బెగ్గర్ ఆడి కారులో వెళుతూ.. 'ఫేస్బుక్క'య్యాడు | The beggar with a sports car | Sakshi
Sakshi News home page

బెగ్గర్ ఆడి కారులో వెళుతూ.. 'ఫేస్బుక్క'య్యాడు

Published Thu, Mar 3 2016 4:42 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM

బెగ్గర్ ఆడి కారులో వెళుతూ.. 'ఫేస్బుక్క'య్యాడు

బెగ్గర్ ఆడి కారులో వెళుతూ.. 'ఫేస్బుక్క'య్యాడు

లండన్: ఇంగ్లండ్లో 35 ఏళ్ల మాథ్యూ బ్రింటన్ అంటే ఇప్పుడు తెలియని వాళ్లు లేరు. అతనేమి రాజకీయ నాయకుడు కాదు, వ్యాపారవేత్త కాదు. సెలబ్రిటీ అంతకన్నా కాదు. న్యూక్వేలోని బ్యాంక్ స్ట్రీట్లో అడుక్కునే బిచ్చగాడు. భిక్షాటన ముగించుకొని 50 లక్షల రూపాయలు విలువచేసే ఆడి స్పోర్ట్స్ కారులో ఇంటికి బయల్దేరుతున్నప్పుడు ఎవరో ఫొటో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అత్యంత ఖరీదైన బిచ్చగాడుగా ఇప్పుడు అందరికి తెలిసి పోయింది.

ఫేస్బుక్ పోస్ట్తో అతని బతుకు బస్టాండ్ అయింది. పబ్లిక్ కార్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన అతని ఆడి కారును ఎవరో దొంగలెత్తుకు పోయారు. ఇప్పుడు ఎవరూ అతనికి బిచ్చం వేయడం లేదు. చూడగానే అసహ్యించుకుంటున్నారు. ఇల్లు, కారు పెట్టుకొని అడుక్కుతింటున్నావా అంటూ నానా బూతులు తిడుతున్నారు. ఫేస్బుక్లో వ్యతిరేకంగా కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి. ఇంతకాలం ప్రజల్ని మోసం చేసినందుకు చంపెస్తామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయి. బెదిరింపులు వస్తున్న మాట నిజమేనని, జాగ్రత్తగా ఉండాల్సిందిగా బ్రింటన్ను హెచ్చరించామని న్యూక్వే పోలీసు ఉన్నతాధికారి డేవ్ మెరిడిత్ మీడియాతో వ్యాఖ్యానించారు. అతన్ని ఎన్నో ఏళ్లుగా బ్యాంక్ స్ట్రీట్లో అడుక్కోవడం చూశానని, తాను పెద్దగా సహాయం చేయలేక పోయాయని మరో పోలీసు అధికారి తెలిపారు.

తాను అడుక్కున్న సొమ్ముతో ఖరీదైన కారు కొనుక్కోలేదని, అడుక్కోవడం వల్ల అంత సొమ్ము తనకెప్పుడూ రాలేదని, తన తాత గిఫ్టు కింద ఆ కారు ఇచ్చి వెళ్లారని బ్రింటన్ వాపోతున్నాడు. ఫేస్బుక్ ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదని, అది చూసే డివైస్ కూడా తన వద్ద లేదని, ఇప్పుడు అదే ఫేస్బుక్ తన కొంప ముంచిందని బ్రింటన్ బావురుమంటున్నాడు.

కాయకష్టం చేసుకొని బతికేంత ఆరోగ్యంగా అతను ఉండడంతోపాటు అతను పెంచుకుంటున్న కుక్క కూడా అంతే ఆరోగ్యంగా ఉంది. ఫేస్బుక్లో అతనికి అనుకూలంగా కూడా కొన్ని కామెంట్లు వచ్చాయి. ఎందుకతన్ని ఆడిపోసుకుంటారు. కుక్కను బాగానే చూసుకుంటున్నాడు కదా!....ఒకరి గురించి జడ్జ్ చేయడానికి మనం ఎవరం...అంటూ కామెంట్లు వచ్చాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement