trouser
-
అదృష్టం బాగుంది.. కొంచెమైతే పరువు పోయేదే!
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టి20 బ్లాస్ట్ టోర్నమెంట్లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్‌లో ఫీల్డర్ క్యాచ్ అందుకునే క్రమంలో ప్యాంట్ జారిపోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యార్క్‌షైర్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు కావాల్సి ఉంది. అయితే మరో రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరమైన దశలో లంకాషైర్ బౌలర్ హై ఫుల్‌టాస్ వేశాడు. క్రీజులో ఉన్న షాదాబ్ సిక్స్ కొట్టబోయే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకి గాల్లోకి లేచింది. మిడాఫ్ నుంచి పరిగెత్తుకొచ్చిన డేన్ విలా క్యాచ్ అందుకునే ప్రయత్నం చేసినప్పటికి మిస్ అయింది. దీంతో బంతిని తీసుకోవడానికి పైకి లేచిన డేన్ ప్యాంట్ ఒక్కసారిగా కిందకు జారింది. షాక్ తిన్న డేన్ విలా.. ''ఎవరైనా చూశారేమో..నాకు సిగ్గేస్తుందన్న'' తరహాలో అక్కడే కూలబడ్డాడు. ఆ తర్వాత పైకి లేచి ప్యాంటును సర్దుకొని బంతిని విసిరేశాడు. ఈ వీడియోనూ విటాలిటీ బ్లాస్ట్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. ''అరె కొంచమైతే పరువు మొత్తం పోయేదే.. క్యాచ్ పట్టడం సంగతి దేవుడెరుగు.. ముందు పరువు పోయేది'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్ టైగా ముగిసింది. యార్క్‌షైర్‌కు చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. 12 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంకాషైర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 41 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఇక టి20 బ్లాస్ట్ టోర్నమెంట్లో యార్క్‌షైర్ రెండో స్థానంలో ఉండగా.. లంకాషైర్ ఏడో స్థానంలో ఉంది. చదవండి: Paul Stirling: ఒక్క ఓవర్లో 34 పరుగులు.. అయినా మొహంలో చిరాకే! If the #RosesT20 didn't have enough drama... Dane Vilas had an unfortunate moment 😂#Blast22 pic.twitter.com/WBq2gSpMRx — Vitality Blast (@VitalityBlast) May 28, 2022 -
శారీతో.. ప్యాంట్!
న్యూలుక్ శారీస్‌తో స్కర్టులు, గౌన్లు, లెహంగాలను రూపొందించడం తెలిసిందే! ఇలా ట్రౌజర్ ప్యాంట్గానూ డిజైన్ చేస్తే?! కుర్తా, టాప్స్‌కు కొత్త అందాలను అద్దవచ్చు. మోడ్రన్‌గా వెలిగిపోవచ్చు. దీనికోసం మందంగా ఉండే దుపట్టాలనూ ఉపయోగించవచ్చు. ∙పాత మోడల్ అనుకున్న జరీ, పువ్వుల ప్లింట్లు ఉన్న చీరలు లేదా దుపట్టాలను ఎంచుకోవాలి. కొలతల ప్రకారం కావల్సినంత ఫ్యాబ్రిక్ తీసుకొని ప్యాంట్‌గా డిజైన్ చేయాలి. పూర్తి కాంట్రాస్ట్ పువ్వుల డిజైన్లలో ఉన్న కలర్ టాప్ ధరిస్తే స్టైలిష్‌గా కనిపిస్తారు. ఈవెనింగ్, వెస్ట్రన్ వేడుకలకు ఈ ప్యాంట్స్ బాగా నప్పుతాయి ∙పూర్తి ప్లెయిన్ సిల్క్ శారీస్‌తోనూ రూపొందించుకోవచ్చు ∙కాటన్ శారీ లేదా దుపట్టాలను ఇలా ట్రౌజర్ ప్యాంట్‌గా రూపొందించుకొని ధరిస్తే సౌకర్యంగానూ, స్టైలిష్‌గానూ ఉంటాయి. -
నిరూపించడానికి ప్యాంటు విప్పాడు!
బీజింగ్: పైకి కనిపించేవన్నీ నిజాలు కావు. పైపై నటనలను చూసి మోసపోవద్దని చెబుతుంటారు. అయితే నిజం తెలిసేదెలా. చైనాలో బిచ్చగాడు చేస్తున్న మోసాన్ని తెలిపేందుకు ఓ వ్యక్తి పెద్ద సాహసమే చేశాడు. నడిరోడ్డుపై అతడి ప్యాంటు విప్పి నిల్చోబెట్టాడు. ఇంతకీ ప్యాంటులో ఉన్న నిజం ఏమిటంటారా. కొంతమంది వ్యక్తులు తమ శరీరంలోని కొన్ని భాగాలు సక్రమంగా పనిచేయకపోయినా ఆత్మవిశ్వాసంతో జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడం చూస్తూనే ఉంటాం. మరికొందరు మాత్రం అన్నీ సక్రమంగా ఉన్నా అడ్డదారిలో బ్రతుకుంతుంటారు. ఈ రెండోరకానికి చెందిన బిచ్చగాడి బండారాన్ని ఓ వ్యక్తి బయటపెట్టాడు. చక్రాల బండిపై బోర్లాపడుకొని కాళ్లులేని వాడిగా నటిస్తూ బిక్షాటన చేస్తున్న వ్యక్తిని.. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి ఎలా కనిపెట్టాడో తెలియదు కానీ అతడికి కాళ్లు ఉన్నాయని కనిపెట్టాడు. అంతే.. ఒక్కసారిగా అతడి వద్దకు వెళ్లి అతడి ప్యాంటు విప్పాడు. లోదుస్తుల్లో రెండు కాళ్లను కట్టేసుకొని.. కాళ్లు లేనివాడిగా నటిస్తున్న బిచ్చగాడు బిక్కమొహంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
ప్యాంట్ జేబులో సెల్ 'బాంబ్'
మీరు సెల్ ఫోన్ ప్యాంట్ జేబులో స్టయిలిష్ గా పెట్టుకుని తిరుగుతున్నారా? అయితే ఆ పనిని తక్షణమే మానేయండి. ఎందుకంటే సెల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ వల్ల మగవారికి వంధ్యత్వం వస్తుంది. ఈ విషయం బ్రిటన్ లో జరిగిన ఒక పరిశోధన లో వెల్లడైంది. ఈ రేడియేషన్ వీర్యాన్ని ప్రభావితం చేస్తుంది. బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ కి చెందిన బయో సైన్సెస్ విభాగం ప్రొఫెసర్ ఫియోనా మాథ్యూస్ ఈ విషయాన్ని తెలియచేశారు. ఇప్పటికే ఎంతో కొంత వంధ్యత్వం ఉన్న వారికి, ప్రారంభ దశలో ఉన్న వారికి సెల్ ఫోన్ రేడియేషన్ మరింత చేటు చేస్తుందట. ప్రపంచ వ్యాప్తంగా 14 శాతం మంది పురుషుల్లో సంతాన హీనత సమస్య ఉంది. సెల్ రేడియేషన్ కూడాదీనికి ఒక ప్రధాన కారణమని అధ్యయనం పేర్కొంటోంది. ఈ పరిశోధనలో వీర్య కణాల కదలికలు, అవి జీవించే కాలం, వీర్యకణాల సంఖ్య ఆదారంగా వీర్యం నాణ్యతను అంచనా వేశారు. సెల్ ఫోన్ జేబులో ఉంచుకునే వారిలో, ఉంచని వారిలో స్పెర్మ్ క్వాలిటీ ఎలా ఉందన్న విషయాన్ని అధ్యయనం చేశారు. సెల్ ఫోన్ రేడియేషన్ వీటిని దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాథ్యూస్ చెబుతున్నారు.