ధర్మవరం రైల్వేస్టేషన్ వద్ద గంజాయి విక్రయిస్తున్న యాచకుడిని పట్టణ పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
ధర్మవరం అర్బన్ : ధర్మవరం రైల్వేస్టేషన్ వద్ద గంజాయి విక్రయిస్తున్న యాచకుడిని పట్టణ పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. యాచకుడి నుంచి అర కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రైల్వేస్టేషన్‌లో ఉండే యాచకుడు గంజాయిని తీసుకొచ్చి పట్టణంలో నివసిస్తున్న కలకత్తా వారికి విక్రయించేవాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న పట్టణ పోలీసులు శుక్రవారం రాత్రి గంజాయి విక్రయిస్తున్న యాచకుడిని పట్టుకుని అతడి వద్దనుంచి అర కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గంజాయి విలువ రూ.లక్ష వరకు ఉంటుందని పోలీసుల ద్వారా తెలిసింది. శనివారం గంజాయి విక్రయిస్తున్న యాచకుడిని అరెస్టు చూపనున్నారు.