
సాక్షి, చెన్నై: భారతదేశంలో పర్యటించటానికి వచ్చిన రష్యా యువకుడు విధి వక్రించి బిచ్చగాడిగా మారాడు. అధికారులు అతడి విషయం తెలుసుకుని రష్యా రాయబార కార్యాలయం అధికారులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన బెర్నకోల్(25) భారత దేశంలోని ఆలయాలను చూడడానికి సెప్టెంబర్ 8న భారత్‌కు వచ్చాడు. రైలులో సోమవారం రాత్రి 8.15 గంటలకు కాంచీపురం చేరుకున్నాడు.
చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు కావడంతో మనీ తీయడానికి ఏటీఎంలో ప్రయత్నించాడు. ఏటీఎం పాస్‌వర్డ్ తప్పుగా ఎంటర్ చేయడంతో కార్డు లాక్ అయిపోయింది. చేతిలో పైసా లేకపోవడంతో విరక్తి చెందిన అతడు కార్డును విరిచేశాడు. డబ్బు కోసం ఏం చేయాలో తెలియక రాత్రంతా కాంచీపురంలోని వీధుల వెంట తిరిగాడు. మంగళవారం ఉదయం కుమరకోట్టం ప్రాంతంలో గల మురుగన్ ఆలయం పరిసరాల్లో భిక్షమెత్తుకోవటం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకుని శివకంచి పోలీసులు అతడిని మంగళవారం రైలులో చెన్నైకు తీసుకు వచ్చి దౌత్య కార్యాలయ అధికారులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment