలేదు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పోలీసుల అదుపులో గంజాయి విక్రేత
ధర్మవరం అర్బన్ : ధర్మవరం రైల్వేస్టేషన్ వద్ద గంజాయి విక్రయిస్తున్న యాచకుడిని పట్టణ పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. యాచకుడి నుంచి అర కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రైల్వేస్టేషన్లో ఉండే యాచకుడు గంజాయిని తీసుకొచ్చి పట్టణంలో నివసిస్తున్న కలకత్తా వారికి విక్రయించేవాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పట్టణ పోలీసులు శుక్రవారం రాత్రి గంజాయి విక్రయిస్తున్న యాచకుడిని పట్టుకుని అతడి వద్దనుంచి అర కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గంజాయి విలువ రూ.లక్ష వరకు ఉంటుందని పోలీసుల ద్వారా తెలిసింది. శనివారం గంజాయి విక్రయిస్తున్న యాచకుడిని అరెస్టు చూపనున్నారు. -
నకిలీ నోటుతో యాచకుడికి టోకరా
బంజారాహిల్స్ : మహాశివరాత్రి సందర్భంగా శ్రీకృష్ణానగర్ ఏ బ్లాక్‌లోని అభయాంజనేయస్వామి ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్న వృద్ధుడిని ఓ వ్యక్తి నకిలీ రూ.2 వేల నోటు ఇచ్చి మోసం చేశాడు. గుంటూరుకు చెందిన గురవయ్య అనే వృద్ధుడిని అభయాంజనేయ ఆలయం వద్ద శుక్రవారం భిక్షాటన చేస్తున్నాడు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి తన వద్ద రూ.2 వేల నోటు ఉందని, చిల్లర ఇవ్వాలని కోరగా, గురవయ్య అతడికి చిల్లర ఇచ్చాడు. తీరా అతను వెళ్లిపోయాక నోటును పరిశీలించగా అది దొంగనోటుగా తేలింది. దీంతో ఎన్నాళ్ల నుంచో దాచుకున్న డబ్బుపోయేసరికి అతను ఆ నోటును అక్కడే పడేసి ఏడుస్తూ వెళ్లిపోయాడు. -
దొంగతనానికి వచ్చి భిక్షగాడిని చంపారు
ఉదయగిరి(నెల్లూరు జిల్లా): బంకులో దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగలు అక్కడ నిద్రపోతున్న భిక్షగాడిని హతమార్చిన సంఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మంగళవారం వేకువజామున జరిగింది. ఉదయగిరి బైపాస్‌రోడ్డులో ఒక చిన్న బంకు ఉంది. అక్కడ కిరాణా సరుకులు విక్రయిస్తుంటారు. ఆ ప్రాంతంలో భిక్షమెత్తుకుని జీవించే నరసింహ అనే వ్యక్తి రోజూ రాత్రిపూట బంకు పక్కనున్న పాకలో నిద్రించేవాడు. మంగళవారం వేకువజామున బంకులో దొంగతన చేసేందుకు వచ్చిన దొంగలు నర్సింహ మేల్కోవడంతో అతని తలపై బాది హతమార్చి బంకులోని సరుకులు తీసుకెళ్లారు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఉదయగిరి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
బిచ్చగాడు కేంబ్రిడ్జ్ పట్టభద్రుడయ్యాడు!
‘సెల్ఫ్‌ట్రస్టు’ ప్రోత్సాహంతో తెలుగు యువకుడి విజయం కేకే.నగర్: కరువు కాటేస్తే.. బతుకు పయనం అతడిని భిక్షగాడిగా మార్చింది. చెన్నై రోడ్లమీద తల్లితో కలసి యాచనలో ఉన్న పసివాడిని చూసి ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల హృదయం చలించింది. తామున్నామంటూ అక్కున చేర్చుకుని చేయూత నందించింది. విఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి పట్టా తీసుకునే స్థాయికి చేర్చింది. నెల్లూరు నుంచి చెన్నై వలస వెళ్లిన ఓ రైతు కుటుంబానికి చెందిన యువకుడి గాథ ఇది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఏర్పడిన కరువు రక్కసితో ఉన్న ఊరు వదలి బతుకుదెరువు కోసం అనేక రైతు కుటుంబాలు చెన్నపట్నంను ఆశ్రయించాయి. నాటి పరిస్థితుల్లో చెన్నై బతుకు భారం కావడంతో భిక్షాటన సాగించి కడుపు నింపుకున్న కుటుంబాలు ఉన్నాయి. వాటిలో నెల్లూరుకు చెందిన జయవేలు కుటుంబం ఒకటి. కడుపు నింపుకునేందుకు నగరంలోని ముఖ్య కూడళ్లలో తల్లితో కలసి ఈ పసివాడు యాచన చేస్తుండడం ఓ దంపతుల కంట పడింది. భిక్షాటనతో వచ్చిన మొత్తాన్ని తల్లి మద్యం తాగేందుకు వాడుకోవడంతో ఆ పసివాడు కన్నీళ్ల పర్యంతం అవుతుండడం వారి హృదయాన్ని కదిలించింది. ఆ దంపతులే చెన్నైకు చెందిన ఉమ, ముత్తురామన్. భిక్షగాళ్ల జీవితంపై డాక్యుమెంటరీ తీయడానికి వచ్చిన ఆ దంపతులు తాము నడుపుతున్న ‘సెల్ఫ్‌ట్రస్టు’ ద్వారా 1999లో జయవేలును దత్తత తీసుకుని పాఠశాలలో చేర్పించి చదివించారు. చెన్నైలోనే ప్లస్‌టూ వరకు చదువుకున్నాడు. తర్వాత ప్రఖ్యాత కేంబ్రిడ్‌జ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడం.. అక్కడ చదువు పూర్తి చేసుకొని పట్టభద్రుడు కావడం జరిగిపోయాయి. ప్రస్తుతం విదేశాల్లోని ఓ వర్సిటీలో మరో ఉన్నత విద్యను పూర్తి చేసే పనిలో జయవేలు ఉన్నాడు. ఈ విషయం ఓ తమిళ మీడి యా వెలుగులోకి వచ్చింది. -
ఢిల్లీని 'బెగ్గర్ ఫ్రీ' నగరంగా చేస్తాం..
న్యూఢిల్లీః దేశ రాజధాని నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం నడుం బిగించింది. జూలై నెలాఖరుకల్లా యాచకులకు ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేసి, వారికి పునరావాసాన్ని కల్పించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కొత్త ప్రణాళికను రచించి, ప్రారంభించేందుకు వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ ప్రాంతంలో 75,000 మంది వరకూ బిచ్చగాళ్ళు ఉన్నట్లు గుర్తించిన ఆ శాఖ... వారిని అక్కడినుంచి తరలించి రాజధాని గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసే పనిలో పడింది. ఢిల్లీ అభివృద్ధికి ఆమ్ ఆద్మీపార్టీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ మరో అడుగు ముందుకేసింది. రాజధాని నగరంలో యాచకులు లేకుండా చేసి, ఢిల్లీ గౌరవాన్నికీర్తి పాతకన నిలిపే ప్రయత్నం చేస్తోంది. ఆప్ చేపట్టిన ప్రస్తుత ప్రాజెక్ట్ లో భాగంగా జూలై నెలఖారుకల్లా రాజధాని నగరంలో ఉన్న సుమారు 75000 మంది యాచకులను అక్కడినుంచీ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న బిచ్చగాళ్ళలో 40 శాతం మంది మహిళలు కూడ ఉన్నట్లు గుర్తించిన శాఖ.. వారికి పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ప్రణాళికలు పూర్తి చేశామని, ఈ నెల్లోనే వీధుల్లో ఉండే బిచ్చగాళ్ళనందరినీ తరలిస్తామని ఆశాఖ అధికారులు చెప్తున్నారు. ఢిల్లీ గౌరవాన్ని మరింత పెంచేందుకు ఆప్ ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అధికారులు చెప్తున్నారు. టూరిజం అభివృద్ధి చెందుతున్ననేపథ్యంలో నగరానికి వస్తున్న అనేకమంది విదేశీయులకు బిచ్చగాళ్ళ బెడద పెరుగుతున్నతరుణంలో ఈ ప్రత్యేక డ్రైవ్ పై దృష్టి సారించినట్లు ఓ సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు. కార్యక్రమంలోని మొదటి ఫేజ్ లో భాగంగా న్యూఢిల్లీ నియోజకవర్గంలో ప్రచారం చేపట్టనున్నట్లు అధికారులు చెప్తున్నారు. కెన్నాట్ ప్లేస్ నుంచి ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సందీప్ కుమార్ ప్రారంభిస్తారు. ఏడు బృందాలుగా ఏర్పడిన ఢిల్లీ పోలీసులు నగరంలోని యాచకులను వారికి కేటాయించి షెల్టర్లకు తరలించే కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. ప్రణాళికలను అమలు చేయడంలో భాగంగా నగరంలోని బిచ్చగాళ్ళను తొలగించే ముందు వారిని మొబైల్ కోర్టుల్లో విచారించనున్నట్లు తెలిపారు. ఢిల్లీని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చాలన్న నేపథ్యంలో 2009 కామన్ వెల్గ్ గేమ్స్ కు ముందు కూడ యాచకులను విచారించేందుకు ప్రభుత్వం రెండు మొబైల్ కోర్ట్ లను ప్రవేశ పెట్టింది. కాగా ప్రస్తుత డ్రైవ్ లో భాగంగా ఇప్పటికే సుమారు 25 మొబైల్ వ్యాన్లు ఢిల్లీలోని బిచ్చగాళ్ళను గుర్తించే పనిలో పడ్డాయని, ఈ వ్యాన్లలో తెచ్చిన బిచ్చగాళ్ళందరినీ కింగ్స్ వే మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు. అనంతరం అక్కడినుంచీ వారికి కేటాయించిన హోమ్ లకు తరలిస్తారు. ప్రస్తుతం 3000 మంది పట్టే 11 బెగ్గర్ హోం లు ఢిల్లీలో అందుబాటులో ఉన్నాయి. కాగా ఢిల్లీలోని 75000 మంది యాచకుల్లో 30 శాతం మంది 18 ఏళ్ళ లోపు వారు, 40 శాతం మహిళలు ఉన్నట్లు సాంఘిక సంక్షమ శాఖ లెక్కల ప్రకారం తెలుస్తోంది. -
నిరూపించడానికి ప్యాంటు విప్పాడు!
బీజింగ్: పైకి కనిపించేవన్నీ నిజాలు కావు. పైపై నటనలను చూసి మోసపోవద్దని చెబుతుంటారు. అయితే నిజం తెలిసేదెలా. చైనాలో బిచ్చగాడు చేస్తున్న మోసాన్ని తెలిపేందుకు ఓ వ్యక్తి పెద్ద సాహసమే చేశాడు. నడిరోడ్డుపై అతడి ప్యాంటు విప్పి నిల్చోబెట్టాడు. ఇంతకీ ప్యాంటులో ఉన్న నిజం ఏమిటంటారా. కొంతమంది వ్యక్తులు తమ శరీరంలోని కొన్ని భాగాలు సక్రమంగా పనిచేయకపోయినా ఆత్మవిశ్వాసంతో జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడం చూస్తూనే ఉంటాం. మరికొందరు మాత్రం అన్నీ సక్రమంగా ఉన్నా అడ్డదారిలో బ్రతుకుంతుంటారు. ఈ రెండోరకానికి చెందిన బిచ్చగాడి బండారాన్ని ఓ వ్యక్తి బయటపెట్టాడు. చక్రాల బండిపై బోర్లాపడుకొని కాళ్లులేని వాడిగా నటిస్తూ బిక్షాటన చేస్తున్న వ్యక్తిని.. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి ఎలా కనిపెట్టాడో తెలియదు కానీ అతడికి కాళ్లు ఉన్నాయని కనిపెట్టాడు. అంతే.. ఒక్కసారిగా అతడి వద్దకు వెళ్లి అతడి ప్యాంటు విప్పాడు. లోదుస్తుల్లో రెండు కాళ్లను కట్టేసుకొని.. కాళ్లు లేనివాడిగా నటిస్తున్న బిచ్చగాడు బిక్కమొహంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
రైల్లోంచి పడిన తల్లీకొడుకులు
