నిరూపించడానికి ప్యాంటు విప్పాడు! | beggar busted faking his disability after a passerby dragged off his trousers | Sakshi
Sakshi News home page

నిరూపించడానికి ప్యాంటు విప్పాడు!

Published Sat, Jul 2 2016 8:57 AM | Last Updated on Tue, Jul 31 2018 5:31 PM

నిరూపించడానికి ప్యాంటు విప్పాడు! - Sakshi

నిరూపించడానికి ప్యాంటు విప్పాడు!

బీజింగ్: పైకి కనిపించేవన్నీ నిజాలు కావు. పైపై నటనలను చూసి మోసపోవద్దని చెబుతుంటారు. అయితే నిజం తెలిసేదెలా. చైనాలో బిచ్చగాడు చేస్తున్న మోసాన్ని తెలిపేందుకు ఓ వ్యక్తి పెద్ద సాహసమే చేశాడు. నడిరోడ్డుపై అతడి ప్యాంటు విప్పి నిల్చోబెట్టాడు. ఇంతకీ ప్యాంటులో ఉన్న నిజం ఏమిటంటారా.

కొంతమంది వ్యక్తులు తమ శరీరంలోని కొన్ని భాగాలు సక్రమంగా పనిచేయకపోయినా ఆత్మవిశ్వాసంతో జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడం చూస్తూనే ఉంటాం. మరికొందరు మాత్రం అన్నీ సక్రమంగా ఉన్నా అడ్డదారిలో బ్రతుకుంతుంటారు. ఈ  రెండోరకానికి చెందిన బిచ్చగాడి బండారాన్ని ఓ వ్యక్తి బయటపెట్టాడు. చక్రాల బండిపై బోర్లాపడుకొని కాళ్లులేని వాడిగా నటిస్తూ బిక్షాటన చేస్తున్న వ్యక్తిని.. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి ఎలా కనిపెట్టాడో తెలియదు కానీ అతడికి కాళ్లు ఉన్నాయని కనిపెట్టాడు. అంతే.. ఒక్కసారిగా అతడి వద్దకు వెళ్లి అతడి ప్యాంటు విప్పాడు. లోదుస్తుల్లో రెండు కాళ్లను కట్టేసుకొని.. కాళ్లు లేనివాడిగా నటిస్తున్న బిచ్చగాడు బిక్కమొహంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement