
చిన్న పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ల దాకా అందరూ ఇష్టపడే కార్టూన్ స్పైడర్ మ్యాన్ . దీనిపై వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఈలలు కొట్టించాయి. సినిమాలో ఎవరికైనా కష్టం ఉందనగానే స్పైడర్ మ్యాన్ చటుక్కున ప్రత్యక్షమవుతాడు. ఎంతటి సాహసానికైనా పూనుకుని వారిని కాపాడతాడు. అలాంటి స్పైడర్ మ్యాన్‌కు నిజ జీవితంలో ఓసారి కష్టం వచ్చింది. అప్పుడు ఓ యాచకుడు అతన్ని ఆదుకుని గండం నుంచి గట్టెక్కించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. స్పైడర్ మ్యాన్ సినిమాలో హీరోగా నటించిన టామ్ హాలండ్ లండన్‌లో షాపింగ్‌కు వెళ్లాడు. అక్కడ ట్రాలీని తీసుకోడానికి ఒక పౌండ్ (భారత కరెన్సీలో రూ.92) రుసుము ఇవ్వాలి. అయితే ఈ హీరో దగ్గర చిల్లర లేక ఇబ్బందిపడుతున్నాడు. (‘జుమాంజి’ నటికి కరోనా)
దీన్ని దూరం నుంచి గమనించిన ఓ యాచకుడు అతనికి ఆ పౌండ్‌ను అందించి సాయపడ్డాడు. అయితే షాపింగ్ అనంతరం టామ్ ఆ భిక్షగాడి దగ్గరకు వెళ్లి అతనిచ్చిన ఒక్క పౌండ్‌ను తిరిగివ్వడమే కాకుండా మరో వంద పౌండ్లను అదనంగా ఇచ్చాడు. ఇది అక్కడే ఉన్న ఓ తల్లీకూతుళ్లను ఆశ్చర్యచకితులను చేసింది. స్పైడర్ మ్యాన్ గొప్ప మనసుతో అతనికి రెట్టింపు సాయం చేయడాన్ని చూసి తమ కళ్లల్లో నీళ్లు తిరిగాయని వారు పేర్కొన్నారు. 23 యేళ్ల టామ్ హాలండ్.. స్పైడర్ మ్యాన్ నటి జెండయాతో డేటింగ్‌లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. (రుచి...వాసన తెలియడంలేదు)
Comments
Please login to add a commentAdd a comment