♦ తల్లి మృతి, క్షేమంగా బయటపడిన కుమారుడు.. ♦ మృతురాలు యాచకరాలిగా గుర్తింపు తాండూరు రూరల్ : కదులుతున్న రైల్లోంచి ప్రమాదవశాత్తు తల్లి, కొడుకు కిందపడ్డారు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కొడుకు క్షేమంగా బయటపడ్డాడు. ఈ సంఘటన రుక్మాపూర్ - ధారూర్ రైల్వే స్టేషన్ మధ్యలో మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ రాజు కథనం మేరకు.. రైల్లో భిక్షాటన చేసే ఓ మహిళ (27), తన ఏడాదిన్న వయస్సున్న కుమారుడితో కలిసి ప్రతి రోజూ తాండూరు - హైదరాబాద్ మధ్య నడిచే రైళ్లలో భిక్షాటన చేసేది. మంగళవారం కూడా ఆమె ఓ రైలు ఎక్కింది. అయితే సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదవశాత్తు రుక్మాపూర్ - ధారూర్ మధ్య కేఎం నంబ ర్ 84 వద్ద ప్రమాదవశాత్తు రైల్లోం చి తల్లి, కొడుకులు కిందపడ్డారు. తల్లి అక్కడిక్కడే మృతి చెందగా, కొడుకు క్షేమంగా బయటపడ్డాడు. విషయం తె లుసుకున్న రైల్వే పోలీసులు తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాం డూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాలుడిని శిశుగృహానికి తరలించారు. రైల్వే స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు రాజు తెలిపారు. మృతిచెందిన యాచకురాలు చందానగర్ వాసిగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
బెగ్గర్ ఆడి కారులో వెళుతూ.. 'ఫేస్‌బుక్క'య్యాడు
లండన్: ఇంగ్లండ్‌లో 35 ఏళ్ల మాథ్యూ బ్రింటన్ అంటే ఇప్పుడు తెలియని వాళ్లు లేరు. అతనేమి రాజకీయ నాయకుడు కాదు, వ్యాపారవేత్త కాదు. సెలబ్రిటీ అంతకన్నా కాదు. న్యూక్వేలోని బ్యాంక్ స్ట్రీట్‌లో అడుక్కునే బిచ్చగాడు. భిక్షాటన ముగించుకొని 50 లక్షల రూపాయలు విలువచేసే ఆడి స్పోర్ట్స్ కారులో ఇంటికి బయల్దేరుతున్నప్పుడు ఎవరో ఫొటో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అత్యంత ఖరీదైన బిచ్చగాడుగా ఇప్పుడు అందరికి తెలిసి పోయింది. ఫేస్బుక్ పోస్ట్‌తో అతని బతుకు బస్టాండ్ అయింది. పబ్లిక్ కార్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన అతని ఆడి కారును ఎవరో దొంగలెత్తుకు పోయారు. ఇప్పుడు ఎవరూ అతనికి బిచ్చం వేయడం లేదు. చూడగానే అసహ్యించుకుంటున్నారు. ఇల్లు, కారు పెట్టుకొని అడుక్కుతింటున్నావా అంటూ నానా బూతులు తిడుతున్నారు. ఫేస్బుక్లో వ్యతిరేకంగా కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి. ఇంతకాలం ప్రజల్ని మోసం చేసినందుకు చంపెస్తామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయి. బెదిరింపులు వస్తున్న మాట నిజమేనని, జాగ్రత్తగా ఉండాల్సిందిగా బ్రింటన్ను హెచ్చరించామని న్యూక్వే పోలీసు ఉన్నతాధికారి డేవ్ మెరిడిత్ మీడియాతో వ్యాఖ్యానించారు. అతన్ని ఎన్నో ఏళ్లుగా బ్యాంక్ స్ట్రీట్‌లో అడుక్కోవడం చూశానని, తాను పెద్దగా సహాయం చేయలేక పోయాయని మరో పోలీసు అధికారి తెలిపారు. తాను అడుక్కున్న సొమ్ముతో ఖరీదైన కారు కొనుక్కోలేదని, అడుక్కోవడం వల్ల అంత సొమ్ము తనకెప్పుడూ రాలేదని, తన తాత గిఫ్టు కింద ఆ కారు ఇచ్చి వెళ్లారని బ్రింటన్ వాపోతున్నాడు. ఫేస్బుక్ ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదని, అది చూసే డివైస్ కూడా తన వద్ద లేదని, ఇప్పుడు అదే ఫేస్బుక్ తన కొంప ముంచిందని బ్రింటన్ బావురుమంటున్నాడు. కాయకష్టం చేసుకొని బతికేంత ఆరోగ్యంగా అతను ఉండడంతోపాటు అతను పెంచుకుంటున్న కుక్క కూడా అంతే ఆరోగ్యంగా ఉంది. ఫేస్బుక్లో అతనికి అనుకూలంగా కూడా కొన్ని కామెంట్లు వచ్చాయి. ఎందుకతన్ని ఆడిపోసుకుంటారు. కుక్కను బాగానే చూసుకుంటున్నాడు కదా!....ఒకరి గురించి జడ్జ్ చేయడానికి మనం ఎవరం...అంటూ కామెంట్లు వచ్చాయి. -
సెల్లు వచ్చే.. పని సులువాయే..
కాలం మారిపోయింది.. సెల్‌ఫోన్ దేహంలో భాగమైపోయింది.. ఫోన్ లేనిదే పొద్దు పోవడంలేదు.. అత్యవసర పనుల నుంచి.. సరదా కబుర్లకు కూడా సెల్ ఉండాల్సిందే..! నాలుగు వీధులు తిరిగి చిత్తుకాగితాలు ఏరుకునేవారు సైతం సెల్ఫోన్లోనే పనులు చక్కబెడుతున్నారు. కోఠి ప్రాంతంలో వీధుల్లో చెత్త ఏరుకునే మహిళ ఇలా సెల్లో మాట్లాడుతూ వెళుతోంది. -
బిక్షాటన చేస్తోన్న కోటీశ్వరుడి అరెస్టు
దుబాయ్: ఆయనకు కావాల్సినంత డబ్బుంది.. అందుకు తగ్గట్టే కొంచెం తిక్క కూడా ఉంది. ఆ తిక్క చేష్టలే ఇప్పుడాయన్ని కటకటాలపాలు చేశాయి. బ్యాంక్ అకౌంట్లో కోటానుకోట్ల నగదు ఉంచుకుని కూడా బిచ్చమెత్తుకుంటూ పోలీసులకు దొరికిపోయిన ఆ వ్యక్తి సంగతేంటో చూద్దాం.. ఆదివారం సాయంత్రం.. ముస్లింలు ఉపవాసాలు విడిచే సమయం.. కువైట్ నగరంలో పేరుమోసిన మసీదు వద్ద.. కొద్దిగా చిరిగిన బట్టలతో ఓ వ్యక్తి నించున్నాడు. 'ధర్మం చెయ్యండి బాబయ్యా..' అంటూ తనదైన భాషలో నమాజ్‌కు వెళ్లొస్తున్నవారందరినీ అర్ధిస్తున్నాడు. ఇది గమనించిన పోలీసులు ఒక్క ఉదుటన అక్కడికి చేరుకుని అతణ్ని అరెస్టు చేశారు. కువైట్ దేశంలో భిక్షాటన నిశేధం. ఒక్క కువైటే కాదు గల్ఫ్ కో- ఆపరేషన్ కౌన్సిల్ లోని బెహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ, యూఏఈ వంటి దేశాల్లోనూ అడుక్కోవడం చట్టవ్యతిరేకం. అలా అతడ్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తర్వాత అసలు కథ మొదలైంది. సదరు వ్యక్తి పేరు, చిరునామా ఇతర వివరాలు తెలుసుకున్న పోలీసులు.. పనిలోపనిగా అతడి బ్యాంకు ఖాతా వివరాలనూ చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఆ విదేశీ బిక్షగాడి అకౌంట్లో ఐదువేల కువైట్ దినార్లు (మన కరెన్సీలో దాదాపు 10 కోట్లు) ఉన్నాయి. ఇంత డబ్బూ పెట్టుకుని ఎందుకురా అడుక్కుంటున్నావ్? అని పోలీసులు అడిగితే.. 'దానం తీసుకుంటే పుణ్యం దక్కుతుందిగా' అంటూ తలతిక్క సమాధానాలు చెప్పాడు. దీంతో అతనిపై మరింత బలమైన కేసులు మోపేందుకు సిద్ధమవుతున్నారు కువైట్ పోలీసులు. ఆసియా సహా ఇతర ప్రాంతాల నుంచి వెళ్లి కువైట్‌లో భిక్షాటన చేస్తోన్న 22 మందిని ఆ దేశం గత ఏప్రిల్ లో వెనక్కి వెళ్లగొట్టడం గమనార్హం.